Mla Medipally Sathyam Wife Suicide Case: భరించలేని కడుపునొప్పే ఆత్మహత్యకు కారణం, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య సూసైడ్ కేసులో కీలక వివరాలను వెల్లడించిన మేడ్చల్ ఏసీపీ రాములు
రూపాదేవి అల్వాల్ పంచశీల కాలనీలోని తన ఇంట్లో గురువారం రాత్రి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు
Hyd, June 21: . గురువారం రాత్రి 11.30 గంటలకు రూపాదేవి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తమకు సమాచారం అందిందని తెలిపారు. వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నట్లు చెప్పారు.
రూపాదేవి కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నారని... దాదాపు మూడేళ్లుగా తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నట్లు చెప్పారు. ఆమె చికిత్స తీసుకున్నారని... హోమియో మందులు కూడా వాడారని తెలిపారు. అయినప్పటికీ కడుపు నొప్పి తగ్గకపోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు చెప్పారు. ఈ డిప్రెషన్‌లో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లుగా చెప్పారు. చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య ఆత్మహత్య.. అల్వాల్ లోని నివాసంలో ఉరి వేసుకున్న రూపాదేవి.. భార్య మృతదేహం చూసి స్పృహ కోల్పోయిన ఎమ్మెల్యే
రూపాదేవి తాను ఆత్మహత్య చేసుకోవడానికి ముందు మేడిపల్లి సత్యంకు ఫోన్ చేశారు. ఆ సమయంలో ఎమ్మెల్యే చొప్పదండిలో ఉన్నారు. తాను తీవ్రమైన కడుపునొప్పతో బాధపడుతున్నట్లు భర్తకు తెలిపారు. దీంతో తాను వెంటనే బయలుదేరి వస్తున్నట్లు ఆయన చెప్పారు. కానీ భర్తతో ఫోన్ మాట్లాడిన తర్వాత రూపాదేవి బెడ్రూంలోకి వెళ్లి గడియ వేసుకొని ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
భార్యాభర్తల మధ్య ఎలాంటి విభేదాలు లేవు.. అంతా కలిసే ఉంటున్నారని, రూపా దేవి సూసైడ్ చేసుకునే సమయంలో ఆమె తల్లితోపాటు పిల్లలు ఇంట్లోనే ఉన్నారని ఏసీపీ తెలిపారు. భరించలేని కడుపునొప్పి ఆమె ఆత్మహత్యకు కారణం. ఆమె ఫోన్ కూడా వెరీఫై చేశాం.. సీజ్ చేశాం. అలాగే ఎలాంటి సూసైడ్ నోట్ కనిపించలేదు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని మేడ్చల్ ఏసీపీ రాములు పేర్కొన్నారు.