Telangana Election Results 2023: కొడంగల్‌లో 32,800 ఓట్ల మెజార్టీతో రేవంత్ రెడ్డి ఘన విజయం, దుబ్బాకలో రఘునందన్ రావు ఓటమి, ఇప్పటివరకు గెలిచిన అభ్యర్థులు వీరే..
ఇక దుబ్బాకలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఓటమి పాలయ్యారు. దుబ్బాకలో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది.
Assembly Election 2023 Results Live News Updates: తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాల్లో దూసుకెళ్తోంది. ఇక దుబ్బాకలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఓటమి పాలయ్యారు. దుబ్బాకలో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. రఘునందన్ రావుపై బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచిన రఘునందన్ రావు ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో భద్రాచలం నియోజకవర్గం లో భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి తెల్లం వెంకటరావు విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థిపై ఏకంగా 4280 ఓట్ల తేడాతో భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి తెల్లం వెంకటరావు విజయం సాధించారు. ఇక ఆటో అంబర్పేటలో భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి కాలేరు వెంకటేష్ విజయం సాధించారు. అందోల్, నల్గొండలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విజయకేతనం ఎగురవేశారు.బీఆర్ఎస్ అభ్యర్థులపై వారు విజయం సాధించారు.
కొడంగల్‌లో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై 32,800 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే ఎన్నికల ప్రచారం సందర్భంగా మంత్రి కేటీఆర్ రోడ్డు షోలో మాట్లాడుతూ.. కేసీఆర్ కాళ్లు మొక్కయినా నరేందర్ రెడ్డికి కీలక పదవి ఇస్తానని చెప్పిన ప్రజలు రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపడం గమనార్హం.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటమి పాలయ్యారు. పాలకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని ఓటమి పాలయ్యారు. నారాయణ్‌ఖేడ్ కాంగ్రెస్ విజయం సాధించింది. హుజుర్‌నగర్‌లో 46వేల మెజార్టీతో ఉత్తమ్ కుమార్ విజయం సాధించారు. వేములవాడలో కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ విజయం సాధించారు.నిర్మల్‌లో మహేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. ఖమ్మం ఆశ్వారావుపేటలో, భద్రాద్రి కొత్తగూడెం ఇల్లెందు, రామగుండంలో కాంగ్రెస్ విజయం సాధించింది.
భద్రాద్రి కొత్తగూడెంలో ఆ పార్టీ అభ్యర్థి కోరం కనకయ్య గెలుపొందారు. సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ (BRS) అభ్యర్థి బానోతు హరిప్రియానాయక్‌పై 25వేలకు పైగా మెజారిటీతో ఆయన విజయం సాధించారు. 2014లో హరిప్రియపైనే గెలిచిన కనకయ్య.. 2018లో ఓటమి పాలయ్యారు. మళ్లీ ఇప్పుడు ఆమెపైనే జయకేతనం ఎగురవేశారు. అలాగే ఖమ్మం ఆశ్వారావుపేటలో కాంగ్రెస్ విజయం నమోదు చేసింది. 28,358 ఓట్లతో ఆది నారాయణ గెలుపు బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై గెలుపొందారు.
ఇక రామగుండంలో కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్‌పై ఆయన గెలుపొందారు. మరోవైపు చార్మినార్‌లో ఎంఐఎం విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి మీర్ జుల్ఫికర్ అలీ గెలిచారు. మలక్ పేట, చాంద్రాయణగుట్ట, బహుదూర్ పురా నియోజకవర్గాల్లోనూ ఎంఐఎం అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. అదే సమయంలో మూడు సిట్టింగ్ స్థానాల్లో ఎంఐఎం వెనుకంజలో ఉండడం ఆ పార్టీ నాయకత్వాన్ని కలవరపెడుతోంది.