Telangana Horror: యువతికి పెళ్లైనా ఆగని వేధింపులు, అందరూ చూస్తుండగానే యువకుడిని దారుణంగా నరికి చంపిన యువతి కుటుంబ సభ్యులు, మంచిర్యాలలో షాకింగ్ ఘటన

అందరూ చూస్తుండగానే ఓ​ యువకుడిని కిరాతకంగా హత్య చేశారు యువతి కుటుంబ సభ్యులు.వేధింపుల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు సమాచారం.

Representational Image. (photo credit- IANS)

Hyd, April 25: తెలంగాణలో మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలం ఇందారం గ్రామంలో మంగళవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే ఓ​ యువకుడిని కిరాతకంగా హత్య చేశారు యువతి కుటుంబ సభ్యులు.వేధింపుల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు సమాచారం.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ముస్కె మహేష్‌(28) అనే వ్యక్తి బైక్‌లో పెట్రోల్‌ కొట్టించుకుని వస్తున్న క్రమంలో.. అడ్డగించిన నలుగురు వ్యక్తులు దాడికి దిగారు. గొంతు కోసి ఆపై బండ రాయితో తల పగలకొట్టారు. ఆ సమయంలో స్థానికులెవరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. పైగా వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

అక్రమ సంబంధం, కొడుకు అడ్డుగా ఉన్నాడని వేటి నీటిలో ముంచి చంపిన కసాయి, పోలీసులకు ఫిర్యాదు చేసిన మృతుడి తల్లి

ఇందారం గ్రామానికి చెందిన ఓ అమ్మాయికి, బాధితుడైన మహేష్ కు నడుమ గతంలో ప్రేమ వ్యవహారం నడిచింది. అయితే ఆమెకు వేరే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే ప్రస్తుతం ఆ యువతి తల్లి ఇంటి వద్దే ఉంటోంది.

నడిరోడ్డు మీద యువకుడిని చంపుతున్న వీడియో

ఈ క్రమంలో మహేష్‌ ఫోన్‌ ద్వారా అసభ్య మెసేజ్‌లతో యువతిని వేధిస్తుండడంతో ఆ కుటుంబం భరించలేకపోయింది. ఈ క్రమంలో వివాహిత తల్లిదండ్రులు, సోదరుడితో మాటువేసి మహేష్‌ను మట్టుబెట్టినట్లు తెలుస్తోంది.

ప్రేమించలేదని బరితెగించిన ప్రేమోన్మాది, యువతి కళ్లలో కారం చల్లి,గొంతు కోసేందుకు ప్రయత్నం, స్థానికులు అడ్డుకోవడంతో పరార్

ఈ ఘటనలో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఘటనపై విచారణ చేపట్టారు. మరోవైపు మహేష్‌ను చంపిన నలుగురిని తమకు అప్పగించాలంటూ మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు.ఇదిలా ఉంటే మహేష్‌ వేధింపులపై వివాహిత కుటుంబ సభ్యులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారని, వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా మహేశ్ వేధింపులు ఆగకపోవడంతో విసిగిపోయిన కుటుంబ సభ్యులు ఈ దారుణానికి తెగబడినట్లు చెబుతున్నారు.