#TelanganaFormationDay: తెలంగాణ ప్రజలకు ప్రధానితో పాటు పలువురు నేతల శుభాకాంక్షలు, ఆరేళ్ల తెలంగాణలో విజయాలు, సర్కారు విస్మరించిన అంశాలపై విశ్లేషణాత్మక కథనం
ఎంతో మంది తెలంగాణ అమరవీరుల త్యాగఫలంతో, ఉద్యమకారుల పోరాటంతో 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం (Telangana Formation Day) ఆవిర్భవించింది. నేటికి సరిగా ఆరేళ్లు పూర్తయి 7వ వసంతంలోకి అడుగుపెట్టింది. రాష్ట్రంలో కరోనా (Coronavirus) విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను నిరాడంబరంగా జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ (Telangana Formation Day 2020) సందర్భంగా అమరవీరులకు సీఎం కేసీఆర్ (CM K Chandrasekhar Rao) నివాళులు అర్పించారు. ప్రగతి భవన్ నుంచి గన్‌పార్క్ చేరుకున్న ఆయన అమర వీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. రెండు నిమిషాలపాటు ఆయన మౌనం పాటించారు.
Hyderabad, June 2: ఎంతో మంది తెలంగాణ అమరవీరుల త్యాగఫలంతో, ఉద్యమకారుల పోరాటంతో 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం (Telangana Formation Day) ఆవిర్భవించింది. నేటికి సరిగా ఆరేళ్లు పూర్తయి 7వ వసంతంలోకి అడుగుపెట్టింది. రాష్ట్రంలో కరోనా (Coronavirus) విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను నిరాడంబరంగా జరుగుతున్నాయి. మండే ఎండలకు బై..బై, కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు, ఈ ఏడాది విస్తారంగా వర్షాలు, దేశ వ్యాప్తంగా 102శాతం వర్షపాతం నమోదవుతుందని తెలిపిన వాతావారణ శాఖ
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ (Telangana Formation Day 2020) సందర్భంగా అమరవీరులకు సీఎం కేసీఆర్ (CM K Chandrasekhar Rao) నివాళులు అర్పించారు. ప్రగతి భవన్ నుంచి గన్‌పార్క్ చేరుకున్న ఆయన అమర వీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. రెండు నిమిషాలపాటు ఆయన మౌనం పాటించారు.
హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపీ సంతోష్ కుమార్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ అమరవీరులకు నివాళులు అర్పించారు. తెలంగాణ భవన్‌లోలో పార్టీ పార్లమెంటరీ నేత కే కేశవరావు జాతీయ జెండా ఎగురవేశారు. శాసనమండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
Here's KCR paying floral tributes to Telangana Martyrs at Gun Park
శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అసెంబ్లీలో జాతీయ జెండాను ఎగురవేశారు. అసెంబ్లీ ఆవరణలోని మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు ఇరువురు నేతలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. ముంబైకి మరో పెను ముప్పు, కరోనా వేళ విరుచుకుపడనున్న నిసర్గ తుఫాన్, మొత్తం నాలుగు రాష్ట్రాల్లో హై అలర్ట్, మత్స్యకారులకు హెచ్చరిక జారీ చేసిన ఐఎండీ
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ వృద్ధి పథంలో తెలంగాణ ప్రజలు విలువైన కృషి చేస్తున్నారని, వారంతా విస్తృత రంగాలలో రాణిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజల ప్రగతి, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్ చేశారు.
Here's PM Tweet
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కష్టపడి పనిచేసే తెలంగాణ ప్రజలు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. యావత్ దేశం గర్వించే సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం తెలుగువారి సొంతమని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం సుసంపన్న భవిష్యత్ దిశగా, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఆ మేరకు ఆయన తెలుగులో ట్వీట్ చేశారు.
Here's President of India Tweet
బీజేపీ నేత వెంకయ్యనాయుడు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఘనమైన చరిత్ర, సహజవనరులతోపాటు భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తున్న తెలంగాణ.. వివిధ రంగాల్లో గణనీయమైన ప్రగతితో దేశాభివృద్ధిలో తనవంతు పాత్రను కొనసాగిస్తూ.. మరింత సమృద్ధిని సాధించాలని ఆకాంక్షిస్తున్నానంటూ ట్వీట్ చేశారు.
Here's Vice President of India Tweet
నాటి నుంచి నేటి దాకా తెలంగాణ రూపురేఖలు
1969 నుండి 2014వరకు వివిధ దశలలో సాగిన తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది ఆత్మహత్యలు చేసుకొన్నారు. ప్రత్యేక తెలంగాణ అంశంపై 2010లో శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటై ఆరు ప్రతిపాదనలు చేసింది. ఆ ప్రతిపాదనలతో 2013, జూలై 30న ప్రత్యేక తెలంగాణ కొరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తీర్మానం చేసింది. 2013 అక్టోబరు 3న కేంద్ర మంత్రిమండలి ఆమోదం లభించింది. 2014, ఫిబ్రవరి 18న తెలంగాణ ఏర్పాటు బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతుతో లోకసభలో, ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదం పొందింది. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను ఆదేశిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు 2014 మార్చి 1న రాష్ట్రపతి ఆమోదం లభించగా, 2014 జూన్ 2వ తేదీన దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. తెలంగాణలో కొత్తగా మరో 94 పాజిటివ్ కేసులు, మరో 6 కరోనా మరణాలు నమోదు, రాష్ట్రంలో 2800కు చేరువైన మొత్తం కోవిడ్-19 బాధితుల సంఖ్య, 88కి పెరిగిన మరణాలు
తెలంగాణ వచ్చిన తరువాత రెండు పర్యాయాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ నుంచి కె. చంద్రశేఖర్ రావు నూతన తెలంగాణ ముఖ్యమంత్రిగా అయిదేళ్లు విజయవంతంగా పరిపాలించారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించింది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు విస్మరించారు. రెండో సారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ప్రజలను తన వైపు తిప్పుకుంది. ఆ పార్టీ నుంచి రెండో సారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన కేసీఆర్ సంక్షేమ పథకాలతో మరింతగా ప్రజలకు చేరువయ్యారు. ప్రధానంగా తెలంగాణకు సాగు,తాగు నీరు విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, ఈ ఏడాది సాదాసీదాగా తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు , కోవిడ్-19 నేపథ్యంలో అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి కేసీఆర్
కాళేశ్వరం ప్రాజెక్టు, సీతారామ, పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలు తదితర ప్రాజెక్టులతో కళకళ లాడుతోంది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలు రాష్ట్రానికి వెన్నెముకలా మారాయి.రైతు బంధు రైతు బీమా, కేసీఆర్ కిట్లు, ఆసరా పెన్షన్లు, కంటి వెలుగు వంటి పథకాలతో రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతోంది. ఐటీలోనూ మంచి ఫలితాలు రాబడుతోంది. అటు.. పారిశ్రామిక అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పరిశ్రమలకు రాయితీలతో పాటు సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు ఇచ్చేందుకు టీఎస్ ఐపాస్ వంటి విప్లవాత్మక విధానాలకు శ్రీకారం చుట్టింది. ఫలితంగా జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు దోహదపడింది. రెండు దశాబ్దాల టీఆర్ఎస్, పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఎగరవేసిన పార్టీ అధినేత, సీఎం కేసీఆర్, నిరాడంబరంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఉత్సవాలు
రైతు సంక్షేమం లక్ష్యంగా రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి ఏటా రూ. 10 వేల చొప్పున పెట్టుబడి సాయంగా అందిస్తున్న ప్రభుత్వం ప్ర తి రైతుకు రూ. 5 లక్షల జీవిత బీమా కల్పిస్తోంది. జీవిత బీమా ప్రీమియాన్ని కూడా ప్రభుత్వ మే చెల్లిస్తోంది. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, ఎరువులు, విత్తనాలపై సబ్సిడీ, నీటి తీరువా రద్దు వంటి నిర్ణయాలు అమలు చేస్తోంది.
విజయాలతో పాటు కొన్ని అపజయాలను కూడా కేసీఆర్ చవిచూశారు. ప్రధానంగా ఆరేళ్లలో నియామకాలను కల్పించడంలో మాత్రం తెలంగాణ రాష్ట్రం విఫలమైందని తెలుస్తోంది. తెలంగాణలో 2.86 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉండగా.. ఈ ఆరేళ్లలో 27 వేలకుపైగా మాత్రమే ఖాళీల భర్తీ జరిగిందని విద్యార్థి సంఘాలు వాదిస్తున్నాయి. దీంతో పాటుగా సంక్షేమ పథకాలు, సాగునీటి ప్రాజెక్టుల కారణంగా రాష్ట్రంపై అప్పుల భారం పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. కోర్టు కేసులతో టీఎస్‌పీఎస్సీ చేపట్టినా నియామకాలు ముందుకు కదలడం లేదు.
జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని తెలుస్తోంది. అంతే కాదు నిరుద్యోగ భృతి ఇస్తామని గత అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన టీఆర్ఎస్.. ఇప్పటికీ ఆ హామీని అమలు చేయడం లేదు. దీంతో నిరుద్యోగ యువత ఉద్యోగాల కల్పన విషయంలో తీవ్ర నిరాశతో ఉంది. ఇక డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం అమలు విషయంలోనూ ప్రజల్లో అసంతృప్తి ఉన్నట్లుగా తెలుస్తోంది.
2019 సెప్టెంబర్లో తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ ముందు ఉంచిన కాగ్ రిపోర్టు ప్రకారం రాష్ట్ర రుణ భారం రూ. 1.42 లక్షల కోట్లు. ఇక 2014-19 మధ్య తెలంగాణ సర్కారు ప్రాజెక్టులపై రూ.79 వేల కోట్లకుపైగా ఖర్చు చేసింది. ఈ నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరం నాటికే తెలంగాణ అప్పుల భారం రూ. 2 లక్షల కోట్లు దాటిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయాక తెలంగాణపై రూ.75 వేల కోట్ల అప్పుల భారం ఉంటే.. ఈ ఆరేళ్లలోనే అవి రూ. 2 లక్షల కోట్లు దాటాయని ప్రతిపక్షం విమర్శిస్తోంది.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2016లో ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజనతో 33 జిల్లాలుగా తెలంగాణ స్వరూపం మార్చుకుంది. వేగంగా జరుగుతున్న పట్టణీకరణను దృష్టిలో పెట్టుకొని కొత్తగా ఏడు కార్పొరేషన్లు, 76 మున్సిపాలిటీలు, 30 రెవెన్యూ డివిజన్లు, 131 మండలాలు ఏర్పాటయ్యాయి. కొత్తగా రూపొందించిన పంచాయతీరాజ్ చట్టం ద్వారా రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 4,383 గ్రామ పంచాయతీలతో కలుపుకొని మొత్తంగా పంచాయతీల సంఖ్య 12,751కు చేరింది.
సుదీర్ఘకాలంగా ఉన్న హైకోర్టు విభజన జరగడంతో 2019 జనవరి ఒకటో తేదీ నుంచి కొత్త హైకోర్టు మనుగడలోకి వచ్చింది. శాంతిభద్రతలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత భారీగా పోలీసు సిబ్బంది నియామకాన్ని చేపట్టడంతోపాటు పోలీసు శాఖను పునర్‌వ్యవస్థీకరించింది. దీంతో కొత్తగా ఏడు కమిషనరేట్లతోపాటు 25 పోలీసు సబ్ డివిజన్లు, 31 సర్కిళ్లు, 103 పోలీసుస్టేషన్లు కొత్తగా ఏర్పాటయ్యాయి.
ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ విద్యార్థుల కోసం కొత్తగా 661 రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలు ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. బాలికా విద్యను ప్రోత్సహించేందుకు సగం స్కూళ్లను వారికి కేటాయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థులు విదేశీ విద్యను అభ్యసించేందుకు ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకం, యూపీఎస్సీ, టీఎస్‌పీఎస్సీ లాంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేక స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేసింది. వరంగల్‌లో కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటుతోపాటు కొత్తగా ఐదు మెడికల్ కాలేజీలు, బీబీనగర్‌లో ఎయిమ్స్ ఏర్పాటైంది. వరంగల్‌లో సైనిక్ స్కూల్‌తోపాటు కొత్తగా 15 కేంద్రీయ విద్యాలయాలు మంజూరయ్యాయి.
