Telanagna Politics Another U-turn, Minister Jupalli Krishnarao meets BRS MLA Bandla Krishnamohan Reddy

Hyd, Aug 1:  తెలంగాణ రాజకీయాలు రోజుకో టర్న్ తీసుకుంటున్నాయి. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మనసు మార్చుకుని తిరిగి సొంతగూటికి చేరుతారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది. బుజ్జగింపు రాజకీయాలను షురూ చేసింది. ఇందులో భాగంగా మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాగా , బీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు చెప్పిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు మంత్రి జూపల్లి కృష్ణారావు.

పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ దీపాదాస్‌ మున్షీ, ప్రభుత్వ సలహాదారు నరేందర్‌ రెడ్డితో కలిసి పోచారం ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లిన విషయం తెలిసిందే. ఇక తాజాగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఎమ్మెల్యే ఇంట్లో భోజనం చేసిన కృష్ణరావు ఆయన్ని బుజ్జగించినట్లు తెలుస్తోంది.

ఇక తిరిగి సొంతగూటికి చేరుతారని ప్రచారం జరుగుతున్న ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు స్వయంగా సీనియర్ కాంగ్రెస్ నేతలే రంగంలోకి దిగారు. కాంగ్రెస్‌లో చేరే వరకు తమతో సంప్రదింపులు జరిపి, ఆ తర్వాత త మను గాలికి వదిలేశారని ఎమ్మెల్యేల్లో అసంతృప్తి పెరిగిన నేపథ్యంలో హస్తం నేతల భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నించినా అపాయింట్‌మెంట్ దొరకడం లేదని కొంతమంది ఎమ్మెల్యేలు చెబుతున్న పరిస్థితి నెలకొంది. అలాగే కాంగ్రెస్ నేతలే తమపై విమర్శలు చేస్తుండటం కూడా ఎమ్మెల్యేలు సీనియర్ నేతల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్, పోలీస్ రాజ్యంగా తెలంగాణ మారిందని మండిపాటు, సీఎం ఛాంబర్ ముందు బైఠాయింపు

అందుకే అసెంబ్లీ సమావేశాల్లో కూడా అంటిముట్టనట్లు ఉంటున్నామని చెప్పినట్లు సమాచారం. దీంతో ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. పోచారం ఇంటికి వెళ్లి స్వయంగా మాట్లాడారు. త్వరలోనే మిగితా ఎమ్మెల్యేలతో భేటీ అయి వారి రాజకీయ భవిష్యత్‌పై స్పష్టమైన హామీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా తెలంగాణ పాలిటిక్స్ రోజుకో టర్న్ తీసుకుంటండగా పార్టీ మారిన ఎమ్మెల్యేల నిర్ణయం ఎలా ఉండనుందో వేచిచూడాలి.

Here's Tweet: