Palle Pragathi-CM KCR: రంగంలోకి దిగుతున్న ఫ్లయింగ్ స్క్వాడ్స్, పల్లె ప్రగతిపై సమీక్షను నిర్వహించిన తెలంగాణా సీఎం కేసీఆర్, 2020 జనవరి 1 నుంచి ఆకస్మిక తనిఖీలు, ప్రభుత్వానికి నివేదికను సమర్పించనున్న ఫ్లయింగ్ స్క్వాడ్స్

పల్లె ప్రగతి పరిశీలన కోసం జనవరి 1 నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్స్ (Flying Squads) రంగంలో దిగుతున్నాయని తెలంగాణా (Telangana) సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి నివేదికలు ప్రభుత్వానికి సమర్పిస్తాయని వివరించారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులతో తనిఖీ బృందాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.

File image of Telangana CM KCR | File Photo

Hyderabad, December 22: తెలంగాణలో పల్లె ప్రగతి (Palle Pragathi) కార్యక్రమంపై సీఎం కేసీఆర్ (CM KCR) సమీక్ష నిర్వహించారు. పల్లె ప్రగతి పరిశీలన కోసం జనవరి 1 నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్స్ (Flying Squads) రంగంలో దిగుతున్నాయని తెలంగాణా (Telangana) సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి నివేదికలు ప్రభుత్వానికి సమర్పిస్తాయని వివరించారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులతో తనిఖీ బృందాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.

దిద్దుబాటు చర్యల కోసమే ఫ్లయింగ్ స్క్వాడ్లతో తనిఖీలు జరుపుతున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో పంచాయతీ రాజ్ శాఖను పటిష్టపరిచామని, ఇచ్చిన మాట ప్రకారం పల్లె ప్రగతికి ప్రతి నెల రూ.339 కోట్లు కేటాయిస్తున్నామని వెల్లడించారు. అలసత్వం వహిస్తే క్షమించేది లేదని, అధికారులు, ప్రజాప్రతినిధులకు ఇది పరీక్షలాంటిదని స్పష్టం చేశారు.

సెప్టెంబరులో 30 రోజుల పాటు నిర్వహించిన పల్లె ప్రగతి సత్ఫలితాలను ఇచ్చిందని, కార్యక్రమం జనాదరణ పొందిందని చెప్పారు. కాగా గ్రామాల్లో పచ్చదనం - పరిశుభ్రత పెంచడం లక్ష్యంగా తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ సర్కారు ఈ కార్యక్రమం చేపడుతోంది. పల్లె ప్రగతి కార్యక్రమంతో మంచి ఫలితం వచ్చిందని, మన ఊరిని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలనే అవగాహన ప్రజల్లో వచ్చిందని కేసీఆర్ గత రివ్యూ మీటింగ్‌లో అన్నారు.

ఈ స్ఫూర్తిని కొనసాగించడానికి భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు. గ్రామాలు బాగుపడాలనే ఉద్దేశంతో గ్రామ కార్యదర్శి నుంచి జిల్లా పంచాయతీ అధికారి వరకు అన్ని ఖాళీలను భర్తీ చేసినట్లు సీఎం వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే మరోసారి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.



సంబంధిత వార్తలు

No Pharma City In Kodangal: కొడంగ‌ల్ భూసేక‌ర‌ణ విష‌యంలో వెన‌క్కు త‌గ్గిన సీఎం రేవంత్ రెడ్డి, అక్క‌డ‌ వ‌చ్చేది ఫార్మా సిటీ కాదు, ఇండ‌స్ట్రీయ‌ల్ పార్క్ మాత్ర‌మే

Eknath Shinde: మహారాష్ట్ర సీఎం పదవిపై ఫిటింగ్ పెట్టిన ఏక్‌నాథ్ షిండే...సీట్లకు సీఎం పదవికి సంబంధం లేదని కామెంట్, ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్లే సీఎం కావాలని లేదని వెల్లడి

Bandi Sanjay: మహారాష్ట్ర ఫలితాలు తెలంగాణలోనూ రిపీట్ అవుతాయి, సీఎం రేవంత్ ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ ఓడిపోయిందన్న బండి సంజయ్...మోదీ అభివృద్ధి మంత్రమే పనిచేసిందని వెల్లడి

ICC To Conduct Emergency Meeting: ఛాంపియ‌న్స్ ట్రోఫీ నిర్వ‌హ‌ణ‌పై స‌స్పెన్స్ కు తెర ప‌డ‌నుందా? అత్య‌వ‌స‌ర స‌మావేశం ఏర్పాటు చేసిన ఐసీసీ