Corona in TS: తెలంగాణలో కరోనా థర్డ్ వేవ్ అలర్ట్, ఇద్దరిలో ఏవై.4.2(AY.4.2) వేరియంట్, కొత్తగా 171 మందికి కోవిడ్ పాజిటివ్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 58 కొత్త కేసులు నమోదు

గత నెలలో తెలంగాణలో నమోదైన కేసులకు చెందిన 274 మంది రక్త నమూనాలను హైదరాబాదులోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ లేబొరేటరీలో జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపగా.. వీటిలో రెండు ఏవై4.2 రకం కేసులు ఉన్నట్టు తేలిందని వెల్లడించింది.

Coronavirus in India (Photo Credits: PTI)

Hyd, Oct 28: తెలంగాణలో ఇద్దరిలో ఏవై.4.2(AY.4.2) వేరియంట్ గుర్తించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలోని జీఐఎస్ఏఐడీ తెలిపింది. గత నెలలో తెలంగాణలో నమోదైన కేసులకు చెందిన 274 మంది రక్త నమూనాలను హైదరాబాదులోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ లేబొరేటరీలో జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపగా.. వీటిలో రెండు ఏవై4.2 రకం కేసులు ఉన్నట్టు తేలిందని వెల్లడించింది.

ఈ వివరాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలోని గ్లోబల్ ఇనిషియేటివ్ ఇన్ షేరింగ్ ఆఫ్ ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా (జీఐఎస్‌ఏఐడీ) వెల్లడించింది. కాగా ప్రపంచ వ్యాప్తంగా 26 వేల ‘ఏవై.4.2’ కేసులు GISAIDలో నమోదైనట్టు తాజాగా WHO ఒక నివేదికలో పేర్కొంది. ఈమేరకు వివరాలను అక్టోబర్లో జీఐఎస్‌ఏఐడీకి కేంద్రం అందజేసింది. ఈ రెండు కేసులు 48 ఏళ్ల పురుషుడు, 22 ఏళ్ల మహిళవి. అయితే ఈ రెండు కేసుల వివరాలను గోప్యంగా ఉంచారు. వారు ఇప్పుడు ఎలా ఉన్నారు? వారు పూర్తిగా కోలుకున్నారా? అనే విషయాల్లో క్లారిటీ లేదు.

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 38,373 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 171 పాజిటివ్ కేసులు (Corona in TS) వెల్లడయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో (GHMC) అత్యధికంగా 58 కొత్త కేసులు నమోదు కాగా; కరీంనగర్, వరంగల్ అర్బన్, రంగారెడ్డి జిల్లాలలో 13 కేసుల చొప్పున గుర్తించారు. వికారాబాద్, నారాయణపేట, ములుగు, మెదక్, కామారెడ్డి, జోగులాంబ గద్వాల్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

కరోనా థర్డ్ వేవ్ అలర్ట్, 5 రాష్ట్రాలకు పాకిన కొత్త కరోనా వేరియంట్, నవంబర్ 30 వరకు కోవిడ్ గైడ్‌లైన్స్ పొడిగించిన కేంద్రం, తెలంగాణలో ఏవై.4.2(AY.4.2) వేరియంట్

అదే సమయంలో 208 మంది కరోనా (Coronavirus) నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,71,000 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,62,922 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 4,126 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,952కి పెరిగింది. ప్రస్తుతం తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.58 శాతానికి పడిపోయింది. జాతీయస్థాయిలో అది 1.3 శాతంగా ఉంది.