తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ షాకిచ్చింది. మెజార్టీ సీట్లను కైవసం చేసుకుని అధికార ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. తాజా ట్రెండ్స్ ప్రకారం కాంగ్రెస్‌ పార్టీ ఆధిక్యంలో ఉంది. బీజేపీ పార్టీ ఎక్కడా గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. తాజా ఫలితాలపై ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్ చేశారు.

నా ప్రియమైన తెలంగాణా సోదరులారా..తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు. గత కొన్ని సంవత్సరాలుగా, ఈ మద్దతు పెరుగుతోంది మరియు రాబోయే కాలంలో కూడా ఈ ధోరణి కొనసాగుతుంది.తెలంగాణతో మా బంధం విడదీయరానిదని, ప్రజల కోసం పని చేస్తూనే ఉంటాం.ప్రతి బీజేపీ కార్యకర్త చేస్తున్న కృషిని కూడా నేను అభినందిస్తున్నాను అంటూ మోదీ ట్వీట్ చేశారు.

Here's Modi Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)