Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు, రాష్ట్ర విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు, ఔటర్ రింగ్ రోడ్డులోని 51 గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేస్తు ఆర్డినెన్స్

ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్, ముగ్గురు సభ్యులతో ప్రభుత్వం విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేయనుంది. ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీ తయారీలో ఈ కమిషన్ కీలక పాత్ర పోషించనుంది.

Telangana Govt Logo (Photo-File Image)

Hyd, Sep 3: రాష్ట్ర విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్, ముగ్గురు సభ్యులతో ప్రభుత్వం విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేయనుంది. ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీ తయారీలో ఈ కమిషన్ కీలక పాత్ర పోషించనుంది.

చైర్మన్, సభ్యులను త్వరలో నియమిస్తామని ప్రభుత్వం తెలిపింది. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగా ఈరోజు విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

తాను ఫామ్‌ హౌస్‌లో పడుకున్నోడిలా కాదంటూ సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు, ఆక్రమణల వల్లే ఖమ్మంలో భారీగా వరదలు వచ్చాయని వెల్లడి

దీంతో పాటుగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 51 గ్రామాలను ఆయా మున్సిపాలిటీలలో విలీనం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. ఒక్కో మున్సిపాలిటీలో ఒకటి నుంచి ఆరు వరకు గ్రామాలను విలీనం చేసింది. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాల్లోని పలు గ్రామాలు ఈ విలీన జాబితాలో ఉన్నాయి.

పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీలో నాలుగు గ్రామాలు, శంషాబాద్‌లో ఆరు, నార్సింగి, తుక్కుగూడలలో ఒక్కో పంచాయతీ, మేడ్చల్‌లో రెండు, దమ్మాయిగూడలో ఆరు, నాగారంలో నాలుగు, పోచారంలో ఐదు, ఘట్‌కేసర్‌లో ఆరు, గుండ్లపోచంపల్లిలో రెండు, తూంకుంట మున్సిపాలిటీలో మూడు పంచాయతీలను విలీనం చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది.



సంబంధిత వార్తలు

Tollywood Film Industry Meet CM Revanth Reddy: ప్రభుత్వంపై నమ్మకం ఉంది...గ్లోబల్ స్థాయికి సినిమా పరిశ్రమ, ఎలక్షన్‌ రిజల్ట్‌ లాగే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుందన్న నిర్మాతలు..సీఎం రేవంత్‌తో కీలక అంశాల ప్రస్తావన

CM Revanth Reddy: తెలంగాణలో ఇకపై బెనిఫిట్‌ షోలు ఉండవు..సినీ పెద్దలతో తేల్చిచెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ హీరోగా ఉండాలని సూచించిన తెలంగాణ సీఎం

Kamareddy: వివాహేతర సంబంధం...ముగ్గురి ప్రాణాలు తీసింది, ఎస్సై సహా మహిళా కానిస్టేబుల్ మరోకరి ఆత్మహత్య..కామారెడ్డిలో సంచలనంగా మారిన ముగ్గురి ఆత్మహత్యలు

Heavy Rain Alert For Telugu States: బంగాళాఖాతంలో కొన‌సాగుతున్న అల్ప‌పీడ‌నం, తెలుగు రాష్ట్రాల‌కు భారీ వ‌ర్ష‌సూచ‌న‌, ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం