#HappyBirthdayKCR: సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, పలువురు ప్రముఖులు, కోటి మొక్కలు నాటేందుకు రంగం సిద్ధం, కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాజకీయ జీవితంలో ప్రముఖ ఘట్టాలను ఓ సారి తెలుసుకుందాం
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేడు పుట్టినరోజును (Telangana CM KCR Birthday) జరుపుకుంటున్నారు.ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇవాళ జాతీయ స్థాయి నేతల నుంచి, రాష్ట్ర స్థాయి నేతలు, కార్యకర్తల నుంచి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
Hyderabad, Feb 17: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేడు 68వ పుట్టినరోజును (Telangana CM KCR Birthday) జరుపుకుంటున్నారు.ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇవాళ జాతీయ స్థాయి నేతల నుంచి, రాష్ట్ర స్థాయి నేతలు, కార్యకర్తల నుంచి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు (PM Modi Greets Birthday Wishes to KCR) తెలిపారు. కలకాలం ఆయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
ప్రధాని మోదీతో పాటు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తదితరులు ట్విటర్ వేదికగా కేసీఆర్‌కు బర్త్‌డే విషెస్ తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ప్రజా సేవ చేస్తూ, మీకు మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయుష్షు కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను’’ అని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలుగులో ట్వీట్ చేశారు.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజు సందర్భంగా హరిత విప్లవంలో మరో అపూర్వ ఘట్టానికి నాంది పలుకనున్నారు. ‘కోటి వృక్షార్చన’ పేరిట గంట వ్యవధిలోనే రికార్డు స్థాయిలో ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలు నాటేందుకు రంగం సిద్ధం చేశారు. ఉద్యమ స్ఫూర్తితో సాగనున్న ఈ బృహత్ కార్యక్రమానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులతో పాటు టీఆర్‌ఎస్ శ్రేణులు ఇందులో భాగస్వాములు కానున్నారు.
PM Narendra Modi Wishes:
Om Birla Tweet
Nitin Gadkari Tweet
ఈ క్రమంలో సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని బుధవారం గ్రేటర్‌లో పలు కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ మంగళవారం తెలిపారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా బల్కంపేట ఆలయంలో ఎల్లమ్మ తల్లికి రెండున్నర కిలోల బంగారు చీరను బహుకరించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బహుకరించారు.
సీెం కేసీఆర్ 17 ఫిబ్రవరి, 1954న సిద్దిపేట జిల్లా చింతమడకలో జన్మించారని చెబుతుంటారు. అయితే వారి పూర్వీకులది చింతమడక కాదని తెలుస్తొంది. ఎగువ మానేరు డ్యాం నిర్మాణంలో వారి భూమి కోల్పోవడంతో చింతమడకకు వారు వలస వచ్చారు. అందుకే జలాశయాల కోసం భూ సేకరణ జరిగినప్పుడుల్లా తాము భూ నిర్వాసితులమేనని కేసీఆర్ చాలాసార్లు గుర్తు చేసిన సంధర్భాలు ఉన్నాయి. కేసీఆర్ కుంటుబం విషయానికి వస్తే ఒక అన్న, తొమ్మిది మంది అక్కాచెల్లెళ్లు. సిద్ధిపేట డిగ్రీ కళాశాలలో చరిత్ర, రాజనీతి శాస్త్రం, తెలుగు సాహిత్యం సబ్జెక్టులుగా బి.ఎ డిగ్రీ పట్టా పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఎ తెలుగు సాహిత్యం పూర్తి చేశారు. అయితే అదే విశ్వవిద్యాలయ శత వసంతాల వేడుకలను పూర్వ విద్యార్థి అయిన కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో నిర్వహించడం విశేషం.
పదిహేన్నేళ్ల వయసులో.. 1969, ఏప్రిల్ 23న శోభతో వివాహం అయింది. కేసీఆర్‌కు దైవభక్తి ఎక్కువ. తరచూ యాగాలు చేస్తుంటారు. అందుకే దేవాలయాల అభివృద్ధికి నడుం బిగించారు. యాదాద్రిని అద్భుత రీతిలో తీర్చిదిద్దుతున్నారు. దాదాపు రూ.1,800 కోట్ల వ్యయంతో ఈ ఆలయ పునఃనిర్మాణం చేస్తున్నారు. తిరుమల వేంకటేశ్వరుడికి బంగారు ఆభరణాలు, విజయవాడ కనకదుర్గకు ముక్కు పుడక, కురవి వీరభద్రస్వామికి బంగారు మీసాలు బహూకరించారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందించినట్లు కేసీఆర్ తెలిపారు.
కేసీఆర్‌కు ఎన్టీఆర్, అమితాబ్ సినిమాలంటే చాలా ఇష్టం. పౌరాణిక చిత్రాలను బాగా ఎంజాయ్ చేస్తారు. ఘంటసాల పాటలంటే ప్రాణం, ఆ పాటలు విని మంచిమూడ్‌లో వాటిని ఎదుటివారికి వినిపించడమంటే ఆయనకు ఇష్టం. పుస్తకాలంటే అమితమైన అభిమానం. కేసీఆర్‌కు తెలుగు, ఉర్దూ, హిందీ, ఆంగ్లంలో మంచి పట్టు ఉంది. అచ్చమైన తెలంగాణ భాష మాట్లాడి ప్రజలను చాలా బాగా ఆకట్టుకుంటారు. ఆయా సందర్భాల్లో మాట్లాడుతున్న సమయంలో పాడిన పద్యాలు.. కవితలు.. పాటలు, డైలాగ్స్ ప్రజలను అమితంగా ఆకట్టుకుంటాయి.
స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా 2009 నవంబర్ 29న నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు పది రోజుల పాటు ఆమరణ దీక్ష చేశారు. ‘ఆ పది రోజులు మానేసిన అన్నం బువ్వ ప్రజలకు బోనంకుండలో బెల్లం బువ్వ అయ్యింది’ అని కవులు పాటలు పాడారు. డిసెంబర్ 9న కేంద్రం ప్రకటనతో దీక్ష విరమించారు. జూన్ 2, 2014న ఏర్పడిన 29వ రాష్ట్రం తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ (గజ్వేల్ ఎమ్మెల్యే) బాధ్యతలు చేపట్టారు. 2018 సెప్టెంబర్ 6వ తేదీన అకస్మాత్తుగా ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. రెండోసారి టీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తీసుకొచ్చారు. రెండో దఫా సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
రాజకీయ జీవితంలో ప్రధాన ఘట్టాలు
సిద్ధిపేటలోని రాఘవపూర్ ప్రధాన వ్యవసాయ కో-ఆపరేటిప్ సొసైటీకి చైర్మన్
1983లో తొలిసారిగా ఎమ్మెల్యేగా సిద్దిపేట నుండి ఓటమి
1989, 1994, 1999, 2001లో వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నిక.
తొలిసారిగా 1987-88లో మంత్రి
1989-1993 వరకు తెలుగుదేశం పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షుడు
1999లో ఆంధ్రప్రదేశ్ ఉప శాసన సభాపతి
చంద్రబాబు తీరుకు నిరసనగా 2001 ఏప్రిల్ 21న డిప్యూటీ స్పీకర్ పదవికి, తెలుగుదేశం పార్టీకి రాజీనామా
2001 ఏప్రిల్ 27న ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపన
2003లో న్యూ స్టేట్స్ నేషనల్ ఫ్రంట్ కన్వీనర్‌గా బాధ్యతలు
2004 ఎన్నికల్లో తొలిసారి లోక్‌సభకు పోటీ, కరీంనగర్ నుంచి ఎంపీగా విజయం.
యూపీఏ-1 హయాంలో 2004-06 కాలంలో తొలిసారి కేంద్ర మంత్రి.
తెలంగాణపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ 2006లో యూపీఏ నుంచి బయటకు
కేంద్ర మంత్రిగా, కరీంనగర్ ఎంపీగా రాజీనామా..అనంతరం జరిగిన కరీంనగర్ ఉప ఎన్నికలో కేసీఆర్ రెండు లక్షల మెజార్టీతో విజయం
2009లో మహబూబ్‌నగర్ నుంచి ఎంపీగా గెలుపు.
2009 నవంబర్ 29న నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు 10 రోజులు ఆమరణ దీక్ష
డిసెంబర్ 9న కేంద్రం ప్రకటనతో దీక్ష విరమణ
జూన్ 2, 2014న ఏర్పడిన 29వ రాష్ట్రం తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి
2018 సెప్టెంబర్ 6వ తేదీన అకస్మాత్తుగా ప్రభుత్వం రద్దు, ముందస్తున ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్
రెండో సారి సీఎంగా అధికారంలోకి