Covid in TS: తెలంగాణలో మరో 2,239 మందికి కరోనా, 1,83,866కి చేరుకున్న మొత్తం కేసులు, తాజాగా 11మంది మరణంతో 1,091కి చేరుకున్న మృతుల సంఖ్య, 1,52,441 మంది డిశ్చార్జ్
Coronavirus Outbreak | (Photo Credits: IANS|Representational Image)

Hyderabad, Sep 26: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 58,925 మంది కరోనా పరీక్ష చేయగా 2,239 మందికి కొత్తగా కోవిడ్-19 (Coronavirus Updates in Telangana) సోకింది. మరో 11మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా కేసులు సంఖ్య 1,83,866కి (Covid in TS) చేరింది. అదే సమయంలో 2,281 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 1,091 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా 1,52,441 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా… ప్రస్తుతం 30,334 యాక్టివ్ కేసులున్నాయి. 24,683 మంది కరోనా బాధితులు హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ లో కొత్తగా 316 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. తెలంగాణలో కోవిడ్‌ మరణాల రేటు 0.59 శాతంగా ఉండగా రికవరీ రేటు 82.90 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ వెల్లడించింది.

క‌రోనా మ‌హ‌మ్మారిని ఎదుర్కోవ‌డానికి ప్ర‌పంచ‌దేశాలు క‌లిసిక‌ట్టుగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, లేన‌ట్ల‌యితే క‌రోనా మృతులు 20 ల‌క్ష‌ల‌కు చేరే అవ‌కాశం అధికంగా ఉంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్ఓ) హెచ్చ‌రించింది. ఇప్ప‌టికే ప‌ది ల‌క్ష‌ల మ‌ర‌ణాల‌కు చేరువ‌లో ఉన్నామ‌ని, వైర‌స్ వ‌ల్ల మ‌రో ప‌ది ల‌క్ష‌ల మంది మృతిచెంద‌డానికి‌ముందే ఈ సంక్షోభాన్ని ప‌రిష్క‌రించ‌డానికి ప్ర‌పంచ‌దేశాలు క‌లిసిరావాల‌ని సూచించింది.

తాజాగా 85,362 కొత్త కేసులు, దేశంలో 59 లక్షలు దాటిన కోవిడ్ కేసులు, 93,379 మంది కరోనాతో మృతి, ప్రపంచవ్యాప్తంగా 3.24 కోట్లను దాటిన కరోనా కేసులు

అస‌లు ప‌ది ల‌క్ష‌ల‌మంది చ‌నిపోవ‌డ‌మ‌నేదే ఊహించ‌లేని సంఖ్య అని, అది మ‌రో ప‌ది ల‌క్ష‌ల‌కు చేర‌క‌ముందే ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని డ‌బ్ల్యూహెచ్ఓ ఎమ‌ర్జెన్సీస్‌ డైరెక్ట‌ర్ మైఖేల్ ర్యాన్ అన్నారు. గ‌తేడాది డిసెంబ‌ర్‌లో చైనాలో ప్రారంభ‌మైన క‌రోనా ఉత్పాతం ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న‌ది. ఇప్ప‌టికే ఈ మ‌హ‌మ్మారి వ‌ల్ల 9.88 ల‌క్షమంది ‌మృతిచెందారు. ఇప్ప‌టివ‌ర‌కు 3.24 కోట్ల మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు.