Telangana Election Commission: మీ ఓటు మార్చుకోవాలని అనుకుంటున్నారా? ఈ తేదీలోగా దరఖాస్తు చేసుకోకపోతే మీ ఓటు గల్లంతే! తెలంగాణ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
జనవరి ఆరున ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రచురించి అదే రోజునుంచి 22వ తేదీవరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. వచ్చిన దరఖాస్తులను ఫిబ్రవరి రెండవ తేదీవరకు పరిష్కరిస్తారు.
Hyderabad, DEC 24: మీకు ఓటు హక్కు లేదా ? ఓటర్ కార్డులో తప్పులున్నాయా ? అడ్రస్ మార్చుకోవాలనుకుంటున్నారా ? (Voter List Correction) ఇలాంటి వాళ్ల కోసమే రాష్ట్ర ఎన్నికల కమిషన్ (Telangana Election Commission) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది. జనవరి 6వ తేదీనుంచి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు పేర్కొంది. ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, తప్పొప్పుల సవరణ, చిరునామాల మార్పు తదితర అంశాలకు సంబంధించిన దరఖాస్తులు (Voter List Correction Dates) ఈ సందర్భంగా స్వీకరించనున్నారు. 2024 జనవరి ఒకటవ తేదీలోగా 18 సంవత్సరాలు నిండినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి ఆరున ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రచురించి అదే రోజునుంచి 22వ తేదీవరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. వచ్చిన దరఖాస్తులను ఫిబ్రవరి రెండవ తేదీవరకు పరిష్కరిస్తారు. ఫిబ్రవరి 6లోగా డేటాబేస్‌లో అప్‌డేట్ చేసినతరువాత ఫిబ్రవరి 8న తుది జాబితా ప్రచురిస్తారు.
వచ్చే ఏడాది అక్టోబర్‌లోగా 18సంవత్సరాలు నిండుతున్నవారు కూడా ముందస్తుగా ఓటర్ల జాబితాలో పేరు నమోదుకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అయితే, వీరి దరఖాస్తుల పరిశీలన మాత్రం అక్టోబర్ 1 తరువాత నిర్వహించే ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం సందర్భంగా చేపడతారు. ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1లోగా 18సంవత్సరాలు పూర్తవుతున్నవారు కూడా ఓటర్ల జాబితాలో పేరు నమోదు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.
Prashanth Kishore Meets Chandrababu: చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్..
మరోవైపు, ఈ నెల 20వ తేదీనుంచి వచ్చే ఏడాది జనవరి ఐదవ తేదీ పోలింగ్ స్టేషన్ల రీ-ఎరేంజ్‌మెంట్, ఓటర్ల జాబితా, గుర్తింపు కార్డుల్లోని లోపాల సవరణ, ఓటర్ల జాబితాలోని ఫోటోల్లోని లోపాల సవరణ, పోలింగ్ కేంద్రాల సరిహద్దుల సవరణ తదితర ప్రక్రియను పూర్తిచేయనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ ఇదే
సమీకృత ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ – 2024 జనవరి 6- 06-01-24
సవరణలు, అభ్యంతరాలకు గడువు – 2024 జనవరి 6 నుంచి జనవరి 22 వరకు
దరఖాస్తుల పరిష్కారం – 2024 ఫిబ్రవరి 2
డేటాబేస్‌లో అప్‌డేట్ - 2024 ఫిబ్రవరి 6
ఓటర్ల తుది జాబితా ప్రచురణ -2024 ఫిబ్రవరి 8