IPL Auction 2025 Live

Metpalli Gang Rape: ఆగని గ్యాంగ్ రేప్‌లు, మెట్‌పల్లిలో బాలికపై ఐదుమంది అత్యాచారం, వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నిందితులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపిన పోలీసులు

బరి తెగించి అత్యాచారానికి పాల్పడుతూ పైశాచికానందం పొందుతున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో మెట్ పల్లి పట్టణంలో దారుణమైన ఘటన (Gana Rape at Metpalli ) వెలుగుచూసింది. 14 ఏళ్ల మైనర్ బాలికపై ఐదుగురు యువకులు అత్యాచారానికి (Metpalli Gang Rape) పాల్పడ్డారు.

Image used for representational purpose only | (Photo Credits: ANI)

Metpalli , Oct 25: దిశ అత్యాచారం కేసులో నిందితుల్ని పోలీసులు ఎన్ కౌంటర్ చేసినా (2019 Hyderabad gang rape)కామాంధుల్లో మార్పు రావడం లేదు. బరి తెగించి అత్యాచారానికి పాల్పడుతూ పైశాచికానందం పొందుతున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో మెట్ పల్లి పట్టణంలో దారుణమైన ఘటన (Gana Rape at Metpalli ) వెలుగుచూసింది. 14 ఏళ్ల మైనర్ బాలికపై ఐదుగురు యువకులు అత్యాచారానికి (Metpalli Gang Rape) పాల్పడ్డారు.

ఈ దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అత్యాచారం చేస్తుండగా వీడియో తీసిన సదరు నిందితులు.. సదరు వీడియోలు సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఐదుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు.

బాలికకు మత్తు మందు ఇచ్చి ఏడు మంది గ్యాంగ్ రేప్, 12మంది నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, నిందితుల్లో ఇద్దరికీ కరోనా పాజిటివ్

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. బాలికకు సమీప బంధువైన ఒక యువకుడు ఆమెను లోబరచుకుని సెల్‌ఫోన్‌తో అసభ్యకర ఫొటోలు తీశా డు. వాటితో బెదిరించి అత్యాచారం చేశాడు. ఆ యువకుడి స్నేహితులు నలుగురు కూడా బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారం క్రితం జరిగిన ఈ ఘోరంపై బాధిత కుటుంబం భయంతో మిన్నకుండిపోయింది.

హత్రాస్ కేసు, ఉరివేసుకుని చనిపోయిన డిఐజి భార్య, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన ఉత్తరప్రదేశ్ పోలీసులు, ఆమె భర్త చంద్రప్రకాశ్ హత్రాస్‌ కేసు దర్యాప్తు కోసం నియమించిన సిట్‌లో సభ్యుడు

ఈ వ్యవహారం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో.. పోలీసులకు బాలి క తల్లి శనివారం ఫిర్యాదు చేశారు. ఐదుగురు నిందితులపైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ గౌస్‌బాబా, సీఐ శ్రీనివాస్‌ తెలిపారు. నిందితులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు వారిని రిమాండ్ కి తరలించే ప్రయత్నం చేస్తున్నారు.