Bars Reopen in Telangana: బార్లు తెరిచినా వాటికి పర్మిషన్ లేదు, తెలంగాణలో నేటి నుంచి బార్లు, క్లబ్‌లు ఓపెన్, వైన్స్‌ల పక్కన ఉండే పర్మిట్ రూంలకు అనుమతి నిరాకరణ
ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. కరోనా నేపధ్యంలో గత మార్చినెలలో వైన్‌షాపులతో పాటు బార్‌లు, క్లబ్‌లను కూడామూసి వేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. తిరిగి ఆరు నెలల తర్వాత తాజాగా బార్‌లు తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది.
Hyderabad, Sep 26: తెలంగాణలో బార్‌లు, క్లబ్‌లు, టూరిజం బార్‌లు తిరిగి తెరుచుకునేందుకు (Bars Reopen in Telangana) అనుమతిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. కరోనా నేపధ్యంలో గత మార్చినెలలో వైన్‌షాపులతో పాటు బార్‌లు, క్లబ్‌లను కూడామూసి వేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. తిరిగి ఆరు నెలల తర్వాత తాజాగా బార్‌లు తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది.
దీంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు వెయ్యి బార్లు (Telangana Bars Open) తెరుచుకోనున్నాయి. వైన్స్‌ల పక్కన ఉండే పర్మిట్‌రూంలకు మాత్రం ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు పర్మిట్ రూంలు మూసేఉంచాలని స్పష్టంచేసింది. బార్ల ఎంట్రెన్స్ వద్ద థర్మల్ స్క్రీనింగ్ చేయాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు, హ్యాండ్ శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి. బార్ సిబ్బంది మాస్క్‌లు ధరించాలి. గుంపులుగా చేరడం, మ్యూజికల్ ఈవెంట్స్, డ్యాన్స్ ఫ్లోర్లపై నిషేధం ఉంటుంది. రోజూ ఉదయం, సాయంత్రం బార్ మొత్తం శానిటైజ్ చేయాల్సి ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కరోనా నిబంధనలకు లోబడి వీటిని అనుమతించినట్టు (Pubs & Bars in Hyderabad Open now) ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వం (TS Govt) జారీ చేసిన ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రకటించింది. అయితే బార్‌లు,క్లబ్‌లు,టూరిజం బార్‌లకు నిబంధనలు వర్తిస్తాయని అధికారులు తెలిపారు. బార్‌లు, క్లబ్‌లలో ప్రవేశ ద్వారం వద్దనే కస్టమర్లకు థర్మల్ స్ర్కీనింగ్ టెస్ట్‌లు నిర్వహించాలి. లోపలికి వెళ్లేప్పుడు తప్పని సరిగా క్యూపద్దతిని పాటించాలి. పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి.
పార్కింగ్ లాట్‌లలో క్రౌడ్ మేనేజ్‌మెంట్‌ను అమలు చేయాల్సి ఉంటుంది. ప్రతి టేబుల్ వద్ద హ్యాండ్ శానిటైజర్‌ను అందుబాటులో ఉంచాలి. బార్ నిర్వాహకులు, సిబ్బంది తప్పని సరిగా మాస్క్‌లు ధరించాలి. బార్లలో, క్లబ్బుల్లో ఎక్కువ మంది ఒకే దగ్గర మూగడం, మ్యూజిక్ కార్యక్రమాలు, డాన్స్ ఫ్లోర్‌లు ఏర్పాటు చేయడం నిషేధం. కస్టమర్లు వచ్చేముందు ప్రతి బార్‌లోపల, బయటా ఉదయం, సాయంత్రం వేళల్లో పూర్తిస్థాయిలో శానిటైజేషన్ చేయాల్సి వుంటుంది. బార్‌లలో సరైన వెంటిలేషన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. కాగా వైన్‌షాపుల వద్ద నిర్వహించే పర్మిట్ రూమ్‌లకు తదుపరి ఆనుమతి ఇచ్చే వరకూ మూసే ఉంచాలని ప్రభుత్వం వెల్లడించింది.
కేంద్ర మార్గదర్శకాల మేరకు శనివారంనుంచి అర్బన్ ఫారెస్ట్ పార్కులు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. కరోనా నిబంధనలను అనుసరించి సందర్శకులకు శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని, మాస్కులు ధరించినవారినే లోపలకు అనుమతించాలని అధికారులను ఆదేశించారు. వచ్చేనెల 6 (జూ డే) నుంచి హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లోకి సందర్శకులను అనుమతించనున్నట్టు చెప్పారు. స్థానికసంస్థలు, నగర పాలక సంస్థల్లో పార్కులను తెరువాలని సీఎస్ ఆదేశాలు జారీచేశారు.