Telangana Assembly Elections 2023: దళిత బంధు తెచ్చిన మొగోడు ఎవరైనా ఉన్నారా? సత్తుపల్లి బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో ప్రతిపక్షాలపై సీఎం కేసీఆర్ ఫైర్

స‌త్తుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వాలు దళితులను ఓటు బ్యాంకుగానే వాడుకున్నాయని ,ప్రతీసారీ దళితులు మోసానికి గురయ్యారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ విమర్శించారు

CM KCR (Photo-Video Grab)

Hyd, Nov 1: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ దూకుడును పెంచాయి. స‌త్తుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వాలు దళితులను ఓటు బ్యాంకుగానే వాడుకున్నాయని ,ప్రతీసారీ దళితులు మోసానికి గురయ్యారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ విమర్శించారు. చాలా రాష్ట్రల్లో దళితులపై దాడులు జరుగుతున్నాయని, ఇది ప్రజాస్వామ్య దేశమా? అని ప్రశ్నించారు. ఎన్నికలులు వస్తుంటాయి, పోతుంటాయని.. పార్టీ ప్రజలకు ఏం చేసిందో గమనించి ఓటు వేయాలన్నారు.

ద‌ళిత‌బంధు పుట్టించిన మొగోడు ఎవ‌రండి ఈ దేశంలో.. కేసీఆర్ అనేటోడు రాక‌ముందు ద‌ళిత బంధు ఈ దేశంలో ఉండేనా..? అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌శ్నించారు. ద‌ళిత‌బంధు పెట్ట‌మ‌ని ఎవ‌ర‌న్నా అడిగారా..? ఎవ‌డ‌న్న ఈ మొగోళ్లు ధ‌ర్నా చేసిండ్రా. ద‌ర‌ఖాస్తు పెట్టిండ్రా.. మ‌రి ఎవ‌డు పెట్టిండు. ఎందుకు పెట్టాము. ద‌య‌చేసి ఆలోచ‌న చేయాలి అని కేసీఆర్ ప్ర‌జ‌ల‌కు సూచించారు. సత్తుపల్లిలో 70 వేలకు పైగా మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. దళితుల శ్రేయస్సు గురించి ఎవ్వరూ ఆలోచించలేదన్న కేసీఆర్‌.. దళితుల అభివృద్ధి కోసం దళిత బంధుతెచ్చామని తెలిపారు.

వీడియో ఇదిగో, ఆంధ్రప్రదేశ్ రోడ్లపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు, డబల్ రోడ్ వస్తే తెలంగాణ.. సింగల్ రోడ్ వస్తే ఆంధ్రప్రదేశ్ అంటూ సెటైర్

‘సత్తుపల్లి చాలా చైతన్యం ఉన్న ప్రాంతం.. ఆరునూరైనా తెలంగాణలో గెలిచేది బీఆర్‌ఎస్‌ పార్టీనే. కొందరు ఏవేవో చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. అసెంబ్లీ గేటు తాకనీయం అంటూ పిచ్చిగా మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యంలో మీ ఆయుధం మీ ఓటు. ఓటు వేయడంలో మీదే స్వతంత్ర నిర్ణయం. అహంకారపూరితంగా మాట్లాడేవాళ్లకు బుద్ధి చెప్పండి. డబ్బు, మందు పంచితే ఓట్లు వేసేస్తారా?. నాలుగు డబ్బులు రాగానే అహంకారంగా మాట్లాడుతున్నారు. డబ్బు, అహంకార రాజకీయాలు ఎన్నాళ్లు చెల్లుతాయి.

గతంలో కరెంట్‌ ఏ విధంగా ఉండేది.. ఇప్పుడు ఎలా ఉంది. దేశంలో 24 గంటలు కరెంట్‌ ఇచ్చే రాష్ట్రం తెలంగాణ. ప్రధాని మోదీకి ప్రవేటైజేషన్‌ తప్ప మరేం తెలీదు. నాలుగు డబ్బులు రాగానే అహంకారంగా మాట్లాడుతున్నారు. కాంగ్రెసోళ్లు వస్తే ధరణీని తీసేస్తారంట. ధరణి లేకుంటే రైతుబంధు డబ్బులకు ఇబ్బంది పడాల్సిందే. ధరణితో రైతులకు ఎంతో మేలు జరిగింది. ధరణి ఉండాలా.. వద్దా?’ అని కేసీఆర్‌ ప్రశ్నించారు.

ఉత్త‌ర భార‌త‌దేశంలో ద‌ళితుల మీద రోజు దాడులే అని కేసీఆర్ గుర్తు చేశారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, బీహార్‌, రాజ‌స్థాన్‌, ప్ర‌ధాని సొంత రాష్ట్రం గుజ‌రాత్‌లో చాలా భ‌యంక‌ర‌మైన దాడులు జ‌రుగుతున్నాయి. మ‌హిళ‌ల‌ మీద మాన‌భంగాలు జ‌రుగుతున్నాయి. ఏంది ఈ వివ‌క్ష‌, ఏంది ఈ దురాగ‌తం. ఇది ప్ర‌జాస్వామ్య దేశ‌మా..? అరాచ‌క‌మా..? దీన్నంత‌న‌టిని క్రోడిక‌రించి, ఆలోచించి, ఇవాళ ముఖ్య‌మంత్రి అయినా త‌ర్వాత కాదు.. నేను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడు పిడికెడు మంది కార్య‌క‌ర్త‌ల‌తో ద‌ళిత చైత‌న్య జ్యోతి అని పెట్టుకుని కొన్ని కార్య‌క్ర‌మాలు చేశాం. ఈ రోజు ద‌ళిత‌బంధుకు కూడా అదే స్ఫూర్తి అని కేసీఆర్ పేర్కొన్నారు.