Vaccine| Representational Image (Photo credits: Pixabay)

Hyderabad, June 19: దేశమంతా కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో (Telangana Hyderabad) డబుల్ డోస్ వ్యాక్సిన్ కలకలం రేపుతోంది. బీహార్ రాజధాని పాట్నా శివారులో జరిగిన ఇలాంటి ఘటన మరువక ముందే హైదరాబాద్ శివారులో మరో ఘటనల అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ నర్స్‌ నిర్లక్ష్యంతో ఓ యువతికి ఓకేసారి డబుల్‌ డోస్‌ వ్యాక్సిన్‌ (nurse gives two doses of Covid vaccine) వేసింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్ జెడ్పీహెచ్ఎస్‌లో చోటు చేసుకుంది.

హయత్‌నగర్ మండలం కుంట్లూరు రాజీవ్ గృహకల్ప కాలనీకి చెందిన లక్ష్మీ ప్రసన్న(21) వ్యాక్సిన్ వేసుకునేందుకు బుధవారం అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వచ్చింది. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న నర్సు పద్మ.. ఆ యువతికి ఒక డోసు వ్యాక్సిన్ వేసింది. తనకు టీకా పూర్తి అయ్యిందని తెలియక ఆమె అలాగే కూర్చుండిపోయింది. అయితే, వ్యాక్సిన్ ఇచ్చిన నర్సుకు ఫోన్ కాల్ రావడంతో.. మాట్లాడుతూ రెండో వాక్సిన్ (two doses of Covid vaccine) ఇచ్చేసింది. వాక్సిన్ అనంతరం కళ్లు తిరగడంతో యువతి లక్ష్మీ ప్రసన్నకింద పడిపోయింది.

ప్రజల నిర్లక్ష్యం, 6 నుంచి 8 వారాల్లో కరోనా థర్డ్ వేవ్, పాజటివ్ కేసులు 5 శాతం దాటితే వెంటనే మినీ లాక్ డౌన్ పెట్టాలని సూచించిన ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్ రందీప్ గులేరియా

దీంతో అక్కడే ఉన్న స్థానికులు వైద్య సిబ్బంది సాయంతో వనస్థలిపురం ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. యువతిని ప్రత్యేక వార్డులో ఉంచి అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో రంగారెడ్డి జిల్లా వైద్యాధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. సదరు యువతిని అబ్జర్వేషన్‌లో ఉంచి పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.