Police personnel punishes violators during the lockdown (Photo-ANI)

Hyderabad, June 19: జూన్ 19 వరకు అమల్లోవున్న లాక్‌డౌన్‌ను రేపటినుంచి(జూన్ 20 నుంచి) సంపూర్ణంగా ఎత్తివేయాలని తెలంగాణ కేబినెట్ (TS Cabinet Meeting) నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సర్కారు తాజాగా అన్‌లాక్‌ మార్గదర్శకాలు (Telangana Unlock Guide Lines) విడుదల చేసింది.

మాస్కు ధరించడం తప్పనిసరి అని, లేనిపక్షంలో వెయ్యి రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఆఫీసులు, దుకాణాలు తదితర జనసమ్మర్థం ఎక్కువగా ఉండే చోట్ల కోవిడ్‌ నిబంధనలు పాటించాలని (Covid Rules) పేర్కొంది. అదే విధంగా కరోనా వ్యాప్తి కొనసాగుతున్న తరుణంలో శనివారం భేటీ అయిన మంత్రివర్గం ఆస్పత్రుల నిర్మాణ విషయమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

లాక్‌డౌన్‌కు ముందున్న అన్ని కార్యకలాపాలకు అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు తెలంగాణ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. టిమ్స్‌ను ఇకపై ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆధునీకరించాలని తెలంగాణ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.

తెలంగాణలో జూలై 1 నుంచి విద్యా సంస్థలు ప్రారంభం, పాఠశాలలకు రాని విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతుల్లో హాజరుకావచ్చు, విధివిధానాలను త్వరలో విడుదల చేయాలని విద్యాశాఖకు కేబినెట్‌ ఆదేశాలు

అలాగే గొర్రెల పెంపకం పథకాన్ని తిరిగి ప్రారంభించాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. నాయిబ్రాహ్మణుల కోసం మోడ్రన్ సెలూన్ల ఏర్పాటు చేయాలని కేబినెట్‌ ఆదేశించింది. చేనేత, గీత కార్మికులకు బీమా త్వరగా అందించాలని కేబినెట్‌ సూచించింది. వివిధ వృత్తి కులాల ఎంబీసీ కార్పొరేషన్‌కు నిధులు విడుదల చేయాలని తెలంగాణ కేబినెట్ ఆదేశించింది.

తెలంగాణలో లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తివేత, కీలక నిర్ఱయం తీసుకున్న కేబినెట్, అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖలకు అధికారుల ఆదేశాలు

తెలంగాణలో అన్‌లాక్‌ గైడ్‌లైన్స్

►జులై 1 నుంచి విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు పునఃప్రారంభం

►భౌతిక దూరం, మాస్క్‌ తప్పనిసరి

►మాస్క్‌ లేకుంటే వెయ్యి రూపాయల ఫైన్‌

►కార్యాలయాలు, దుకాణాల్లో కోవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి

►నిబంధనలు పాటించకుంటే డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కింద చర్యలు

►బహిరంగ ప్రదేశాలు, పని ప్రదేశాల్లో మాస్కు ధరించడం తప్పనిసరి.

►మాస్కు ధరించకపోతే వెయ్యి రూపాయల జరిమానా.

►ఆఫీసులు, దుకాణాల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించాలి.

►భౌతిక దూరం, శానిటైజేషన్‌ తప్పనిసరి.

►జూలై 1 నుంచి విద్యాసంస్థలు, కోచింగ్‌ సెంటర్లు తెరిచేందుకు అనుమతి.

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు

►హైదరాబాద్‌లో 3 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులకు ఆమోదం

►టిమ్స్‌ను సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిగా ఆధునీకరించాలని నిర్ణయం

►చెస్ట్ ఆస్పత్రి, గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్‌ ప్రాంగణాల్లో ఆస్పత్రుల నిర్మాణం

►అల్వాల్ నుంచి ఓఆర్ఆర్ మధ్యలో మరో ఆస్పత్రి నిర్మాణం