MLAs Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో ట్విస్ట్, సిట్ మెమోను కొట్టివేసిన హైకోర్టు, ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన న్యాయస్థానం
తెలంగాణ ప్రభుత్వ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. కాగా ఏసీబీ కోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేసిన సంగతి విదితమే.
Hyd, Jan 2: తెలంగాణలో సంచలనం రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్‌కు చుక్కెదురైంది. తెలంగాణ ప్రభుత్వ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. కాగా ఏసీబీ కోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేసిన సంగతి విదితమే. ఈ కేసులో నలుగురిని నిందితులుగా చేరుస్తూ సిట్ మోమో జారీ చేసిన సంగతి తెలిసిందే. బీఎల్ సంతోష్, జగ్గుస్వామి, తుషార్, శ్రీనివాస్‌లపై మెమో విషయంలో హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. ఇప్పటికే ఈ కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించింది.
కాగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల తుది కాపీ వచ్చేదాకా.. కేసు సీబీఐ కి ఇస్తూ ఇచ్చిన ఆదేశాలను సస్పెన్షన్‌లో ఉంచాలని, తీర్పును ఇంప్లిమెంట్ చేయొద్దని సిట్ తరపున రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ కోరారు. దీనికి హైకోర్టు సింగిల్ బెంచ్ న్యాయమూర్తి సానుకూలంగా స్పందించారు.
ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు.. ఆర్డర్ కాపీ అందిన తర్వాతే అప్పీల్‌కు వెళ్తామని ధర్మాసనానికి స్పష్టం చేశారు ఏజీ. దీంతో అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఇస్తామని న్యాయమూర్తి ఏజీకి స్పష్టం చేశారు. అంతకు ముందు.. కేసును సిట్ దర్యాప్తు నుంచి సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. అయితే.. తక్షణమే సీబీఐకి అప్పగించాలని తెలిపినప్పటికీ.. ఏజీ అభ్యర్థనను హైకోర్టు న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకున్నారు.