Telangana Lockdown 4: సాధారణ స్థితికి చేరుకుంటున్న తెలంగాణ, బస్సు సర్వీసులు, దుకాణాలపై మరిన్ని సడలింపులు, కరోనాపై భయం వద్దని తెలిపిన సీఎం కేసీఆర్

అన్ని దుకాణాలు తమ కార్యకలాపాలు చేసుకునేందుకు ప్రభుత్వం (TS govt) నిన్న అనుమతి తెలిపిన సంగతి విదితమే. ఎక్కువ దుకాణాలు తెరిచి తక్కువ మంది ఉండే విధానం అనుసరించాలని నిర్ణయించింది. దుకాణ యజమానులు, వినియోగదారులు కొవిడ్‌ (COVID-19) నిబంధనలు తప్పక పాటించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Telangana CM KCR | File Photo

Hyderabad, May 28: హైదరాబాద్‌లో నేటి నుంచి మాల్స్‌ మినహా అన్ని దుకాణాలు (ALL Shops) తెరుచుకున్నాయి. అన్ని దుకాణాలు తమ కార్యకలాపాలు చేసుకునేందుకు ప్రభుత్వం (TS govt) నిన్న అనుమతి తెలిపిన సంగతి విదితమే. ఎక్కువ దుకాణాలు తెరిచి తక్కువ మంది ఉండే విధానం అనుసరించాలని నిర్ణయించింది. దుకాణ యజమానులు, వినియోగదారులు కొవిడ్‌ (COVID-19) నిబంధనలు తప్పక పాటించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక తెలుగు రాష్ట్రాలే టార్గెట్, పశ్చిమ భారతాన్ని వణికించిన మిడతల గుంపు, మహారాష్ట్రలో ప్రస్తుతం తిష్ట వేసిన రాకాసి మిడతలు

ఆర్టీసీ బస్సులకు సైతం నేటి నుంచి కర్ఫ్యూ నిబంధనల మినహాయింపులు వర్తించనున్నాయి. జిల్లాల నుంచి వచ్చే బస్సులు జేబీఎస్‌తో పాటు ఎంజీబీఎస్‌లో ఆగేందుకు అనుమతి తెలిపింది. హైదరాబాద్‌ నగరంలో మాత్రం సిటీ బస్సులకు అనుమతిలేదు. ప్రయాణికులు సిటీ బస్సులకు కోసం మరికొంతకాలం వేచి చూడాల్సిందే. కాగా ఇతర రాష్ట్రాల బస్సులకు రాష్ట్రంలోకి అనుమతి లేదని స్పష్టం చేసింది. మిడతల దాడిపై అధికారులు అలర్ట్, వాటిని చంపేందుకు రంగం సిద్ధం, ఇవి పొలంపై వాలాయంటే అంతే సంగతులు

తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనలను మరింత సడలించింది. ఆర్టీసీ బస్సులకు కర్ఫ్యూ (night curfew) నిబంధనల నుంచి మినహాయింపునిచ్చింది. జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే బస్సులు జేబీఎస్‌తోపాటు, ఇమ్లిబన్‌కు కూడా వెళ్లేందుకు అనుమతినిచ్చింది. హైదరాబాద్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మరికొన్ని రోజులవరకు నగరంలో సిటీ బస్సులు నడుపరాదని నిర్ణయించింది. హైదరాబాద్‌ నగరంలో (Hyderabad) నేటి నుంచి మాల్స్‌ మినహా అన్ని రకాల షాపులు తెరువడానికి ప్రభుత్వం అనుమతించింది. ఈ నిర్ణయాలు నేటి నుంచి అమలులోకి వస్తాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో 5 వేలకు చేరువలో కరోనా కేసులు, తెలంగాణలో కొత్తగా 107 కేసులు నమోదు, ఏపీలో తాజాగా 54 కోవిడ్-19 కేసులు

లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడం వల్ల కరోనా విషయంలో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, అయితే అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ (CM KCR) పేర్కొన్నారు. ప్రగతిభవన్‌లో ఆర్టీసీ, కరోనా- లాక్‌డౌన్‌, ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర అవతరణ వేడుకలు తదితర అంశాలపై మంత్రివర్గ సహచరులు, ఆయా శాఖల అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులు రాష్ట్రంలో బస్సు సర్వీసులు పునరుద్ధరించిన తర్వాత పరిస్థితిని వివరించారు.

రోజుకు రూ.11 నుంచి 12 కోట్ల వరకు ఆదాయం రావాలి. ఎండాకాలం, పెండ్లిళ్ల సీజన్‌లో రూ.15 కోట్ల వరకు ఆదాయం రావాలి. కానీ, ఇప్పుడు కేవలం రూ.2 కోట్లు మాత్రమే వస్తున్నది. కేవలం 39 శాతం మాత్రమే ఆక్యుపెన్సీ ఉంటున్నది. దీనికి ప్రధానకారణం రాత్రి కర్ఫ్యూ. ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు రాత్రి 7 గంటల లోపు గమ్యస్థానాలకు చేరుకోవడం సాధ్యం కావడంలేదు. ఎండాకాలం కావడంతో ప్రజలు ఉదయం, లేదా సాయంత్రం మాత్రమే ప్రయాణం చేయడానికి మొగ్గుచూపుతున్నారు. పగటిపూట మాత్రమే బస్సులు నడుపడం వల్ల ప్రజలకు ఉపయోగపడటం లేదు’ అని ఆర్టీసీ అధికారులు సీఎంకు వివరించారు. దీంతో ప్రభుత్వం ఆర్టీసీ బస్సులకు కర్ఫ్యూ నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది. బస్టాండ్లలో ట్యాక్సీలు, ఆటోలు తదితర రవాణా వాహనాలకు కూడా కర్ఫ్యూ ఆంక్షలు సడలించారు.

బస్‌ టికెట్‌ కలిగిన ప్రయాణికులు కర్ఫ్యూ సమయంలో కూడా ప్రైవేటు వాహనాల్లో తమ ఇండ్లకు చేరుకోవడానికి పోలీసులు అభ్యంతర పెట్టకూడదని నిర్ణయం తీసుకున్నారు. జిల్లాల నుంచి హైదరాబాద్‌ వచ్చే బస్సులన్నీ ప్రస్తుతం జేబీఎస్‌లోనే ప్రయాణికులను దించుతున్నాయి. గురువారం నుంచి బస్సులను ఇమ్లిబన్‌కు కూడా అనుమతించనున్నారు. హైదరాబాద్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మరికొన్ని రోజులవరకు నగరంలో సిటీబస్సులు నడుపరాదని నిర్ణయించారు. అదేవిధంగా అంతర్రాష్ట్ర బస్సులను కూడా మరికొన్ని రోజుల పాటు నడుపకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.

కరోనా వైరస్‌ సోకినా చాలామందిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొద్దిమందిలో లక్షణాలు కనిపిస్తున్నాయి. సీరియస్‌గా ఉన్నవారి విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ప్రజలు కొవిడ్‌ మార్గదర్శకాలు పాటించాలి’ అని తెలంగాణ సీఎం పేర్కొన్నారు. సమీక్షల్లో మంత్రులు కేటీఆర్‌, ఈటల, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, పువ్వాడ అజయ్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, డీజీపీ మహేందర్‌రెడ్డి, ముఖ్యకార్యదర్శులు నర్సింగ్‌రావు, శాంతకుమారి, రామకృష్ణారావు, కాళోజీ హెల్త్‌ వర్సిటీ వైస్‌చాన్సలర్‌ కరుణాకర్‌రెడ్డి డీఎంఈ రమేశ్‌రెడ్డి, డీహెచ్‌ శ్రీనివాస్‌, మెడికల్‌ హెల్త్‌ సలహాదారు గంగాధర్‌, ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ, ఈడీ యాదగిరి, మున్సిపల్‌శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌, ఎంఏయూడీ కమిషనర్‌ సత్యనారాయణ, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ రఘునందన్‌ తదితరులు పాల్గొన్నారు.