SSC Exams 2020 | (Photo-PTI)

Hyderabad, May 11: దేశవ్యాప్తంగా లాక్డౌన్ (India Lockdown) కారణంగా, ఎస్ఎస్సి పరీక్షలు (SSC Exams in TS) అకస్మాత్తుగా వాయిదా పడిన విషయం విదితమే. ప్రస్తుతానికి, ఎస్ఎస్‌సీ పరీక్షలలో కేవలం మూడు పేపర్లు మాత్రమే నిర్వహించబడ్డాయి. ఇంకా ఎనిమిది పేపర్లు మిగిలి ఉన్నాయి. వీటిలో ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ మరియు సైన్స్ వంటి ప్రధాన అంశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (Telangana State Board of Secondary Education) మరో కీలక నిర్ణయం తీసుకుంది. జూలై ఒకటి నుంచి జూలై 15 వరకూ సిబిఎస్ఇ 10, 12వ తరగతి పరీక్షలు, తేదీలను ప్రకటించిన కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్

ఇప్పటికే మార్చిలో విడుదలైన పాత హాల్ టిక్కెట్లతో (Old Hall Tickets) ఎస్ఎస్సి పరీక్షలను నిర్వహించాలని తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్ణయించింది. దీనిపై బోర్డు డైరెక్టర్ ఎ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ పరీక్షలకు హాజరు కావడానికి కొత్త హాల్ టికెట్లు అవసరం లేదని, దీనికి సంబంధించిన సూచనలు అధికారులకు అందజేస్తామని చెప్పారు. లాక్‌డౌన్ నేపథ్యంలో సామాజిక దూరం కారణంగా, ఒక విద్యార్థిని మాత్రమే బెంచ్ మీద కూర్చుని పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేయనున్నారు.

పరీక్షా తేదీలను ప్రకటించే ముందు ప్రభుత్వానికి హైకోర్టు అనుమతి అవసరమని తెలంగాణ విద్యా మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం, ప్రభుత్వం హైకోర్టు లో అఫిడవిట్ దాఖలు చేయవచ్చు. పరీక్షలు నిర్వహించడానికి కోర్టు అనుమతిస్తే, వాటిని ఈ నెల చివరి నాటికి నిర్వహిస్తామని రెడ్డి తెలిపారు. యూనివర్సిటీలో పరీక్షలు లేకుండానే పై తరగతులకు, మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం, ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు పరీక్షలు రాయాలని తెలిపిన విద్యాశాఖ మంత్రి ఉదయ్‌ సామంత్‌

మొత్తం 5.34 లక్షల మంది విద్యార్థులు ఉండటంతో.. మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షల కోసం (TS SSC Board Exam 2020) 2,530 కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరోనా వ్యాప్తి కారణంగా పరీక్ష కేంద్రాల సంఖ్యను దాదాపు రెట్టింపు చేస్తామని ప్రభుత్వం సైతం ప్రకటించింది. గతంలో ఒకవైపు పదో తరగతి పరీక్షలు జరుగుతుంటే, మరోవైపు 1-9 తరగతులు కొనసాగేవన్నారు.

ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో అదే పరీక్ష కేంద్రంలోని ఇతర గదులను, ప్రాథమిక పాఠశాలలనూ వినియోగించుకుంటామని చెప్పారు. దాంతో సగానికిపైగా కేంద్రాలు పాత పరీక్ష కేంద్రాల్లోనే ఉంటాయని, విద్యార్థులు అక్కడే పరీక్ష రాస్తారని తెలిపారు. గతంలో ఎంపిక చేసిన గదులను పరీక్ష కేంద్రం-ఏ అని, కొత్తగా ఎంపిక చేసిన వాటికి పరీక్ష కేంద్రం-బి అని విభజిస్తామన్నారు.

సదరు ప్రాంగణంలో గదులు అందుబాటులో లేని పక్షంలో దానికి అత్యంత సమీపంలోని పాఠశాల/కళాశాలను ఎంపిక చేస్తామన్నారు. పరీక్షకు ముందు రోజు సంబంధిత కేంద్రం వద్దకు వెళ్లి చూసుకుంటే అదే ప్రాంగణమా? పక్కన పాఠశాలలోనా? అనే విషయం తెలుస్తుందని చెప్పారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.