Lucknow, October 25: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. హత్రాస్ కేసు దర్యాప్తు చేస్తున్న ఐపీఎస్ అధికారి భార్య పుష్పా ప్రకాష్ ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని తన ఇంటిలో ఆత్మహత్య (DIG Chandra Prakash's Wife Pushpa Dies) చేసుకుని మరణించారు. ఆమె భర్త డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డిఐజి) చంద్ర ప్రకాష్ (DIG Chandra Prakash). హత్రాస్ లోని 19 ఏళ్ల బాలిక బూల్గారి గ్రామంలో సామూహిక అత్యాచారం, మరణంపై దర్యాప్తు కోసం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల సిట్ లో ఈయన ఒకరు.
36 ఏళ్ళ పుష్పా ప్రకాష్ శనివారం ఉదయం 11 గంటల సమయంలో లక్నోలోని సుశాంత్ గోల్ఫ్ సిటీ ప్రాంతంలోని ఆమె ఇంటి వద్ద సీలింగ్ ఫ్యాన్ నుండి ఉరివేసుకున్నట్లు గుర్తించారు. కుటుంబ సభ్యులు ఆమెను లోహియా ఆసుపత్రికి తరలించారు, అక్కడ వైద్యులు పుష్ప ప్రకాష్ రాగానే చనిపోయినట్లు ప్రకటించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆమె మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఆత్మహత్యకు సంబంధించి ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని ఈస్ట్ జోన్ డీసీపీ చారు నిగమ్ తెలిపారు. 2005 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన చంద్ర ప్రకాష్ ప్రస్తుతం హత్రాస్ కేసు దర్యాప్తు కోసం నియమించిన సిట్‌లో సభ్యుడిగా ఉన్నారు. ఆమె మృతిపై పోలీసు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపారు.
కాగా బాలిక కుటుంబ సభ్యులు వారి ఇష్టానికి వ్యతిరేకంగా అర్ధరాత్రి ఆమె మృతదేహాన్ని దహనం చేశారని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపించిన తరువాత సిట్ ఏర్పడింది. యూపీ ప్రభుత్వ సిఫారసు మేరకు కేసును సిబిఐకి బదిలీ చేశారు. ఈ కేసులో నిందితుల్లో నలుగురిలో ఒకరు తన పాఠశాల మార్క్‌షీట్ ప్రకారం మైనర్ అని సిబిఐ పరిశోధకులు కనుగొన్నారు.