MHA Extends Covid Guidelines: కరోనా థర్డ్ వేవ్ అలర్ట్, 5 రాష్ట్రాలకు పాకిన కొత్త కరోనా వేరియంట్, నవంబర్ 30 వరకు కోవిడ్ గైడ్‌లైన్స్ పొడిగించిన కేంద్రం, తెలంగాణలో ఏవై.4.2(AY.4.2) వేరియంట్
COVID 2019 Outbreak| PTI Photo

New Delhi, Oct 28: కరోనావైరస్ మహమ్మారి ఇంకా పూర్తిగా పోలేదు. ఇప్పటికే రెండు వేవ్‌లు ప్రపంచవ్యాప్తంగా జనాలను అల్లకల్లోలం చేశాయి. ఎందరో కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. అయితే గత కొన్ని రోజులుగా కేసులు సంఖ్య (Coronavirus in India) తగ్గుముఖం పట్టడంతో కరోనా శాంతించింది.

అయినప్పటికి కోవిడ్‌ ముగిసిపోలేదని.. థర్డ్‌ వేవ్‌ ముప్పు (Covid Thrid Wave Alert) ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ, నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మన దేశంలో పలు రాష్ట్రాల్లో వెలుగు చూస్తున్న కోవిడ్‌ కొత్త వేరియంట్‌ ఏవై.4.2(AY.4.2) వేరియంట్ థర్డ్ వేవ్ హెచ్చరికలను తీసుకువస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా నిబంధనలు మరికొన్నిరోజులు పొడిగించాలని కేంద్ర హోంశాఖ (MHA Extends Covid Guidelines) నిర్ణయించింది. దేశంలో కరోనా ఆంక్షలను నవంబరు 30 వరకూ పొడిగిస్తున్నట్లు ఒక ప్రకటన చేసింది.

కంటైన్‌మెంట్‌ జోన్లు, అలాగే 5 శాతం కన్నా ఎక్కువ పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాల్లో ప్రజలు గుమిగూడే ఎటువంటి కార్యక్రమాలకు అనుమతులు లేవని కేంద్రం తన ఉత్తర్వుల్లో తెలిపింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కొవిడ్‌-19 నిర్వహణలోని ఐదు సూత్రాలు ‘టెస్ట్-ట్రాక్‌-ట్రీట్‌-వ్యాక్సినేట్‌తోపాటు కరోనా సమయంలో సముచిత ప్రవర్తన’ అనే వాటిని కచ్చితంగా పాటించాలని పేర్కొంది.

మళ్లీ డేంజర్‌జోన్‌లోకి చైనా, ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు, పలు ప్రావిన్స్‌ల‌లో లాక్‌డౌన్ నిబంధనలు అమల్లోకి, ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు

ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా మహమ్మారి మరింత వ్యాపించకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వివరించింది. కాగా, ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలల్లో కరోనా మహమ్మారి విజృంభించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కరోనా కేసులు నెమ్మదిగా తగ్గుముఖం పట్టాయి. కానీ పండుగల సీజన్‌ రావడంతో వైద్యారోగ్య శాఖ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. చలికాలం, పండుగల సీజన్‌ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, కరోనా నిబంధనలను అలక్ష్యం చేయొద్దని సూచించిన సంగతి తెలిసిందే.

ఏవై.4.2(AY.4.2) వేరియంట్‌కు సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఈ కొత్త వేరియంట్‌.. సెకండ్‌ వేవ్‌ సమయంలో తీవ్ర నష్టం కలిగించిన డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కుటుంబానికి చెందినది అని.. దీని వల్ల కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌ వచ్చే అవకాశం అధికంగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇప్పటికే దేశవ్యాప్తంగా కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ, కేరళ, తెలంగాణ, జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రాల్లో ఈ కొత్త వేరియంట్‌ ప్రవేశించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అధికారులు ఈ కొత్త వేరియంట్‌ గురించి పరిశోధించే పనిలో ఉన్నారు. ఇక ప్రస్తుతం మహారాష్ట్ర సహా దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య పెరిగింది. దేశంలో 16,156 కొత్త కేసులు నమోదు కాగా.. 733 మంది మరణించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,60,989 యాక్టీవ్‌ కేసులు ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.

మళ్లీ వణికిస్తున్న ఏవై.4 కరోనా వేరియంట్, మధ్యప్రదేశ్‌లో వ్యాక్సిన్ వేసుకున్న ఆరుగురికి పాజిటివ్, దేశంలో కొత్తగా 12,428 మందికి కరోనా, రష్యాలో ఒక్కరోజే 37,930 మందికి కోవిడ్

తెలంగాణలో ఏవై.4.2(AY.4.2) వేరియంట్ వైరస్ ను గుర్తించారు. ఇద్దరిలో ఈ తరహా వైరస్ ను గుర్తించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలోని జీఐఎస్ఏఐడీ తెలిపింది. గత నెలలో తెలంగాణలో నమోదైన కేసులకు చెందిన 274 మంది రక్త నమూనాలను హైదరాబాదులోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ లేబొరేటరీలో జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపగా.. వీటిలో రెండు ఏవై4.2 రకం కేసులు ఉన్నట్టు తేలిందని వెల్లడించింది. ఈ రెండు కేసులు 48 ఏళ్ల పురుషుడు, 22 ఏళ్ల మహిళవి. అయితే ఈ రెండు కేసుల వివరాలను గోప్యంగా ఉంచారు. వారు ఇప్పుడు ఎలా ఉన్నారు? వారు పూర్తిగా కోలుకున్నారా? అనే విషయాల్లో క్లారిటీ లేదు.

కర్ణాటకలో ప్రస్తుతం ఏడుగురు డెల్టా ప్లస్‌ వేరియంట్‌తో బాధపడుతున్నారని రాష్ట్ర ఆరోగ్యశాఖ కమిషన్‌ రణ్‌దీప్‌ తెలిపారు. ఏడు కేసుల్లో మూడు బెంగళూరులోనే నమోదయ్యాయని పేర్కొన్నారు. కొత్త వేరియంట్‌తో మరణాలు సంభవించలేదని చెప్పారు. కాగా, అండమాన్‌లో గడిచిన 24 గంటల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఇప్పటివరకు ఇక్కడ 7,648 మంది కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం నాలుగు యాక్టివ్‌ కేసులున్నాయి.