Telangana: 1 నుంచి 9 వరకు ఫైనల్ ఎగ్జామ్స్ లేవు, నేరుగా పై తరగతులకు ప్రమోట్‌, ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం, పీజీ మెడికల్‌ సీట్ల ఫీజు పెంపు, జూలైలో నీట్‌ పరీక్షను నిర్వహిస్తామని తెలిపిన ఎంసీఐ

ఇప్పటికే తరగతులు, పరీక్షలు నిర్వహించాల్సిన సమయం కూడా దాటడంతో పరీక్షలు లేకుండా విద్యార్థులను పై తరగతులకు పంపిచేలా ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలలో చదువుతున్న 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు (class1-9 to next level) ఎటువంటి పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్‌ చేస్తూ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది .

School Kids. Representational Image (Photo credits: Pixabay)

Hyderabad, May 5: కరోనా కట్టడికి ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ (Lockdown) నేపద్యంలో తరగతులు నిర్వహించే అవకాశం లేకపోవడంతో తెలంగాణ సర్కారు (Telangana government) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తరగతులు, పరీక్షలు నిర్వహించాల్సిన సమయం కూడా దాటడంతో పరీక్షలు లేకుండా విద్యార్థులను పై తరగతులకు పంపిచేలా ఉత్తర్వులు జారీ చేసింది. మీరు ఇంట్లో బందీ అయిపోయారా, అయితే మీ కోసమే కొన్ని లెర్నింగ్ యాప్స్, ఉచితంగా క్లాసులు అందిస్తున్న 7 యాప్స్ మీద ఓ లుక్కేయండి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలలో చదువుతున్న 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు (class1-9 to next level) ఎటువంటి పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్‌ చేస్తూ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది .

దీంతో పాటుగా పీజీ మెడికల్‌ సీట్ల ఫీజును తెలంగాణ సర్కారు పెంచింది. కన్వీనర్‌ కోటా సీటు ఫీజును ఆయా కాలేజీల ప్రకారం రూ.7 లక్షల నుంచి రూ.7.75 లక్షలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. బీ కేటగిరీ సీటు ఫీజు గతంలో రూ. 24.20 లక్షలు ఉండగా, కొన్నిచోట్ల అదే ఫీజు ఖరారు చేసింది. కొన్ని కాలేజీల్లో రూ.23 లక్షలకు తగ్గించింది. సీ కేటగిరీ సీటుకు గరిష్టంగా రూ.72 లక్షల వరకూ వసూలు చేసుకోవడానికి ప్రైవేటు మెడికల్‌ కాలేజీలకు అనుమతినిచ్చింది. ఆగస్టు 1 నుంచి కొత్త విద్యా సంవత్సరం, వర్సిటీలు వారానికి ఆరు రోజులు పని చేయాలి, యూజీసీకి పలు సిఫార్సులు చేసిన నిపుణుల కమిటీ

ఇక డెంటల్‌ పీజీ ఏ కేటగిరీ ఫీజును రూ.5.15 లక్షలుగా, బీ కేటగిరీ సీటు ఫీజును రూ.8 లక్షలుగా నిర్ణయించారు. సీ కేటగిరీ సీటుకు రూ.12 లక్షల వరకూ వసూలు చేసుకోవచ్చు. వాస్తవానికి 2017లోనే మెడికల్‌ పీజీ సీటు ఫీజును రూ.6.90 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ పెంపుపై జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్, హెల్త్‌ రిఫార్మర్స్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌లు కోర్టుకు వెళ్లాయి. దీంతో ఫీజుల పెంపును తాత్కాలికంగా నిలిపివేస్తూ, తుది తీర్పు వచ్చే వరకు సగం ఫీజును వసూలు చేయాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇంగ్లీష్ మీడియం కావాలా..వద్దా?, తల్లిదండ్రుల్లారా మీరే తేల్చుకోండి

జూలైలో నీట్‌ పరీక్ష నిర్వహణ : మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా

ఎంబీబీఎస్, బీడీఎస్‌ వంటి వైద్య ప్రవేశాలకు దేశవ్యాప్తంగా నిర్వహించే ‘నీట్‌’పరీక్షను వచ్చే జూలైలో నిర్వహించాలని మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఐ) సూత్రప్రాయంగా నిర్ణయించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రకాల అర్హత పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇటు ఈ నెల 3న జరగాల్సిన నీట్‌ పరీక్ష కూడా వాయిదా పడింది. దీంతో నీట్‌ ఎప్పుడు నిర్వహిస్తారా అన్న దానిపై విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. జూలై నాటికి పరిస్థితులు కుదుటపడితే ఆ నెలలో నీట్‌ నిర్వహించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇటీవల 16 రాష్ట్రాలకు చెందిన ఆరోగ్య విశ్వవిద్యాలయాల వైస్‌చాన్స్‌లర్లతో ఎంసీఐ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించింది.



సంబంధిత వార్తలు