Telangana: ఈనెల 16న తెలంగాణ కేబినేట్ సమావేశం, కీలక అంశాలపై చర్చ; రాష్ట్రంలో కొత్తగా 336 కోవిడ్19 కేసులు నమోదు, 5 వేలకు పైబడి ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య
ఈ పథకం పైలట్ ప్రాతిపదికన మరో నాలుగు మండలాల్లో అమలు చేయబడుతుందని సీఎం ప్రకటించిన నేపథ్యంలో కేబినెట్ అధికారికంగా ఆమోదించనుంది....
Hyderabad, September 14: ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సెప్టెంబర్ 16న ప్రగతి భవన్‌లో జరగనుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ మరియు తేదీని నిర్ణయించే అవకాశంపై కేబినెట్ చర్చించనున్నట్లు తెలిసింది. సెప్టెంబర్ 25 నుంచి అసెంబ్లీ మరియు కౌన్సిల్ సమావేశాలు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో, ఎజెండా ఎలా ఉండాలనే దానిపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకోనున్నారు.
అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు మరియు దళిత బంధు పథకంపై కూడా కేబినెట్ చర్చిస్తున్నట్లు తెలిసింది. ఈ పథకం పైలట్ ప్రాతిపదికన మరో నాలుగు మండలాల్లో అమలు చేయబడుతుందని సీఎం ప్రకటించిన నేపథ్యంలో కేబినెట్ అధికారికంగా ఆమోదించనుంది. ప్రభుత్వంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీతో పాటు పంటల సాగు, వరి సేకరణ తదితర అంశాలపై కేబినేట్ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం తెలంగాణలో గల కోవిడ్ కేసులను పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 76,481 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 336 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 2015 మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 6,62,202కి చేరుకుంది. ఈరోజు వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 96 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:
నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.
గడిచిన 24 గంటల్లో కోవిడ్19తో పోరాడి ఒకరు చనిపోయారు.. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,898కు పెరిగింది.
అలాగే సాయంత్రం వరకు మరో 306 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 6,53,022 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,282 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.