TS Early Elections Row: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉండవు, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు, టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి స‌మావేశంలో క్లారిటీ ఇచ్చిన సీఎం కేసీఆర్

ఈ సమావేశంలో తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉండొచ్చన్న ఊహాగానాలపై (TS Early Elections Row) ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు క్లారిటీ ఇచ్చారు.

CM KCR Fire (photo-Twitter)

Hyd, Nov 15: ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన మంగళవారం టీఆర్‌ఎస్‌ (TRS) విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉండొచ్చన్న ఊహాగానాలపై (TS Early Elections Row) ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు క్లారిటీ ఇచ్చారు. షెడ్యూల్ ప్ర‌కార‌మే అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని స్ప‌ష్టం చేశారు. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లే ప్ర‌స‌క్తే లేదని తేల్చిచెప్పారు. పార్టీ శ్రేణులంతా ఎన్నిక‌ల‌కు సిద్ధం కావాల‌ని పిలుపునిచ్చారు.

తెలంగాణ భ‌వ‌న్‌లో మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు సీఎం కేసీఆర్ (CM KCR) అధ్య‌క్ష‌త‌న‌ ప్రారంభ‌మైన ఈ స‌మావేశంలో అసెంబ్లీ ఎన్నిక‌లకు స‌న్న‌ద్ధ‌త‌తో పాటు ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లే అంశంపై చ‌ర్చించారు.ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేల‌ను మార్చే ప్ర‌స‌క్తే లేద‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు, మంచి మిత్రుడుని కోల్పోయాం, కృష్ణ మరణం పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం

మ‌ళ్లీ పాత వారికే టికెట్లు ఇస్తామ‌ని పేర్కొన్నారు. ఎన్నిక‌ల‌కు ప‌ది నెల‌ల స‌మ‌యమే ఉంది. పార్టీ శ్రేణులంతా ఎన్నిక‌ల‌కు సిద్ధం కావాలి. ప్ర‌తి ఎమ్మెల్యే నిత్యం ప్ర‌జ‌ల‌తో మాట్లాడాలి అని సూచించారు. ఏవైనా స‌మ‌స్య‌లుంటే ప్ర‌భుత్వం దృష్టికి తేవాల‌ని కేసీఆర్ సూచించారు.స‌ర్వేల‌న్ని టీఆర్ఎస్‌కే అనుకూలంగా ఉన్నాయ‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. వంద శాతం మ‌ళ్లీ టీఆర్ఎస్‌దే అధికార‌మ‌ని తేల్చిచెప్పారు. మునుగోడు త‌ర‌హాలో ప‌టిష్ట ఎన్నిక‌ల వ్యూహం త‌యారు చేయాల‌ని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాగా ప‌ని చేయాలి. అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌ను విస్తృతంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని సూచించారు. ల‌బ్దిదారుల పూర్తి స‌మాచారం ఎమ్మెల్యేల వ‌ద్ద ఉండాలి. ఎమ్మెల్యేలు, కార్య‌క‌ర్త‌లు నిత్యం ప్ర‌జ‌ల‌తో మ‌మేకం కావాలి. ప్ర‌జ‌ల‌తో ఆత్మీయ స‌మ్మేళ‌నాలు నిర్వ‌హించాలి. టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల బ‌లంతో ఓట‌ర్లంద‌రినీ చేరుకోవాల‌ని కేసీఆర్ సూచించారు.

పార్టీని బలోపేతం చేసే దిశగా ఈ 10 నెలలు కష్టపడాలని చెప్పారు. మంత్రులు తమ నియోజకవర్గాలకు పరిమితం కాకుండా అంతటా తిరగాలన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఎమ్మెల్యేలు ఎవరి ప్రలోభాలకు లొంగొద్దని అన్నారు. మునుగోడు ఫలితాల్లో మెజారిటీ తగ్గడంపై పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్‌ సీరియస్‌ అయ్యారు. మళ్లీ సిట్టింగ్‌లకే టికెట్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. మంత్రులు ఎమ్మెల్యేల గెలుపు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. మూడోసారి కూడా మనదే గెలుపు అని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐకి ఇచ్చేందుకు నిరాకరించిన తెలంగాణ హైకోర్టు, హైకోర్ట్‌ సింగిల్‌ జడ్జి విజయ్‌సేన్‌రెడ్డి అధ్వర్యంలోనే దర్యాప్తు జరగాలని ఆదేశాలు

బీజేపీ నేతలు కవితను పార్టీ మారమని అడిగారు. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా?. ఎన్నికలు సమీపించే కొద్ది బీజేపీ రోజురోజుకు మరింతగా రెచ్చిపోతుంది. పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ హెచ్ఛరికలు జారీ చేశారు. అనవసర విషయాల జోలికి వెళ్లొద్దు. వివాదాస్పద విషయాల్లో తలదూర్చొద్దు అని హుకుం జారీ చేశారు. ఐటి, ఈడి, సిబిఐ దాడులకు భయపడాల్సిన పనిలేదన్నారు. బీజేపీ నుంచి ఎదుర‌య్యే దాడిని స‌మ‌ర్థంగా తిప్పికొట్టాలి. బీజేపీతో పోరాడాల్సిందేన‌ని కేసీఆర్ చెప్పారు. ప్ర‌భుత్వాల‌ను కూల‌గొట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. మ‌న ద‌గ్గ‌ర కూడా ప్ర‌య‌త్నించి అడ్డంగా దొరికారు. ఆ పార్టీ కుట్ర‌ల‌న్నింటినీ తిప్పికొట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.