Covid in Telangana: కరోనా భయంతో తెలంగాణలో రిటైర్డ్ జడ్జి ఆత్మహత్య, తాజాగా 1,718 మందికి కరోనా, 8 మంది మృతి, రాష్ట్ర వ్యాప్తంగా 1,97,327కు పెరిగిన కోవిడ్ కేసులు
ఇందులో కేవలం హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 285 నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,97,327 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, వైరస్ ప్రభావంతో ఇవాళ 8 మంది మృతి (Telangana covid deaths) చెందగా మొత్తం మరణించిన వారి సంఖ్య 1,153కు చేరింది. గడిచిన 24 గంటల్లో 2,002 మంది చికిత్సకు కోలుకొని ఇండ్లకు వెళ్లగా మొత్తం 1,67,846 మంది డిశ్చార్జి అయ్యారు.
Hyderabad, Oct 3: తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,718 పాజిటివ్ కేసులు (Covid in Telangana) నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో కేవలం హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 285 నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,97,327 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, వైరస్ ప్రభావంతో ఇవాళ 8 మంది మృతి (Telangana covid deaths) చెందగా మొత్తం మరణించిన వారి సంఖ్య 1,153కు చేరింది. గడిచిన 24 గంటల్లో 2,002 మంది చికిత్సకు కోలుకొని ఇండ్లకు వెళ్లగా మొత్తం 1,67,846 మంది డిశ్చార్జి అయ్యారు.
మరో 28,328 మంది దవాఖానల్లో చికిత్స పొందుతుండగా.. హోం ఐసోలేషన్‌లో 23,224 మంది ఉన్నారు. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.58 శాతంగా ఉండగా రికవరీ రేటు 85.05గా ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 49,084 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా మొత్తం 31,53,626 టెస్టులు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణలో కరోనా లక్షణాలు ఉన్నాయనే భయంతో శుక్రవారం రిటైర్డ్ జడ్జి రామచంద్రారెడ్డి ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన మియాపూర్ పరిధిలో చోటుచేసుకుంది. రిటైర్డ్ జడ్జి రామచంద్రారెడ్డి మియాపూర్‌లోని న్యూసైబర్ హిల్స్‌లో కుటుంబంతో కలసి నివసిస్తున్నాడు. కాగా గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే తనకు కరోనా లక్షణాలు ఉన్నాయేమోనన్న భయంతో రామచంద్రారెడ్డి తన ఇంట్లోని బెడ్‌రూంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కాగా బెడ్‌రూంలో సూసైడ్ నోట్ కూడా లభ్యమైంది. తన వల్ల ఇంట్లో ఉన్న కుటుంబసభ్యలుకు కరోనా సోకకూడదనే ఉద్దేశంతోనే ఆత్యహత్యకు పాల్పడుతున్నట్లు రామచంద్రారెడ్డి సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. రామచంద్రారెడ్డి కుమారుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.