COVID-19 Test Price: కరోనా పరీక్ష టెస్ట్ చేస్తే రూ.2,200, తెలంగాణలో 27 ల్యాబ్స్‌లలో కోవిడ్-19 పరీక్షలు, మార్గదర్శకాలను విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
కరోనా పరీక్షలకు ప్రైవేట్ ల్యాబ్‌లకు అనుమతిస్తూ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రైవేట్ ల్యాబ్స్‌లో కరోనా పరీక్షలకు (COVID-19 Test) అనుమతివ్వడంతో.. అనుమానం ఉన్నవారు ఈజీగా పరీక్షలు (coronavirus) నిర్వహించుకునే అవకాశముంటుంది. దీంతో ప్రజలలో కరోనా భయం పోవడంతో పాటు మరింత జాగ్రత్తగా ఉండేందుకు అవకాశాలుంటాయి.
Hyderabad, June 16: కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పరీక్షలకు ప్రైవేట్ ల్యాబ్‌లకు అనుమతిస్తూ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రైవేట్ ల్యాబ్స్‌లో కరోనా పరీక్షలకు (COVID-19 Test) అనుమతివ్వడంతో.. అనుమానం ఉన్నవారు ఈజీగా పరీక్షలు (coronavirus) నిర్వహించుకునే అవకాశముంటుంది. దీంతో ప్రజలలో కరోనా భయం పోవడంతో పాటు మరింత జాగ్రత్తగా ఉండేందుకు అవకాశాలుంటాయి. తెలంగాణలో మొత్తం ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్, తాజాగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌కి కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్థారణ
తెలంగాణలో అత్యధిక కేసులు హైదరాబాద్‌లోనే నమోదవుతున్నాయి.ఈ నేపథ్యంలో హైదరాబాద్ పరిసరాల్లో 50 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం నుంచి గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా పరీక్షలు చేయడానికి ఏర్పాట్లు పూర్తిచేసింది. ఎంపిక చేసిన వనస్థలిపురం, బాలాపూర్, కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.
గతంలో పాజిటివ్ వచ్చిన వారి కుటుంబ సభ్యులు, కాంటాక్ట్ అయిన వారికి ఇక్కడ మొదటగా పరీక్షలు నిర్వహించనున్నారు. ఒక్కో కేంద్రంలో రోజుకు 150 మందికి పరీక్షలు నిర్వహించనున్నారు. మొదటి దఫాలో ఎంపిక చేసిన కేంద్రాల్లో ప్రారంభించిన ప్రభుత్వం మరికొన్ని రోజుల్లో వీటిని పెంచే యోచనలో ఉంది. త్వరలో ఫీవర్, కింగ్‌కోఠి, చెస్ట్, సరోజినీ ఆస్పత్రుల్లో కూడా ఈ అవకాశం అందుబాటులోకి వచ్చే అవకాశముంది. తెలంగాణలో 5 వేలు దాటిన మొత్తం కోవిడ్ నిర్ధారిత కేసుల సంఖ్య, గత 24 గంటల్లో కొత్తగా మరో 219 పాజిటివ్ కేసులు నమోదు, 187కు పెరిగిన కరోనా మరణాలు
ఇక ఆస్పత్రుల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు, చికిత్సలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఫీజులు నిర్ధారించిన నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ. శాంతికుమారి సోమవారం మార్గదర్శకాల ఉత్తర్వులు జారీ చేశారు. ప్యాకేజీలోకి వచ్చే అంశాలు, ప్యాకేజీయేతర అంశాలను అందులో పొందుపరిచారు. తెలంగాణలో రైతుబంధు నిధుల విడుదల, 10 రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం, ప్రభుత్వం సూచించిన పంటలే రైతులు వేయటం పట్ల ముఖ్యమంత్రి హర్షం
ల్యాబ్ పరీక్షలకు ఫీజులు
రొటీన్ వార్డ్ + ఐసోలేషన్ ఫీజు : 4,000 , ఐసీయూ (వెంటిలేటర్ లేకుండా) + ఐసోలేషన్ ఫీజు:7,500 , ఐసీయూ (వెంటిలేటర్ సహా) + ఐసోలేషన్ ఫీజు: 9,000
ల్యాబ్/హాస్పిటల్ వద్ద శాంపిల్ ఇస్తే రూ. 2,200 ఛార్జ్ చేస్తారు. ఇంటి వద్దకు వచ్చి శాంపిల్ సేకరిస్తే రూ. 2,800 ఛార్జ్ చేస్తారు.
ప్యాకేజీలో లభించేవి
ప్రభుత్వం నిర్దేశించిన ఈ ప్యాకేజీలన్నింట్లో రోగికి సీబీసీ, యూరిన్ రొటీన్, హైచ్‌ఐవీ స్పాట్, యాంటీ హెచ్‌ఐవీ, హెచ్‌బీఎస్, సీరం క్రియాటినైన్, యూఎస్‌జీ, 2డీ ఎకో, డ్రగ్స్, ఎక్స్‌రే, ఈసీజీ, కన్సల్టేషన్స్, బెడ్ చార్జెస్, మీల్స్‌తోపాటు ప్రొసిజర్స్ (రెలెస్ట్యూబ్ ఇన్సర్షన్, యూరినరీ ట్రాక్ట్ క్యాథెటరైజేషన్) సేవలు అందుతాయి.
ప్యాకేజీలో లభించనివి
పీపీఈ కిట్లు
ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్స్ (సెంట్రల్ లైన్ ఇన్సర్షన్, కీమోపోర్ట్ ఇన్సర్షన్, బ్రాంకోస్కొపిక్ ప్రొసిజర్, బైయాప్సీస్, యాసిటిక్/ప్లైరల్ టాప్పింగ్. వీటికి 2019 31 డిసెంబర్ నాటి ర్యాక్ రేట్ల ఆధారంగానే చార్జీ వసూలు చేయాలి.)
కోవిడ్–19 టెస్టింగ్ (ప్రభుత్వం నిర్దేశించిన ధరల ప్రకారం)
హైఎండ్ డ్రగ్స్ (ఇమ్యునోగ్లోబిన్, మెరోపెనమ్, పేరంటల్ న్యూట్రిషన్, టోసిల్‌జంబ్. వీటికి ఎంఆర్‌పీ ధరలే వసూలు చేయాలి)
హై ఎండ్ ఇన్వెస్టిగేషన్స్ (సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ, పీఈటీ స్కాన్, ఇతర ల్యాబ్ పరీక్షలు)
మార్గదర్శకాలు
కరోనా చికిత్స చేసే ప్రైవే టు ఆస్పత్రులు ప్రభుత్వం నిర్దేశించిన ధరలను డిస్‌ప్లే బోర్డుల్లో తప్పకుండా ప్రదర్శిస్తూ ఆ మేరకు మాత్రమే ఫీజులు వసూలు చేయాలి.
రోగులు, వారి బంధువుల కు సేవల వివరాలను వెల్లడించాలి.
పాజిటివ్ ఉన్నప్పటికీ లక్షణాలు లేని వా ళ్లు, అతితక్కువ లక్షణాలున్న వాళ్లను ఆస్పత్రుల్లో చే ర్చుకోవద్దు. వారిని హోం ఐసోలేషన్‌కు పరిమితం చేయాలి.
ఐసీఎంఆర్ అనుమతించిన ప్రైవేటు ల్యాబ్ లు, ఆస్పత్రులే కరోనా పరీక్షలు నిర్వహించాలి.
కరోనా అప్‌డేట్స్‌ను ప్రభు త్వం అభివృద్ధి చేసిన ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వెబ్‌సైట్‌లో సకాలంలో పొందుపరచాలి. ఇందుకు ప్రతి ల్యాబ్, ఆస్పత్రికి పరిశీలన తర్వాత యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లు జారీ అవుతాయి.
నిబంధనలకు లో బడి ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లు వ్యవహరించాలి.
కరోనా చికిత్సలు, పరీక్షలపై మార్కెటింగ్ చేసుకున్నట్లు ఫిర్యాదులొస్తే చర్యలు ఉంటాయి.
ప్రైవేటు ఆస్పత్రులు నిబంధనలు అ తిక్రమిస్తే టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు.
తెలంగాణలో కరోనా పరీక్షలు చేసే ప్రైవేటు ల్యాబ్స్ ఇవే
అపోలో హాస్పిటల్స్ లాబొరేటరీ సర్వీసెస్, జూబ్లీ హిల్స్
విజయ డయాగ్నొస్టిక్ సెంటర్, హిమాయత్ నగర్
విమ్తా ల్యాబ్స్, చర్లపల్లి
అపోలో హెల్త్ లైఫ్ ైస్టెల్, డయాగ్నొస్టిక్ లాబొరేటరీ, బోయినపల్లి.
డాక్టర్ రెమెడీస్ ల్యాబ్స్, పంజాగుట్ట
పాత్ కేర్ ల్యాబ్‌లు, మేడన్చల్
అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాథాలజీ ల్యాబ్ సైన్సెస్, లింగంపల్లి
మెడ్సిస్ పాత్లాబ్స్, న్యూ బోయినపల్లి
యశోద హాస్పిటల్ ల్యాబ్ మెడిసిన్ విభాగం, సికింద్రాబాద్
బయోగ్నోసిస్ టెక్నాలజీస్, మేడ్చల్, మల్కాజిగిరి
టెనెట్ డయాగ్నోస్టిక్స్, బంజారా హిల్స్
మ్యాప్మిజెనోమ్ ఇండియా లిమిటెడ్, మాధాపూర్
విరించి హాస్పిటల్, బంజారాహిల్స్
కృష్ణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, సికిందరాబాద్
లెప్రా సొసైటీ-బ్లూ పీటర్ పబ్లిక్ హెల్త్ అండ్ రీసెర్చ్ సెంటర్, చర్లపల్లి
లూసిడ్ మెడికల్ డయాగ్నోస్టిక్స్, సికిందరాబాద్
స్టార్ హాస్పిటల్ ల్యాబ్, బంజారాహిల్స్
ప్రభుత్వ ల్యాబ్‌లు:
గాంధీ మెడికల్ కాలేజి, సికింద్రాబాద్
ఉస్మానియా మెడికల్ కాలేజి, హైదరాబాద్
సర్ రోనాల్డ్‌రాస్ ఆఫ్ ట్రాపికల్ కమ్యూనికేషన్ డిసీజెస్, హైదరాబాద్
నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, హైదరాబాద్
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ హైదరాబాద్
ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజి, హైదరాబాద్
కాకతీయ మెడికల్ కాలేజి, వరంగల్
సెంటర్ ఫర్ సెల్యులార్ మాలిక్యులర్ బయాలజీ, హైదరాబాద్
సెంటర్ ఫర్ డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ డయాగ్నొస్టిక్స్, హైదరాబాద్
రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఆదిలాబాద్