పార్లమెంట్ ఎన్నికల తర్వాత BRS ఖాళీ అవడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkatreddy) విమర్శించారు. నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా తిప్పర్తి మండలంలోని కొన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్కేంద్రాల్లో అక్రమాలతో పాటు ఛత్తీస్‌గఢ్‌లో కరెంటు కొనుగోళ్లలో అవినీతి బయటపడుతుందన్న అక్కసుతోనే తనపై మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. లోక్ సభ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ పార్టీకి చెందిన 30 మంది ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వస్తారని జోస్యం చెప్పారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణకు రూట్ మ్యాప్ ఖరారు, 70 కిలో మీటర్ల మేర కొత్త మెట్రో మార్గాన్ని నిర్మించేలా ప్రతిపాదనలు
Here's Video
లోక్ సభ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ పార్టీకి చెందిన 30 మంది ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వస్తారు - మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి pic.twitter.com/57TY5r6FLc
— Telugu Scribe (@TeluguScribe) January 23, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)