Rythu Bandhu: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్, రైతుబంధు విడుదల చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలు, ప్రస్తుతానికి ఎంతంటే..

ఇప్పటికే ట్రెజరీలో ఉన్న నిధుల విడుదలకు సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతుబంధు పేరుతో పంట పెట్టుబడి సాయాన్ని అందించారు

Representative Image ( Photo Credits : Wikimedia Commons )

Hyd, Dec 11: తెలంగాణ రైతులకు పంట పెట్టుబడి సాయం చెల్లింపులను తెలంగాణ కొత్త ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటికే ట్రెజరీలో ఉన్న నిధుల విడుదలకు సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతుబంధు పేరుతో పంట పెట్టుబడి సాయాన్ని అందించారు. అయితే కొత్త ప్రభుత్వం ఈ విషయంలో ఇంకా విధివిధానాలను ఖరారు చేయలేదు. దీంతో ప్రస్తుతానికి గతంలోని విధివిధానాల ప్రకారమే పెట్టుబడి సాయం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ ఎన్నిక తేదీ ఇదిగో, వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌ను ఖరారు చేసిన కాంగ్రెస్

ఈ సాయం కింద ప్రతి ఆరు నెలలకు ఎకరానికి రూ.5000 అందిస్తారు. ఏడాదిలో రెండు పర్యాయాలు... మొత్తం రూ.10,000 అందిస్తున్నారు. అయితే తమ ప్రభుత్వం వచ్చాక ఎకరాకు ఏడాదికి రూ.15,000 పెట్టుబడి సాయం అందిస్తామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలోనూ పెట్టారు. అయితే ఇంకా విధివిధానాలు ఖరారు చేయకపోవడంతో ఈసారికి గత విధివిధానాల ప్రకారం ఇవ్వనున్నారు.



సంబంధిత వార్తలు

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

Andhra Pradesh: మంగళగిరి ఎయిమ్స్‌ మొదటి స్నాతకోత్సవం, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు బంగారు పతకాలు అందజేసిన రాష్ట్రపతి ముర్ము, ప్రతి డాక్టర్‌ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపు

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు

Uttar Pradesh Horror: యూపీలో 5 ఏళ్ళ బాలుడిపై దారుణ అత్యాచారం, హత్య, వెను భాగం నుంచి తీవ్ర రక్తస్రావం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు