Telangana Formation Day 2020: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, ఈ ఏడాది సాదాసీదాగా తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు , కోవిడ్-19 నేపథ్యంలో అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి కేసీఆర్

రాష్ట్రం ఏర్పడిన 2014 నుంచి అవరతణ దినోత్సవ వేడకలు అంగరంగం వైభవంగా జరగగా ఈ ఏడాది కోవిడ్ 19 దెబ్బ పడింది. లాక్ డౌన్ నేపథ్యంలో ఈ ఏడాది రాష్ట్రావతరణ వేడుకలను (Telangana formation day) నిరాడంబరంగా జరపాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (CM KCR) అధికారులను ఆదేశించారు.

Telangana CM KCR | File Photo

Hyderabad, June 2: దేశంలో కరోనావైరస్ ప్రభావిత రాష్ట్రాలలో ఒకటైన తెలంగాణలో ఈ సంవత్సరం రాష్ట్ర అవతరణ వేడుకలను (Telangana Formation Day 2020) నిరాడంబరంగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. రాష్ట్రం ఏర్పడిన 2014 నుంచి అవరతణ దినోత్సవ వేడకలు అంగరంగం వైభవంగా జరగగా ఈ ఏడాది కోవిడ్ 19 దెబ్బ పడింది. లాక్ డౌన్ నేపథ్యంలో ఈ ఏడాది రాష్ట్రావతరణ వేడుకలను (Telangana formation day) సాదాసీదాగా జరపాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (CM KCR) అధికారులను ఆదేశించారు. రెండు దశాబ్దాల టీఆర్ఎస్, పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఎగరవేసిన పార్టీ అధినేత, సీఎం కేసీఆర్, నిరాడంబరంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఉత్సవాలు

తెలంగాణ అమర వీరులకు నివాళులు అర్పించడం, అనంతరం జాతీయ పతాకావిష్కరణ జరపడం మాత్రమే నిర్వహించాలన్నారు. ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించవద్దని అధికారులకు సూచించారు. నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించి, అనంతరం ప్రగతి భవన్ లో పతాకావిష్కరణ చేయాలని నిర్ణయించారు. ఇక మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు తమ తమ కార్యాలయాల్లోనే మాత్రమే జాతీయ పతాకావిష్కరణ (flag Hosting) చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు.

అటు, అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ముందుగా అమరవీరులకు నివాళి అర్పించి, అనంతరం పతాకావిష్కరణ చేస్తారు. జిల్లా వరకేంద్రంలో నిర్వహించే ఎట్ హోమ్ కార్యక్రమంలో ముఖ్యమైన అధికారులతో మాత్రమే నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. 2014 జూన్ 2న ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై నేటికి ఆరు సంపత్సరాలు పూర్తయింది.



సంబంధిత వార్తలు

SBI Alert! ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలంటూ ఎస్బీఐ మేనేజర్ల పేరిట డీప్ ఫేక్ వీడియోలు, నమ్మొద్దని కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేసిన ఎస్బీఐ

Telangana: తెలంగాణలో భూమిలేని వారికి రూ.6 వేలు, సంచలన నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రాష్ట్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవిగో..

Telangana Congress: కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం తగదు...ఇదే కొనసాగితే ప్రజలు బుద్దిచెప్పడం ఖాయమని వెల్లడి

CM Revanth Reddy: 98 శాతం కులగణన పూర్తి, తెలంగాణకు బహుజనుల తల్లి కావాలి...దొడ్డి కొమురయ్య పేరు శాశ్వతంగా గుర్తుండిపోయేలా చర్యలు తీసుకుంటామన్న సీఎం రేవంత్ రెడ్డి

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif