Hyd, Sep 3: భారీ వర్షాలకు ఖమ్మం కకావికలమైంది. మున్నేరు’ ఖమ్మం ముంపు ప్రాంతాల వాసులను కోలుకోలేని దెబ్బతీసింది.భారీ వర్షాలు.. వరదలతో ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో జనజీవనం కకావికలమైంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ రెండ్రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజిబిజీగా గడుపుతున్నారు.ఖమ్మంలో మీడియా ప్రతినిధులతో సీఎం చిట్‌చాట్ నిర్వహించారు.
ఆక్రమణల వల్లే ఖమ్మంలో భారీగా వరదలు (CM Revanth Reddy on Khammam Floods) వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మున్నేరు రిటైనింగ్ వాల్ ఎత్తు పెంపుపై ఇంజినీర్లతో చర్చిస్తామని చెప్పారు. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ద్వారా గుర్తించి ఆక్రమణలు తొలగిస్తామని వెల్లడించారు. 75 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 42 సెం.మీ వర్షం పడిందన్నారు. ప్రభుత్వ ముందుచూపు వల్లే ప్రాణ నష్టం తగ్గిందని వివరించారు.
వరదలపై మాజీ మంత్రి హరీశ్ రావు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని రేవంత్ మండిపడ్డారు. బీఆర్ఎస్ నేత పువ్వాడ ఆక్రమణలపై హరీశ్ స్పందించాలని వ్యాఖ్యానించారు. ఆక్రమించిన స్థలంలో పువ్వాడ ఆస్పత్రి కట్టారని.. వాటిని తొలగించాలని ఆయనకు హరీశ్ చెప్పాలని సూచించారు. వరద సాయం కోసం కేంద్రానికి లేఖ రాసినట్లు సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల సాయం ప్రకటించినట్లు చెప్పారు.
ఖమ్మం జిల్లాలో (Huge floods in Khammam) సుమారు రూ.5,000 కోట్లకు పైగా నష్టం జరిగినట్లు ప్రభుత్వ ప్రాథమిక అంచనా. రహదారులు తెగిపోవడం, వంతెనలు, లోలెవల్ కాజ్‌వేలు, జాతీయ రహదారుల విధ్వంసంతో తీవ్ర నష్టం వాటిల్లింది. నీటిపారుదల శాఖ పరిధిలో 196 చెరువులకు, ప్రాజెక్టుల కింద 64 కాల్వలకు నష్టం వాటిల్లింది. వరద తగ్గినచోట్ల అధికార యంత్రాంగం సేకరించిన ప్రాథమిక సమాచారం ప్రకారం దాదాపు 600 ఇళ్లు ముంపునకు గురయ్యాయి. సోమవారం రాత్రి నుంచి విజయవాడ-హైదరాబాద్ మార్గంలో రెండువైపులా వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. వీడియో ఇదిగో, భారీ వరదలకు నీట మునిగిన వట్టెం పంప్ హౌస్, టన్నెల్ మీదుగా పంపుహౌస్‌లోకి వెళ్లిన చెరువుల వరద నీరు
నగరంలో ఎక్కడెక్కడ ఆక్రమణలు జరిగాయో సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ద్వారా గుర్తించి వాటిని తొలగిస్తామని చెప్పుకొచ్చారు. ఆక్రమించిన స్థలంలోనే మాజీ మంత్రి పువ్వాడ ఆస్పత్రి కట్టారన్నారు. పువ్వాడ ఆక్రమణలపై హరీష్‌రావు స్పందించాలన్నారు. 75 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 42 సెం.మీ వర్షం పడిందన్నారు. మున్నేరు రిటైనింగ్ వాల్ ఎత్తు ఇంకా పెంచొచ్చా..? పెంపునకు ఛాన్స్ ఉందా..? అనే దానిపై ఇంజనీర్లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
ప్రకృతి ప్రకోపం చూపించిందని.. అత్యంత దురదృష్టమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. మంగళవారం జిల్లాలోని సీతారాంనాయక్ తండాలో సీఎం పర్యటించారు. ప్రభుత్వం (TG Govt) ఎన్ని చర్యలు తీసుకున్న కొంత ఆస్తి నష్టం జరిగిందన్నారు. కొంత ప్రాణ నష్టం జరిగిందని తెలిపారు. సీతారాంనాయక్ తండా సహా మూడు తండాలను ఒకే దగ్గర నిర్మాణం చేసేలా ఒక గ్రామపంచాయితీగా రూపొందించేలా కలెక్టర్ ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించి ప్రభుత్వానికి పరిశీలనకు పంపించాలని సూచించారు.
ఈ మూడు తండాల వాసులకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మాణం చేసిన మంచి కాలని నిర్మాణం చేసేలా కలెక్టర్‌కుు ఆదేశాలు జారీ చేస్తున్నామన్నారు. ముంపుకు గురైన నష్టపోయిన వారికి 10 రోజుల పాటు నిత్యావసర వస్తులు కలెక్టర్ ద్వారా అందిస్తామని వెల్లడించారు. వర్షంతో సర్టిఫికెట్లు కానీ ఇతరత్రా గుర్తింపు కార్డులు కోల్పోయిన వారి లిస్ట్ని తయారు చేసి కావలసిన సర్టిఫికెట్లను జారీ చేయాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. కొట్టుకపోయిన రోడ్లను పరిశీలించామన్నారు. మరొకసారి ఇలాంటి సంఘటన జరగకుండా శాశ్వత పరిష్కారాలు చూపించేలాగా నేషనల్ హైవేతో రాష్ట్ర ఆర్‌అండ్‌బి అధికారులకు సూచన చేస్తామన్నారు.
ఆపదలో ఉన్న తెలంగాణ ప్రజలను ఆదుకుంటామని.. ప్రజలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటామని తెలిపారు. తాను ఫామ్ హౌస్ లో పడుకున్నోడిలా కాదని పరోక్షంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. తాను చెప్పిందే చేస్తానని.. చేసేదే చెబుతానని వెల్లడించారు. తక్షణ సాయంగా బాధితుల ఇంటికి బియ్యం, ఇతర నిత్యావసరాలతో పాటు పదివేల రూపాయలు పంపిస్తున్నానని తెలిపారు. తెలంగాణకు వరదల కారణంగా రూ.5438 కోట్ల నష్టం జరిగిందని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.
పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం తప్పనిసరిగా ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకుంటుందని రేవంత్ అన్నారు. ప్రతి ఒక్క రైతును ఆదుకుంటుందని.. ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. అమెరికా పోయి కూర్చున్నోడు తలకాయ లేకుండా మాట్లాడుతుండని విమర్శించారు. ఇప్పటికే ప్రధానమంత్రికి లేఖ ద్వారా జరిగిన నష్టాన్ని వివరించానని రేవంత్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవాలని ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించి న్యాయం చేయాలని ప్రధాని మోదీని వెళ్లి కలుస్తానన్నారు. అనుక్షణం ఈ రాష్ట్ర ప్రజలను కాపాడుకునేందుకు కష్టపడుతున్నామన్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. గ్రామాలకు ప్రత్యేక బృందాలను పంపుతున్నామని రేవంత్ తెలిపారు. శానిటేషన్ దగ్గర నుంచి ప్రతి ఒక్క కుటుంబం తిరిగి కోలుకునే వరకూ అండగా నిలబడతామని వెల్లడించారు.