Telangana Election Results 2023: తెలంగాణలో 8 సీట్లను కైవసం చేసుకుని పుంజుకున్న బీజేపీ, కమలం గెలిచిన స్థానాలు ఇవే..

మొత్తం 111 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ మొత్తం 8 స్థానాల్లో విజయం సాధించింది. ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన ఎంపీల్లో సోయం బాపూరావు, ధర్మపురి అరవింద్, బండి సంజయ్‌ ఓటమి పాలయ్యారు

Representational Image (File Photo)

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన ఓట్ల శాతాన్ని, సీట్ల సంఖ్యను గణనీయంగా పెంచుకుంది. మొత్తం 111 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ మొత్తం 8 స్థానాల్లో విజయం సాధించింది. ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన ఎంపీల్లో సోయం బాపూరావు, ధర్మపురి అరవింద్, బండి సంజయ్‌ ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేనకు 8 స్థానాలు కేటాయించి కమలం పార్టీ మొత్తం 111 చోట్ల పోటీ చేసింది.

ఇందులో బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించింది. గెలిచిన వారిలో కామారెడ్డి నుంచి కాటిపల్లి వెంకట రమణారెడ్డి, ముథోల్‌లో రామ్‌రావ్‌ పవార్‌, ఆదిలాబాద్‌లో పాయల్‌ శంకర్‌, ఆర్మూర్‌లో పైడి రాకేశ్‌ రెడ్డి, నిజామాబాద్‌ అర్బన్‌లో ధనపాల్‌ సూర్యనారాయణ, గోషామహల్‌లో రాజాసింగ్‌, నిర్మల్‌లో ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, సిర్పూర్‌ నుంచి పాల్వాయి హరీశ్‌రావు ఉన్నారు. అయితే పోటీ చేసిన 8 స్థానాల్లో జనసేన కనీసం గట్టి పోటీ ఇవ్వలేకపోయింది.పూర్తిగా డిపాజిట్లు కోల్పోయింది.

మనం భారత్‌ను గెలిపించాలి, నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై స్పందించిన ప్రధాని మోదీ

2018 అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలకు 118 చోట్ల పోటీ చేసిన బీజేపీ 105 చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. ఈ సారి 111 స్థానాల్లో పోటీ చేసి 8 సీట్లను గెలుచుకుంది. గత ఎన్నికల్లో కేవలం 7 శాతం ఓట్లనే తెచ్చుకోగా ఈ సారి 13 శాతం ఓట్లను తెచ్చుకుంది.

అయితే హైదరాబాద్ పరిధిలో బీజేపీ ఈ సారి చతికిలపడింది. కేవలం గోషా మహల్ నుంచి రాజాసింగ్ మాత్రమే గెలిచారు. పాతబస్తీలోని బహుదూర్‌పుర, చార్మినార్, కార్వాన్, యాకుత్‌పుర, మహేశ్వరం, గజ్వేల్, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు కమలం హోరా హోరీగా పోటీనిస్తూ వచ్చింది.అయితే ఈ సారి ఆ ప్రభావం కనిపించలేదు. కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సొంత నియోజకర్గమైన అంబర్ పేటలోనూ కమలం అభ్యర్థి కృష్ణ యాదవ్ మూడో స్థానానికి పరిమితమయ్యారు.ఇక దుబ్బాకలో రఘునందన్ రావు ఘోర పరాజయం చవి చూశారు. రెండు స్థానాల్లో పోటీ చేసిన ఈటల రాజేందర్ రెండు చోట్లా ఘోర పరాజయం పాలయ్యారు.

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై స్పందించిన ప్రధాని మోదీ, తెలంగాణతో మా బంధం విడదీయరానిదంటూ ట్వీట్

ఈ ఫలితాలపై ప్రధాని మోదీ సైతం సంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘బీజేపీకు మద్దతుగా నిలిచిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు. గత కొన్నేళ్లుగా మీ సహాయ సహకారాలతోనే ముందుకు వెళ్తున్నాం. ఇది భవిష్యత్‌లోనూ కొనసాగాలి. తెలంగాణతో మా అనుబంధం ఎవరూ తెంచలేరు. రాష్ట్ర ప్రజల కోసం మరింత కష్టపడతాం. ఎన్నికల్లో కమలం అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేసిన ప్రతి కార్యకర్తకు నా అభినందనలు’’ అని తెలిపారు.



సంబంధిత వార్తలు

Woman Chops Off Boyfriends Private Parts: పెళ్లికి ఒప్పుకోలేద‌ని బాయ్ ఫ్రెండ్ ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన యువ‌తి, ఆపై చేతిని కోసుకొని ఆత్మ‌హ‌త్య‌, ఆ త‌ర్వాత ఏమైందంటే?

DGP Jitender: వారు సినిమాల్లోనే హీరోలు...బయట పౌరులే, చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవన్న డీజీపీ జితేందర్, మోహన్ బాబుది ఫ్యామిలీ పంచాయితీ అన్న తెలంగాణ డీజీపీ

MP Kiran Kumar Reddy: అల్లు అర్జున్‌పై ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్, బన్నీ రియల్ హీరో కాదు, స్క్రిప్ట్ తీసుకొచ్చి చదివారని ఆగ్రహం వ్యక్తం చేసిన భువనగిరి ఎంపీ

Navya Haridas File Petition In Kerala HC: ప్రియాంక గాంధీ ఎంపీగా అన‌ర్హురాలు, త‌ప్పుడు మార్గంలో గెలిచారు, హైకోర్టులో పిటీష‌న్ వేసిన బీజేపీ అభ్య‌ర్ధి

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif