Telangana Election Results 2023: రేపు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం, ఈ రోజు రాత్రి సీఎల్పీ సమావేశం జరిగే అవకాశం ఉన్నట్లుగా వార్తలు

ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం, ప్రభుత్వం ఏర్పాటు సోమవారం ఉంటుందని పార్టీ అధికార వర్గాలు తెలిపాయి.

Telangana Congress chief Revanth Reddy along with party leaders DK Shivakumar and others celebrates the party's lead in the state elections

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం, ప్రభుత్వం ఏర్పాటు సోమవారం ఉంటుందని పార్టీ అధికార వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ నగరంలోని ఎల్బీ స్టేడియంలో సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. కాగా ఆదివారం రాత్రి సీఎల్పీ సమావేశం జరిగే అవకాశముంది.

ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా, రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసైకి రాజీనామా పత్రం అందజేసిన బీఆర్ఎస్ అధినేత

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 64 స్థానాల్లో విజయం సాధించింది. తెలంగాణలో మొత్తం 119 స్థానాలు ఉండగా.. ప్రభుత్వం ఏర్పాటుకు 60 స్థానాలు అవసరం. ఇప్పటికే గెలుపొందిన ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోని తాజ్‌ కృష్ణ హోటల్‌కు చేరుకుంటున్నారు. మరో వైపు పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఏఐసీసీ పరిశీలకులు సేకరించనున్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిశీలకులు అధిష్ఠానానికి పంపిన తర్వాత సీఎం అభ్యర్థి ఎంపికపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.

ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి రాజీనామా చేశారు. సీవోడీ ద్వారా తన రాజీనామా లేఖను గవర్నర్ కు పంపించారు.