Telangana: జగన్ ఇల్లు ముందు కట్టడాలు కూల్చిన అధికారికి TSMSIDC ఎండీగా ప్రమోషన్, రాష్ట్రంలో ఒకేసారి 44 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ, జీహెచ్ఎంసీ కొత్త కమిషనర్ గా ఆమ్రపాలి

ఆయనకు ప్రణాళికశాఖ ముఖ్యకార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి ముఖ్యకార్యదర్శిగా కూడా ఆయన కొనసాగనున్నారు. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జీవో విడుదలచేశారు.

Telangana Govt

Hyd, June 24: తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. ఒకేసారి 44 మంది అధికారులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ట్రాన్స్‌ఫర్‌ చేసింది. జగన్ ఇల్లు ముందు అక్రమ కట్టడాలు అంటూ కూల్చిన ఘటన వివాదాస్పదం కాగా మాకు తెలీకుండా జరిగిందని GHMC ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ బి.హేమంత్ సహదేవరావ్‌ను 10 రోజుల కిందట బదిలీ చేశారు. ఇప్పుడు ఆయనకు TSMSIDC ఎండీగా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఇక చేనేత, హస్తకళల ముఖ్యకార్యదర్శిగా శైలజా రామయ్యను బదిలీ చేశారు. ఆమెకు హ్యాండ్లూమ్స్‌, టీజీసీవో హ్యాండ్‌క్రాఫ్ట్స్‌ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు ఆ స్థానంలో కొనసాగిన రొనాల్డ్‌ రోస్‌ను విద్యుత్‌ శాఖ కమిషనర్‌గా ట్రాన్స్‌ఫర్‌ చేశారు. ఆయనకు జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీగా అదనపు బాధ్యతలు కేటాయించారు.  తెలంగాణ ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ఫ‌లితాలు విడుద‌ల‌, ఫలితాలను నేరుగా tgbie.cgg.gov.in ద్వారా చెక్ చేసుకోండి

ఇక పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌గా ఉన్న శ్రీదేవసేనను కళాశాల, టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌గా బదిలీ చేశారు. పశుసంవర్ధకశాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్‌, కార్మిక, ఉపాధి శిక్షణశాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్‌ కుమార్‌, యువజన సర్వీసులు, పర్యాటక, క్రీడలశాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్‌, అటవీ, పర్యావరణశాఖల ముఖ్యకార్యదర్శిగా అహ్మద్‌ నదీమ్‌ నియమించారు. ఆయనకు టీపీటీఆర్‌ఐ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీగా ఉన్న రిజ్వీని వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శిగా బదిలీ చేశారు. జీఏడీ ముఖ్యకార్యదర్శిగా సుదర్శన్‌రెడ్డిని నియమించారు. దాసరి హరిచందనను రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా, హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా సర్ఫరాజ్‌ అహ్మద్‌ను నియమించారు.

బదిలీ అయిన ఐఏఎస్‌ల జాబితా..

సవ్యసాచి ఘోష్‌(ఐఏఎస్‌) - పశుసంవర్ధక, పాడి అభివృద్ధి, మత్స్య విభాగం ముఖ్య కార్యదర్శి

సంజయ్‌ కుమార్‌(ఐఏఎస్‌) - కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాలు విభాగం ముఖ్య కార్యదర్శి

ఎ.వాణిప్రసాద్‌ (ఐఏఎస్‌) - యువజన, క్రీడలు, పర్యాటక విభాగం ముఖ్య కార్యదర్శి

శైలజ రామయ్యర్ (ఐఏఎస్‌) - దేవాదాయ, పరిశ్రమలు, వాణిజ్యం, హ్యాండ్‌లూమ్స్‌, టెక్స్‌టైల్స్‌ విభాగం ముఖ్య కార్యదర్శి

అహ్మద్‌ నదీమ్ (ఐఏఎస్‌) - అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక ముఖ్య కార్యదర్శి

సందీప్‌ కుమార్ సుల్తానియా (ఐఏఎస్‌) - ఆర్థిక విభాగం ముఖ్య కార్యదర్శి

సయ్యద్ అలీ ముర్తాజా రిజ్వి (ఐఏఎస్‌) - వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌ విభాగం ముఖ్య కారదర్శి

సి. సుదర్శన్ రెడ్డి (ఐఏఎస్‌) - జనరల్‌ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్‌, సేవలు మానవ వనరులు కార్యదర్శి

డాక్టర్‌ జ్యోతి బుద్ధ ప్రకాశ్‌ (ఐఏఎస్‌) - రిజిస్ట్రేషన్‌, స్టాంప్స్‌, హౌసింగ్ కార్యదర్శి

కె. ఇలంబరిథి (ఐఏఎస్‌) - ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్

రొనాల్డ్‌ రాస్‌ (ఐఏఎస్‌) - విద్యుత్‌ విభాగం కార్యదర్శి

దేవసేన (ఐఏఎస్‌) - కళాశాలలు, సాంకేతిక విద్య కమిషనర్‌

సర్ఫరాజ్‌ అహ్మద్‌ (ఐఏఎస్‌) - హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ(హెచ్‌ఎండీ) మెట్రోపాలిటన్‌ కమిషనర్

డి. దివ్య (ఐఏఎస్‌) - గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సీఈఓ

ఆమ్రపాలి (ఐఏఎస్‌) - జీహెచ్‌ఎంసీ కమిషనర్

హరిచందన దాసరి (ఐఏఎస్‌) - రహదారులు, భవనాలు ప్రత్యేక కార్యదర్శి

అలగు వర్షిణి (ఐఏఎస్‌) - సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి

వి.పి. గౌతమ్ (ఐఏఎస్‌) - గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి

ఎస్‌. కృష్ణ ఆదిత్య (ఐఏఎస్‌) - ఉపాధి, శిక్షణ డైరెక్టర్‌

కె. అశోక్‌ రెడ్డి (ఐఏఎస్‌) - హైదరాబాద్ మెట్రో నీటి సరఫరా పారిశుద్ధ్య నిర్వహణ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్

అనురాగ్ జయంతి (ఐఏఎస్‌) - జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్‌ జోనల్‌ కమిషనర్

భవేశ్‌ మిశ్రా (ఐఏఎస్‌) - ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్ కమ్యూనికేషన్ డిప్యూటీ కార్యదర్శి

జి. రవి (ఐఏఎస్‌) - తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి మెంబర్‌ సెక్రటరీ

కె. నిఖిల (ఐఏఎస్‌) - తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ సీఈఓ

ఎస్‌కే. యాస్మిన్ బాషా (ఐఏఎస్‌) - ఉద్యానవన, సెరికల్చర్ డైరెక్టర్

ఎస్‌. వెంకట్రావ్‌ (ఐఏఎస్‌) - ప్రొటోకాల్ డైరెక్టర్

పి.ఉదయ్‌ కుమార్‌ (ఐఏఎస్‌) - వ్యవసాయ సహకార విభాగం సంయుక్త కార్యదర్శి

బి. గోపి (ఐఏఎస్‌) - పశుసంవర్ధక విభాగం డైరెక్టర్

ఆల. ప్రియాంక (ఐఏఎస్‌) - మత్స్య శాఖ డైరెక్టర్

త్రిపాఠి (ఐఏఎస్‌) - పర్యాటక శాఖ డైరెక్టర్

స్నేహ శబరీశ్‌ (ఐఏఎస్‌) - జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్

కాత్యాయని దేవీ (ఐఏఎస్‌) - ఫైనాన్స్‌ కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్

ఇ.వి. నరసింహా రెడ్డి (ఐఏఎస్‌) - ప్రాథమిక విద్యా డైరెక్టర్

బి.హేమంత్ సహదేవరావ్‌ (ఐఏఎస్‌) - తెలంగాణ వైద్య సేవలు మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్

హేమంత కేశవ్ పాటిల్‌ (ఐఏఎస్‌) - జీహెచ్‌ఎంసీ ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్

అపూర్వ చౌహాన్ (ఐఏఎస్‌) - జీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి జోనల్ కమిషనర్

అభిషేక్ అగస్త్య (ఐఏఎస్‌) - ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్

బి. రాహుల్‌ (ఐఏఎస్‌) - భద్రాచలం పీఓ (ఐటీడీఏ)

పి. గౌతమి (ఐఏఎస్‌) - మూసీ నదీ అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్

సోని బాలాదేవి (ఐఎఫ్‌ఎస్‌) - తెలంగాణ క్రీడల ప్రాధికార సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌

ఎన్‌. ప్రకాశ్‌ రెడ్డి (ఐపీఎస్‌) - తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌

ఎ.వి. రంగనాథ్‌ (ఐపీఎస్) - ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్‌, విపత్తు నిర్వహణ (జీహెచ్‌ఎంసీ) కమిషనర్‌

పి. ఉపేందర్‌ రెడ్డి (నాన్ క్యాడర్) - జీహెచ్‌ఎంసీ శేర్‌ లింగంపల్లి జోనల్ కమిషనర్

నిఖిల్ చక్రవర్తి (ఐఏ అండ్‌ ఏఎస్‌) - టీజీఐఐసీ (తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్