Telangana Lockdown 3.0: తెరుచుకున్న ఐటీ కార్యాలయాలు, హైటెక్ సిటీ వైపు క్రమంగా పెరుగుతున్న రద్దీ, మెట్రో,ఎంఎంటీసీ రైళ్ల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులు

33 శాతం ఉద్యోగులతో ఐటీ కంపెనీలు పని మొదలు పెట్టాయి. దీంతో హైటెక్ సిటీ (Hitech city) పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు పెరిగాయి. కాగా కార్యాలయాలకు వస్తున్న సిబ్బంది నిబంధనలు పాటించాలని, మాస్కులు, శానిటైజర్స్ తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

Hitech City IT Corridor in Hyderabad (photo-Youtube grab)

Hyderabad, May 11: తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) అనుమతితో నగరంలో ఐటీ కార్యాలయాలు (IT firms) సోమవారం ఉదయం నుండి తెరుచుకున్నాయి. 33 శాతం ఉద్యోగులతో ఐటీ కంపెనీలు పని మొదలు పెట్టాయి. దీంతో హైటెక్ సిటీ (HITEC City) పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు పెరిగాయి. కాగా కార్యాలయాలకు వస్తున్న సిబ్బంది నిబంధనలు పాటించాలని, మాస్కులు, శానిటైజర్స్ తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. అమ్మాయే అబ్బాయి ఐడీతో గ్యాంగ్ రేప్ ఛాట్ చేసింది, బాయిస్ లాక‌ర్ రూమ్ కేసులో బయటపడ్డ ట్విస్ట్, 26 మంది విద్యార్థులు అరెస్ట్

కార్యాలయాలు తెరుచుకోవడంతో ఐటీ కారిడార్‌లో రద్దీ పెరిగింది. రెడ్ జోన్‌లో 33 శాతం మంది సిబ్బందితో మాత్రామే కార్యాలయాలు పనిచేయనున్నాయి. దాదాపు రెండు నెలల విరామం తర్వాత ఐటీ కారిడార్ తిరిగి ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం ఐటీ ఉద్యోగులకు సడలింపులు ఇవ్వడంతో మొత్తం ఒక్కసారిగా ఉద్యోగులందరూ రోడ్డుపైకి వచ్చారు. హైదరాబాద్ మొత్తం రెడ్ జోన్ ఉన్ననేపథ్యంలో 33 శాతం ఉద్యోగులు మాత్రమే పనిచేయాలని సూచించింది. మిగిలినవారికి వర్క్ ఫ్రమ్ హోం చేయాలని ఐటీ కంపెనీలు ఆదేశాలు జారీ చేశాయి.

రాష్ట్రంలో ఈ నెల 29 వరకు లాక్‌డౌన్‌ (Telangana Lockdown 3.0) అమలులో ఉంటుందని ఇటీవల సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. అయితే కేంద్రం పరిధిలో ఉన్న రైల్వేశాఖ ఆధ్వర్యంలో నడిచే ఎంఎంటీఎస్‌ సర్వీసులపై అన్ని వర్గాల ప్రజలు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఐటీ కార్యాలయాలు తెరుచుకోవడంతో ఇప్పుడు ఎంఎంటీసీ రైళ్లు ఎప్పుడు పునరుద్ధరిస్తారనేది తేలాల్సి ఉంది. కొత్త హాల్ టికెట్లు ఉండవు, తెలంగాణలో పాత హాల్ టికెట్లతోనే పదవతరగతి పరీక్షలు, క్లారిటీ ఇచ్చిన ఎస్ఎస్‌సీ బోర్డు, హైకోర్టు అనుమతి కోసం వెయిటింగ్

ఇక గ్రేటర్‌ ప్రజా రవాణా వ్యవస్థలో కీలకంగా మారిన మెట్రో రైళ్లు జూన్‌ మొదటి వారంలో తిరిగి ప్రారంభించే అవకాశం ఉన్నట్లు మెట్రో అధికారులు చెబుతున్నారు. గ్రేటర్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. అయినా, ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇస్తోంది. కొన్ని కేటగిరీల వ్యాపార సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు పని చేస్తున్నాయి. ఈ క్రమంలో అందరూ ప్రజా రవాణా వైపు చూస్తున్నారు.

అయితే, రెడ్‌జోన్‌లో ఉన్న నగరంలో ఇప్పటికిప్పుడు ప్రజారవాణాకు అనుమతి ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కేంద్రం మే 17 వరకు లాక్‌డౌన్‌ పాటించాలని నిర్ణయిస్తే, రాష్ట్ర ప్రభుత్వం మే 29 వరకు పొడిగించింది. మే 15 తర్వాత మరికొన్ని సడలింపులు ఇచ్చే అవకాశం ఉన్నా, నగరంలో కేసుల తీవ్రత దృ ష్ట్యా ప్రజారవాణా వ్యవస్థను ఈ నెలలో అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం కనిపించడం లేదు.