Telangana: ప్రేమికుల రోజున చెరువులో శవాలై కనిపించిన లవర్స్, నార్సింగి గ్రామ సమీపంలోని సరస్సులో ఇద్దరి మృతదేహాలు లభ్యం, ఆత్మహత్య చేసుకున్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు

ప్రేమికుల రోజున పారిపోయిన వివాహిత & ఆమె ప్రేమికుడు (married woman & her lover) తెలంగాణలోని మెదక్ జిల్లాలో చెరువులో శవమై కనిపించారు.20 ఏళ్ల వయస్సు ఉన్న కల్పన & ఖలీల్ మృతదేహాలను నార్సింగి గ్రామ సమీపంలోని సరస్సు నుంచి (found dead in a pond) వెలికి తీశారు.

Representational Image (Photo Credits: File Image)

Hyd. Feb 16: ప్రేమికుల రోజున పారిపోయిన వివాహిత & ఆమె ప్రేమికుడు (married woman & her lover) తెలంగాణలోని మెదక్ జిల్లాలో చెరువులో శవమై కనిపించారు.20 ఏళ్ల వయస్సు ఉన్న కల్పన & ఖలీల్ మృతదేహాలను నార్సింగి గ్రామ సమీపంలోని సరస్సు నుంచి (found dead in a pond) వెలికి తీశారు. సరస్సు సమీపంలో 2 జతల పాదరక్షలు, ఒక మోటారుబైక్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.వివాహేతర సంబంధమే మరణానికి కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మండల కేంద్రమైన నార్సింగికి చెందిన కల్పన, అదే గ్రామానికి చెందిన ఖలీల్ ప్రేమించుకున్నారు. యువతి కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించకపోగా, మూడు నెలల క్రితం కామారెడ్డి జిల్లా తాడ్వాయికి చెందిన మరో వ్యక్తితో కల్పనకు పెళ్లి జరిపించారు. కొద్ది రోజుల క్రితం కల్పన నార్సింగిలోని పుట్టింటికి వచ్చింది.

ప్రియుడితో నగ్నంగా రూంలో అక్క ఉండగా చూసిన తమ్ముడు, తల్లిదండ్రులకు చెబుతానని బెదిరింపు, భయపడి కొడవలితో యువకుడి గొంతు కోసిన లవర్స్

సోమవారం ఆమె నార్సింగిలో ఆర్డినరీ బస్సు ఎక్కి రామాయంపేటలో దిగినట్టు, ఆ తర్వాత ఖలీల్​తో కలిసి బైక్​ మీద రామాయంపేట పట్టణంలో తిరిగినట్టు సీసీ కెమెరా పుటేజీలో కనిపించింది. అలాగే ఖలీల్​ బైక్​, అతని, కల్పన చెప్పులు మంగళవారం నార్సింగి చెరువు సమీపంలో కనిపించడంతో పోలీసులు ఈతగాళ్లను రప్పించి చెరువులో గాలింపు చేపట్టారు. ఆచూకీ లభించలేదు. కాగా కల్పన, ఖలీల్​ మృతదేహాలు ఈరోజు ఉదయం బయటకు తేలాయి. ఇద్దరు ప్రేమికులు కావడంతో చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు