New Horticulture Policy: రైతుల సాగు ఖర్చు తగ్గించాలి, అందుకోసం వెంటనే విధి విధానాలు రూపొందించండి, హార్టికల్చర్ యూనివర్శిటీని మరింత బలోపేతం చేయండి, అధికారులను ఆదేశించిన తెలంగాణ సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యానసాగును వీలైనంత ఎక్కువగా విస్తరించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు (CM KCR) ఆదేశించారు. నేలల స్వభావం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రంలో హార్టికల్చర్ విధానాన్ని రూపొందించాలని (New Horticulture Policy) వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులకు సూచించారు.
Hyderabad, Feb 27; తెలంగాణ రాష్ట్రంలో ఉద్యానసాగును వీలైనంత ఎక్కువగా విస్తరించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు (CM KCR) ఆదేశించారు. నేలల స్వభావం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రంలో హార్టికల్చర్ విధానాన్ని రూపొందించాలని (New Horticulture Policy) వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులకు సూచించారు. వ్యవసాయంలో మూస పద్ధతిని విడనాడాలని, ఉద్యాన పంటలపై పరిశోధనలు పెరగాలని తెలిపారు. ఇందుకోసం హార్టికల్చర్ యూనివర్శిటీని బలోపేతం (Prepare new horticulture policy) చేయాలని చెప్పారు.
తెలంగాణలో హార్టి కల్చర్ అభివృద్ధి దిశగా, ఆధునిక పద్ధ తుల్లో ఉద్యాన పంటల సాగుకోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇందు కోసం ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యా లయం ప్రాంగణంలో 300 ఎకరాలను కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. ఉద్యాన వర్సిటీ మౌలిక సౌకర్యాల రూపకల్పన అభివృద్ధికోసం వచ్చే బడ్జెట్లో నిధులను కేటాయిస్తామన్నారు. వంటిమామిడి, రామగిరి ఖిల్లా వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల సంఖ్యను పెంచాలని సీఎం నిర్ణయించారు. ఇప్పటికే 2,601 రైతు వేదిక నిర్మాణాలు పూర్తయ్యాయని, ఇదేస్ఫూర్తితో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, ముఖ్యపట్టణాల్లో గజ్వేల్ తరహా సమీకృత కూరగాయల మార్కెట్లను వీలైనంత త్వరగా ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు.
శుక్రవారం ప్రగతి భవన్‌లో ‘ఉద్యాన పంటల అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళిక’ అంశంపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిం చారు. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎస్ సోమేశ్‌కుమార్, వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, హార్టికల్చర్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, హార్టి్టకల్చర్ వర్సిటీ వీసీ నీరజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు.
రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, పట్టణాల్లో వీలైనంత త్వరగా గజ్వేల్ తరహా సమీకృత కూరగాయల మార్కెట్లను ఏర్పాటుచేయాలని ఆదేశించారు. వ్యవసాయరంగాన్ని మరింత బలోపేతంచేసే దిశగా తెలంగాణ హార్టికల్చర్ విధానాన్ని రూపొందించాలని సూచించారు. ఆధునిక పద్ధతుల్లో ఉద్యాన పంటల సాగుకోసం సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీని ఏర్పాటుచేయాలని, ఇందుకోసం 300 ఎకరాలను కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. ఉద్యాన పంటల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికపై శుక్రవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉద్యానపంటల సాగును పెంచడంపై పలుసూచనలు చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం మూసపద్ధతిలో సాగింది. ప్రాజెక్టుల కింద కాల్వల నీటితో సాగైన వరిపంటకే నాటి ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యమిచ్చాయి. దీంతో సాగునీటి కొరత తీవ్రంగాఉన్న తెలంగాణలో వ్యవసాయం వెనుకబడిపోయింది. ఈ ప్రాంతంలో వ్యవసాయాన్ని అంచనావేయడంలో గత పాలకులు వైఫల్యం చెందారు. సమగ్ర విధానమంటూ రూపొందించకపోవడంతో తెలంగాణలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరల్లాంటి తక్కువ నీటితో సేద్యమయ్యే ఉద్యానపంటల సాగు చాలావరకు విస్మరించబడింది. ఇప్పుడు సేద్యరంగంలో తెలంగాణ అగ్రగామిగా సాగుతున్నది. మన నేలల స్వభావం, పంటల విధానం అర్థమవుతున్నది.
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో నీరు పుష్కలంగా లభిస్తున్నప్పటికీ, తక్కువ నీటి వాడకంతో ఎక్కువ లాభాలు గడించేలా రైతాంగాన్ని ఉద్యానపంటల సాగు దిశగా ప్రోత్సహించాల్సిన అవసరమున్నది. ప్రభుత్వ ఉద్దేశాలను అర్థంచేసుకుని ఉద్యాన నర్సరీలను నెలకొల్పే.. పంటలసాగుకు ముందుకొచ్చే ఔత్సాహిక రైతులకు రైతుబంధుతోపాటు ప్రత్యేక ప్రోత్సాహకాలను అందించేందుకు వ్యవసాయ, ఉద్యానశాఖలు కార్యాచరణ రూపొందించాలి. పండ్లు, కూరగాయలు, పూలసాగులో ఉద్యానశాఖ ఇప్పుడెలా ఉన్నది? భవిష్యత్తులో ఎలా ఉండాలి? అనేదానిపై ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి’ అని సీఎం కేసీఆర్ సూచించారు.
రైతులకు పంటల సాగులో విపరీతమైన ఖర్చు పెరిగిపోతోంది, సాంకేతిక పరిజ్జానాన్ని అందిపుచ్చుకుని సాగువిధానాలను రూపొందించుకుని రైతు సాగు ఖర్చు తగ్గించుకునే దిశగా వ్యవసాయ శాఖ విధివిధానాలు రూపొందించుకోవాలి. ఇప్పటికే వ్యవసాయ శాఖ ఉద్యోగులు క్షేత్రస్థాయిలో రైతులతో మమేకమై పనిచేస్తున్నారు. రైతులు ఏయే పంటలు పండిస్తున్నారనే సమాచారాన్ని నమోదు చేసి, రైతుల సెల్ ఫోన్లకు కూడా మెసేజీలు పంపిస్తున్నారు. ఈ విధానం దేశంలో మరెక్కడా లేదు. కేంద్రం అమలు చేస్తున్న నూతన సాగు చట్టాలతో సంబంధం లేకుండా మన మార్కెట్లను మనం కాపాడుకుందాం..’’ అని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.
ఉద్యానశాఖలో పని విధానాన్ని వికేంద్రీకరణ చేసుకోవాలని, ఇందుకు పని విభజన జరగాల్సి ఉన్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. ఉద్యానశాఖకు ప్రస్తుతం ఒకే కమిషనర్ ఉన్నారని, ఇకనుంచి పండ్లతోటలు, కూరగాయలు, ఆకుకూరలు, పామాయిల్ సాగు కోసం నలుగురు ఉన్నతాధికారులను నియమించాలని సూచించారు. ఈ దిశగా క్షేత్రస్థాయి ఉద్యోగి వరకు పని విభజన జరగాలని ఆదేశించారు. ఉద్యానశాఖలో తక్షణమే పదోన్నతుల ప్రక్రియను చేపట్టాలని, తగినంతగా సిబ్బంది ఏర్పాటుకు విధివిధానాలు రూపొందించాలని, హార్టికల్చరిస్టులకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటుచేయాలని సూచించారు. రైతుకు లాభం చేకూర్చేలా దేశవ్యాప్తంగా సాగవుతున్న వివిధరకాల ఉద్యాన పంటలసాగుపై సీఎం కేసీఆర్ విస్తృతంగా చర్చించారు. కేంద్రం అమలుచేస్తున్న నూతన సాగుచట్టాలకు సంబంధం లేకుండా మన మార్కెట్లను మనం కాపాడుకుందామన్నారు. సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, హార్టికల్చర్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, హార్టికల్చర్ యూనివర్శిటీ వీసీ నీరజ, హార్టికల్చర్‌శాఖ అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణలో మొత్తం 129 మున్సిపాలిటీలు, గ్రేటర్ హైదరాబాద్ సహా, మరో 12 కార్పొరేషన్లు, ఇండస్ట్రియల్ నగరాలు, పట్టణాలున్నాయి. వీటన్నింటిలో నివసించే ప్రజలకు అవసరమైన కూరగాయలు, పండ్లు వంటి నిత్యావసరాలను అందించాల్సి ఉంది. ఆయా పట్టణాల చుట్టూ ఉండే కొందరు రైతులను ఎంపికచేసి.. కూరగాయలు తదితర ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాల్సిన అవసరమున్నది. తద్వారా తెలంగాణలోని పట్టణాలకు ఇతర రాష్ర్టాలు నుంచి కూరగాయలను దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండదు. కూరగాయలను విదేశాలకు ఎగుమతి చేసే దిశగా ఉద్యానశాఖ చర్యలు చేపట్టాలి’ అని సీఎం సూచించారు.
వంటిమామిడి, రామగిరి ఖిల్లా వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల సంఖ్యను పెంచాలని కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే 2,601 రైతు వేదిక నిర్మాణాలు పూర్తయ్యాయని, ఇదే స్ఫూర్తితో సామాన్య ప్రజల అవసరాలను దృష్టిలో వుంచుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు, ముఖ్య పట్టణాల సెంటర్లలో గజ్వేల్ తరహా సమీకృత కూరగాయల మార్కెట్లను వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)