PM Modi (Photo-ANI)

మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో హ్యాట్రిక్‌ విజయాలు సాధించేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుతూ భారత ప్రజలు సుపరిపాలన, అభివృద్ధి రాజకీయాలను ఎంచుకున్నారని ఫలితాలు సూచిస్తున్నాయని అన్నారు. ఈ అన్ని రాష్ట్రాల కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా తల్లులు, సోదరీమణులు, కుమార్తెలు, మన యువ ఓటర్లకు, బిజెపిపై వారి ప్రేమ, విశ్వాసం మరియు ఆశీర్వాదాలను కురిపించినందుకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు.మీ సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని వారికి హామీ ఇస్తున్నాను.

ఈ సందర్భంగా కష్టపడి పనిచేస్తున్న పార్టీ కార్యకర్తలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు! మీరందరూ అద్భుతమైన ఉదాహరణగా నిలిచారు. అభివృద్ధి చెందిన భారతదేశమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. మనం ఆగాల్సిన అవసరం లేదు, అలసిపోకూడదు. మనం భారత్‌ను గెలిపించాలి. ఈ రోజు మనం కలిసి ఈ దిశలో ఒక బలమైన అడుగు వేశామని ట్వీట్ చేశారు.

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్ చేశారు. ప్రియమైన తెలంగాణా సోదరులారా..తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు. గత కొన్ని సంవత్సరాలుగా, ఈ మద్దతు పెరుగుతోంది మరియు రాబోయే కాలంలో కూడా ఈ ధోరణి కొనసాగుతుంది.తెలంగాణతో మా బంధం విడదీయరానిదని, ప్రజల కోసం పని చేస్తూనే ఉంటాం.ప్రతి బీజేపీ కార్యకర్త చేస్తున్న కృషిని కూడా నేను అభినందిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై స్పందించిన ప్రధాని మోదీ, తెలంగాణతో మా బంధం విడదీయరానిదంటూ ట్వీట్

Here's PM Modi Tweet