Telangana Lockdown Ends: ఈ పాస్ అవసరం లేదు, తెలంగాణ సరిహద్దులో ఆంక్షలు ఎత్తివేసిన అధికారులు, అంతర్రాష్ట్ర బస్సుల రాకపోకలపై ఇంకా రాని క్లారిటీ, ఏపీలో కొనసాగుతున్న కర్ఫ్యూ
ఇకపై పాస్ అవసరం లేకుండానే తెలంగాణలోకి (Telangana) రావచ్చని అధికారులు తెలిపారు. అర్ధరాత్రి నుంచే ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఎటువంటి ఆంక్షలు లేకుండా తెలంగాణలోకి వాహనాలను అనుమతిస్తున్నారు.
Hyderabad, June 20: తెలంగాణలో నేటి నుంచి లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేసిన (Telangana Lockdown Lifted) నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ నుంచి వచ్చే వాహనాలకు ఆటంకాలు తొలగిపోయాయి. ఇకపై పాస్ అవసరం లేకుండానే తెలంగాణలోకి (Telangana) రావచ్చని అధికారులు తెలిపారు.
అర్ధరాత్రి నుంచే ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఎటువంటి ఆంక్షలు లేకుండా తెలంగాణలోకి వాహనాలను అనుమతిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో నైట్ కర్ఫ్యూ Night Curfew) అమల్లో ఉండటంతో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య ఆంధ్రాలోకి వెళ్ళాలి అంటే తప్పని సరి ఈ-పాస్ కావాలని అధికారులు స్పష్టం చేశారు. కర్ఫ్యూ అమలులో లేని సమయంలో ఈ-పాస్ అవసరం లేదని వివరించారు. కాగా.. ప్రభుత్వం లాక్‌డౌన్‌ను (Telangana Lockdown Ends) ఎత్తివేయడంతో ఆదివారం నుంచి ఆర్టీసీ బస్సులు పూర్తి స్థాయిలో నడస్తాయని ప్రకటించినప్పటికీ.. ఒక్క అంతర్రాష్ట్ర బస్సుల రాకపోకలపై క్లారిటీ రాలేదు.
దీంతో హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లే జనాలు.. ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు వచ్చేవారు సందిగ్ధంలో పడ్డారు. అయితే శనివారం అర్ధరాత్రి దాటాక ఇక తెలంగాణ బార్డర్‌లో ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన రిలీజ్ చేయడంతో రాకపోకలు సాగుతున్నాయి.
మరోవైపు.. ఏపీలో కర్ఫ్యూ కొనసాగుతోంది. గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద ఆంక్షలు కొనసాగుతున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ సమయంలో ఈ -పాస్ ఉంటేనే ఆంధ్రాలోకి పోలీసులు అనుమతి ఇవ్వనున్నారు. అయితే.. తెలంగాణలో ఎలాంటి నిబంధనల్లేవ్.. ఆంక్షల్లేవ్! నైట్ కర్ఫ్యూ లేదు! పార్కులు, బార్లు, జిమ్‌లు, మాల్స్, సినిమా హాళ్లు తెరుచుకోనున్నాయ్! అంతర్రాష్ట్ర రవాణా మళ్లీ మొదలు కానుంది! జూలై ఒకటో తేదీ నుంచి విద్యా సంస్థలు కూడా ప్రారంభం కానున్నాయి! ఈ మేరకు రాష్ట్రంలో 40 రోజులుగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను ప్రభుత్వం సంపూర్ణంగా ఎత్తి వేసింది!.