TS High Court: లాక్‌డౌన్‌పై నిర్ణయం ఎందుకు తీసుకోవడం లేదు? కరోనా పరీక్షలు ఎందుకు తగ్గించారు, తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు, లాక్‌డౌన్‌పై ఈనెల 8 వ తేదీలోపు నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు

ఒక‌వైపు తెలంగాణ‌లో క‌రోనా తీవ్రత పెరుగుతుంటే క‌రోనా ప‌రీక్ష‌ల‌ను ఎందుకు త‌గ్గించార‌ని ప్ర‌శ్నించింది. కేవలం రాత్రి కర్ఫ్యూ పెట్టి చేతులు దులుపుకున్నారని మండిపడింది. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది.

High Court of Telangana | (Photo-ANI)

Hyderabad, May 7: తెలంగాణ‌లో క‌రోనా ప‌రిస్థితుల‌పై హైకోర్టులో విచార‌ణ కొన‌సాగుతోంది. విచార‌ణకు రాష్ట్ర ప్ర‌జారోగ్య సంచాల‌కుడు శ్రీనివాస‌రావు, డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా తెలంగాణ‌లో క‌రోనా ప‌రీక్ష‌లు త‌గ్గించ‌డంపై హైకోర్టు (Telangana High Court) అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో టెస్టులు తగ్గించి కేసులు తగ్గాయని ఎలా చెప్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఒక‌వైపు తెలంగాణ‌లో క‌రోనా తీవ్రత పెరుగుతుంటే క‌రోనా ప‌రీక్ష‌ల‌ను ఎందుకు త‌గ్గించార‌ని ప్ర‌శ్నించింది. కేవలం రాత్రి కర్ఫ్యూ పెట్టి చేతులు దులుపుకున్నారని మండిపడింది. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది.

అయితే రాష్ట్రంలో టెస్టులు పెంచామని పబ్లిక్ హెల్త్ ఆఫీసర్‌ కోర్టుకు తెలపగా.. దీనిపై స్పందించిన హైకోర్టు ఒక్క రోజు కూడా లక్ష టెస్టులు దాటలేదని విమర్శించింది. అసలు లాక్‌డౌన్ దిశగా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఫైర్‌ అయ్యింది. ప్రభుత్వాస్పత్రుల్లో బెడ్స్‌, ఆక్సిజన్ డేటాను పూర్తి వివరాలతో సమర్పించాలని ప్రభుత్వా‍న్ని హైకోర్టు ఆదేశించింది. కాగాప్రైవేటు, ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో 49.97 శాతం ప‌డ‌కలు నిండాయ‌ని శ్రీనివాస‌రావు చెప్పారు. సంచార కేంద్రాల ద్వారా ఎన్ని టెస్టులు చేశారో చెప్పాలని కోర్టు ఆదేశించింది. వారం రోజుల్లోగా అన్ని జిల్లాల్లో టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేయాలని తెలిపింది.

కోవిడ్‌ను జయించిన తెలంగాణ సీఎం కేసీఆర్, నేడు వైద్యారోగ్య శాఖపై అధికారులతో సమీక్ష; రాష్ట్రంలో కొత్తగా 6,361పాజిటివ్ కేసులు నమోదు

రాష్ట్రంలో వీకెండ్ లాక్ డౌన్ పై (Telangana Weekend Lockdown) నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి న్యాయస్థానం సూచించింది. ఈనెల 8 వ తేదీలోపు నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశించింది హైకోర్టు. ప్రభుత్వ హాస్పిటల్స్‌లో బెడ్స్, ఆక్సిజన్ డేటా సమర్పించాలని ధర్మాసనం కోరింది. తెలంగాణ రాష్ట్రంలో ఆక్సిజన్ ఎంత డిమాండ్ ఉందని హైకోర్టు ప్రశ్నించింది. దీంతో 600 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను డిమాండ్ ఉందని శ్రీనివాస్ రావు తెలిపారు.

అత్యంత ప్రమాదకరంగా ఎన్‌440కే వైరస్, దేశంలోకి కరోనా థర్డ్ వేవ్ ఎంటర్ కాబోతుందని తెలిపిన ఎయిమ్స్ డైరక్టర్, ఒకరి నుంచి ఒకేసారి ముగ్గురికి వ్యాపిస్తున్న కోవిడ్ కొత్త వేరియంట్, దేశంలో తాజాగా 3,82,315 మందికి కరోనా నిర్ధారణ

కేంద్ర ప్రభుత్వం 430 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఇచ్చిందని హైకోర్టుకు చెప్పారు. ఇప్పటికే పలు కర్ణాటక, ఒరిస్సా నుండి ఆక్సిజన్ తెచ్చామన్నారు. తమిళనాడు నుండి రావాల్సిన 55 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రాలేదని శ్రీనివాస్ రావు కోర్టుకు తెలియజేశారు. రాష్ట్రానికి ఆక్సిజ‌న్ త‌ర‌లించ‌కుండా త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం అడ్డుకుంటోంద‌ని తెలిపారు.

కరోనా నిబంధనల అమలు పర్యవేక్షణకు 859 పెట్రోలింగ్, 152 ద్విచక్ర వాహనాలు ఏర్పాటు చేసినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి కోర్టుకు తెలిపారు. భౌతిక దూరం పాటించని సంస్థలపై కేసులు పెడుతున్నామని, వ్యక్తులపై కాదని కోర్టుకు డీజీపీ తెలిపారు. ఇప్పటివరకు ఔషధాల అక్రమ విక్రయాలకు సంబంధించి 39 కేసులు నమోదు చేసినట్లు కోర్టుకు డీజీపీ తెలిపారు.