Coronavirus Outbreak in Telangana. Representational Image. | Pixabay Pic

Hyderabad, June 1: తెలంగాణలో కరోనావైరస్ సోకుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ పోతుంది. సోమవారం కొత్తగా మరో 94 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం COVID-19 కేసుల సంఖ్య సోమవారం సాయంత్రం నాటికి 2792 చేరుకుంది.  కొత్తగా నమోదైన ఈ మొత్తం కేసుల్లో అత్యధికంగా 79 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోవే కాగా, రంగారెడ్డి జిల్లా నుంచి 3, మేడ్చల్ నుంచి 3, సంగారెడ్డి, మెదక్ మరియు నల్గొండ జిల్లాల నుంచి 2 చొప్పున కేసులు అలాగే మహబూబాబాద్, పెద్దపల్లి మరియు జనగాం జిల్లాల నుంచి ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.

సోమవారం మరో 6 మంది కరోనా బాధితులు ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 88కు పెరిగింది. ఇదిలా ఉంటే ఈరోజు మరో 63 మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 1491 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1213 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

అయితే పొరపాట్లలో అలవాటుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సోమవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో జూన్ 1వ తేదీకి బదులుగా నిన్నటి తేదీనే ఉంచేశారు. అది ఈరోజుకి చెందిన రిపోర్ట్‌గా ప్రజలు అర్థం చేసుకోగలరు.

Telangana's #COVID19  Report:

Status of positive cases of #COVID19 in Telangana

 

ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో గత 24 గంటల్లో కొత్తగా ఎవరికి కరోనా సోకినట్లుగా నిర్ధారింపబడలేదు. అయితే ఇప్పటివరకు రాష్ట్రానికి వచ్చిన వలస కార్మికుల్లో 192 మందికి కరోనా సోకినట్లు నిర్ధారింపబడింది. అలాగే ఇతర దేశాల నుంచి స్వదేశానికి చేరుకుని ప్రస్తుతం క్వారైంటైన్లో ఉన్నవారిలో 212 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. వీరితో పాటు మరో 30 మంది విదేశీయులు కూడా పాజిటివ్ వచ్చిన వారి జాబితాలో ఉన్నారు. మొత్తంగా ఇతర ప్రాంతాల నుంచి తెలంగాణకు వచ్చిన వారిలో 434 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.