తెలంగాణ ఏర్పాటు నాటికి రూ. 66,276 కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతులు 2019–20 నాటికి రూ. 1.28 లక్షల కోట్లకు చేరడం రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధికి అద్దం పడుతోంది. 2016లో రాష్ట్ర ప్రభుత్వం ఐటీ పాలసీని విడుదల చేయగా ప్రపంచంలోనే ఐదు అగ్రశ్రేణి కంపెనీలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫేస్‌బుక్, సేల్స్‌ఫోర్స్ హైదరాబాద్‌లో వాటి రెండో అతిపెద్ద కార్యాలయాలను ఏర్పాటు చేశాయి. ఐటీ రంగంలో హైదరాబాద్‌ను మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లేందుకు 65 వేల చదరపు అడుగుల్లో నిర్మించిన ఇంక్యుబేషన్ సెంటర్ ‘టీ–హబ్’, ‘వీ–హబ్’ద్వారా స్టార్టప్‌లకు ప్రోత్సాహం అందిస్తోంది. 2014 నూతన పారిశ్రామిక చట్టం ద్వారా అమల్లోకి వచ్చిన టీఎస్–ఐపాస్ ద్వారా జనవరి 2020 నాటికి రూ. 2,04,000 కోట్ల పారిశ్రామిక పెట్టుబడులు రాష్ట్రానికి తరలివచ్చాయి. ఆన్‌లైన్ విధానం ద్వారా 12,427 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయగా 14 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి.
ఇప్పటివరకు 3,150 కి.మీ. జాతీయ రహదారుల మంజూరుతో తెలంగాణలో మొత్తం 5,677 కి.మీ. మేర జాతీయ రహదారుల నెట్‌వర్క్ ఏర్పడింది. జాతీయ రహదారుల్లో ప్రస్తుతం జాతీయ సగటు 3.81 కిలోమీటర్లయితే తెలంగాణ రాష్ట్రం సగటు 5.02 కిలోమీటర్లు. మిషన్ భగీరథ పథకాన్ని రూ. 43,791 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టి లక్షా 40 వేల కిలోమీటర్ల పైపులైన్ల ద్వారా 2019 జనవరి నాటికి రాష్ట్రంలోని 23,968 ఆవాసాలకు తాగునీటిని అందించింది.
నిరుపేద కుటుంబాలకు చెందిన వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బోదకాలు బాధితులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత, బీడీ కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, వృద్ధ కళా కారులు తదితరులు సుమారు 32 లక్షల మందికి ప్రతి నెలా ‘ఆసరా’పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం సామాజిక పెన్షన్లు అందజేస్తోంది. వికలాంగులకు రూ. 3,016, ఇతరులకు ప్రతి నెలా రూ. 2,016 చొప్పున సామాజిక పెన్షన్లు చెల్లిస్తోంది.పేదింటి ఆడపిల్లల పెళ్లి ఖర్చుల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ కేటగి రీలకు చెందిన వారికి కల్యాణ లక్ష్మి, మైనారిటీలకు షాదీ ముబారక్ పథకాల కింద లబ్ధిదారులకు ఒక్కొక్కరికీ రూ. లక్షా పదహారు వేల చొప్పున అందిస్తోంది.
ఆహార భద్రతలో భాగంగా తెల్ల రేషన్‌కార్డు కలిగిన ప్రతి వ్యక్తికీ నెలకు 6 కిలోల చొప్పున బియ్యాన్ని 17 వేలకుపైగా చౌక ధరల దుకాణాల ద్వారా 87.56 లక్షల కుటుంబా ల్లోని 2.80 కోట్ల మందికి పంపిణీ చేస్తోంది. ఎస్సీ, ఎస్టీల సామాజిక అభివృద్ధి కోసం జనాభా నిష్పత్తి మేరకు నిధుల కేటాయింపు, ఖర్చు కోసం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధి చట్టం–2017 రూపొందించి వార్షిక బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తోంది.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)