School Kids. Representational Image (Photo credits: Pixabay)

Hyderabad, June 19: తెలంగాణ రాష్ట్రంలో జూలై 1 నుంచి అన్ని కేటగిరీల విద్యా సంస్థలను, పూర్తి స్థాయి సన్నద్థతతో ప్రారంభించాలని (Telangana Schools Reopening) విద్యాశాఖను కేబినెట్ ఆదేశించింది. ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే విద్యార్థులను స్కూళ్లకు పంపాలా, వద్దా అనేది తల్లిదండ్రుల నిర్ణయానికి కేబినెట్‌ వదిలేసింది.

విద్యార్థులు తప్పనిసరిగా స్కూళ్లకు రావాలని యాజమాన్యాలు బలవంతపెట్టకూడదని కేబినెట్‌ ఆదేశించింది. పాఠశాలలకు రాని విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతుల్లో హాజరుకావచ్చని కేబినెట్‌ (cabinet meeting) సూచించింది. విధివిధానాలను త్వరలో విడుదల చేయాలని విద్యాశాఖకు కేబినెట్‌ ఆదేశాలు జారీ చేసింది. ఇక తెలంగాణలో లాక్‌డౌన్‌ను సంపూర్ణంగా ఎత్తివేయాలని (state govt lifts lockdown) రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) అధ్యక్షతన ప్రగతి భవన్‌లో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ఈమేరకు కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రజల నిర్లక్ష్యం, 6 నుంచి 8 వారాల్లో కరోనా థర్డ్ వేవ్, పాజటివ్ కేసులు 5 శాతం దాటితే వెంటనే మినీ లాక్ డౌన్ పెట్టాలని సూచించిన ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్ రందీప్ గులేరియా

దేశవ్యాప్తంగానే కాకుండా, పక్క రాష్ట్రాల్లో కూడా కరోనా నియంత్రణలోకి వస్తున్న విషయాన్ని కేబినెట్‌ పరిశీలించింది. తెలంగాణ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలకంటే వేగంగా కరోనా నియంత్రణలోకి వచ్చిందని అధికారులు అందించిన నివేదికల ఆధారంగా మంత్రివర్గం నిర్ధారించింది. ఈమేరకు జూన్‌ 19 వరకు అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ను (Lockdown) రేపటి నుంచి సంపూర్ణంగా ఎత్తివేయాలని నిర్ణయించింది.

తెలంగాణలో లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తివేత, కీలక నిర్ఱయం తీసుకున్న కేబినెట్, అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖలకు అధికారుల ఆదేశాలు

ప్రజా జీవనం, సామాన్యుల బతుకు దెరువు దెబ్బతినొద్దనే ముఖ్య ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయానికి ప్రజల సహకారం కావాలని రాష్ట్ర మంత్రివర్గం కోరింది. లాక్‌డౌన్ ఎత్తివేసినంత మాత్రాన కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదని, తప్పనిసరిగా మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్‌ ఉపయోగించడం.. తదితర కరోనా స్వీయ నియంత్రణ విధానాలు విధిగా పాటించాలని స్పష్టం చేసింది. కరోనా పూర్తిస్థాయిలో నియంత్రణకు ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని రాష్ట్ర ప్రజలను కేబినెట్‌ కోరింది.

గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. మరోవైపు ప్రభుత్వం కూడా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేసింది. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ప్రత్యేక డ్రైవ్‌లు పెట్టి పౌరులకు వ్యాక్సిన్‌ అందిస్తున్నారు. దీంతో చాలా వరకూ కేసులు తగ్గాయి. కేబినెట్‌ నిర్ణయం మేరకు రేపటి నుంచి ప్రభుత్వ కార్యాలయాలు, బస్సులు, మెట్రో సర్వీసులు అన్నీ ఎప్పటిలాగే నడుస్తాయి.

హైదరాబాద్‌లో డబుల్ డోస్ వ్యాక్సిన్ కలకలం, ఫోన్ మాట్లాడుతూ యువతికి ఓకేసారి డబుల్‌ డోస్‌ వ్యాక్సిన్‌ ఇచ్చిన నర్స్‌, వాక్సిన్ అనంతరం కళ్లు తిరిగి పడిపోయిన యువతి, ఇప్పుడు నిలకడగా పరిస్థితి

ప్రజా అవసరాలకు అనుగుణంగా గచ్చిబౌలి ‘టిమ్స్’ ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా అధునికీకరించడంతో పాటు మరో మూడు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎల్బీనగర్‌ పరిధిలోని కొత్తపేటలో ప్రస్తుతం ఉన్న కూరగాయల మార్కెట్‌ రూపురేఖలు మార్చి ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్‌గా మార్చాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించింది.