Telangana Free Electricity: 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, అది దాటితే బిల్లు కట్టాల్సిందే, ఫిబ్రవరి నెల నుంచి అమల్లోకి తీసుకువస్తామని తెలిపిన మంత్రి కోమటిరెడ్డి

తెలంగాణలో ఫిబ్రవరి నెల నుంచి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు హామీ (Telangana Free Electricity) అమలు చేస్తామని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Minister Komati Reddy) వెల్లడించారు.మంగళవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది.

Komati Reddy Venkata Reddy (photo-Video Grab)

Hyd, Jan 23: తెలంగాణలో ఫిబ్రవరి నెల నుంచి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు హామీ (Telangana Free Electricity) అమలు చేస్తామని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Minister Komati Reddy) వెల్లడించారు.మంగళవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జ్ దీపదాస్ మున్శి , ఏఐసీసీ ప్రొఫెషనల్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఏఐసీసీ మ్యానిఫెస్టోలో తెలంగాణ నుంచి చేర్చాల్సిన అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ... ఎన్నికల ముందు ఒక మంచి మేనిఫెస్టో అందించగలిగామని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు(Minister Sridhar babu) అన్నారు. రాష్ట్రంలో అన్నింటికంటే మంచి మేనిఫెస్టో ఇవ్వగలిగామన్నారు. మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీలు ఇచ్చామని.. అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు అమలు చేసే దిశగా అడుగులు వేశామని చెప్పుకొచ్చారు.

పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి 30 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు, మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక రెండో రోజు మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, ఆరోగ్యశ్రీలో పది లక్షల ఆరోగ్య పథకాన్ని అందించామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఎంతో విశ్వాసాన్ని చూపారన్నారు. ప్రతిపక్ష పార్టీ చేస్తున్న విమర్శలు చాలా తొందరపాటుగా ఉన్నాయని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.

కేసీఆర్ స‌ర్కార్ నిర్వాకం వ‌ల్ల తెలంగాణ అప్పులపాలైందన్నారు రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అందువల్లే ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో జాప్యం జరుగుతోందన్నారు. ఫిబ్రవరి నెల నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు హామీ ( Implementation of 200 units of free electricity guarantee) అమలు చేస్తామని చెప్పారు. నిరుద్యోగ భృతి మొద‌లుకొని డ‌బుల్ బెడ్ రూమ్‌ ఇళ్ల వ‌ర‌కు అన్ని హామీల‌ను గత ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. పార్లమెంటు ఎన్నిక‌ల్లో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదన్న మంత్రి.. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు అన్ని అక్రమాల‌పై విచార‌ణ కొన‌సాగుతుందని తెలిపారు.

హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-2 విస్తరణకు రూట్‌ మ్యాప్ ఖరారు, 70 కిలో మీటర్ల మేర కొత్త మెట్రో మార్గాన్ని నిర్మించేలా ప్రతిపాదనలు

అన్ని రాష్ట్రాల్లో తిరిగి అభిప్రాయాలను సేకరిస్తున్న కేంద్ర మేనిఫెస్టో కమిటీ.. తెలంగాణ మేనిఫెస్టో కమిటీ నుంచి కూడా అభిప్రాయాలను సేకరించింది. నాలుగైదు కామన్ స్కీములతో పాటు.. రాష్ట్రాల కోసం ప్రత్యేక అంశాలను మేనిఫెస్టోలో పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయం నిర్ణయించింది.

మేనిఫెస్టో అంటే ప్రజలకు దగ్గరగా, అమలుకు నోచుకునే విదంగా ఉండాలని ఏఐసీసీ ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి తెలిపారు. తెలంగాణలో మంచి మేనిఫెస్టో అందించారని.. అందుకే రాష్ట్ర ప్రజలు విశ్వసించారని పేర్కొన్నారు. ఏఐసీసీ మేనిఫెస్టో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం నేతృత్వంలో రూపొందుతుందని చెప్పారు. మ్యానిఫెస్టో పబ్లిక్ ఫ్రెండ్లీగా, క్రోని కాపిటల్‌కు దూరంగా ప్రజావసరాలకు దగ్గరకు ఉండాలన్నారు. ఏఐసీసీ మ్యానిఫెస్టోకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సహకారం తీసుకుంటామన్నారు.



సంబంధిత వార్తలు