Puvvada Ajay Kumar Covid: మంత్రి పువ్వాడకు రెండో సారి కరోనా పాజిటివ్, పూర్తిగా హోం ఐసోలేషన్ లో ఉన్నానని తెలిపిన తెలంగాణ రవాణా శాఖ మంత్రి, తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచన

మొదటి వేవ్‌లోనే మంత్రి అజయ్‌కు కరోనా సోకగా తాజాగా మరొకసారి పాజిటివ్‌ (tested coronavirus positive Second time) తేలడం ఆందోళన రేపుతోంది.

File image of TS Minister Puvvada Ajay | Photo: Twitter

Hyderabad, May 1: తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌కు (Puvvada Ajay Kumar) రెండోసారి కరోనా సోకింది. మొదటి వేవ్‌లోనే మంత్రి అజయ్‌కు కరోనా సోకగా తాజాగా మరొకసారి పాజిటివ్‌ (tested coronavirus positive Second time) తేలడం ఆందోళన రేపుతోంది. తేలికపాటి లక్షణాలు ఉండడంతో శుక్రవారం ఆర్టీపీసీఆర్‌ పరీక్ష నిర్వహించగా శనివారం రిపోర్ట్ వచ్చింది. అందులో పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో మంత్రి (telangana minister puvvada ajay kumar) వెంటనే తన నివాసంలో హోం ఐసోలేషన్‌కు వెళ్లారు.

దీనిపై మంత్రి పువ్వాడ ట్విట్టర్ లో స్పందించారు. ఆర్టీపీసీఆర్ టెస్టులో తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు. ప్రస్తుతం పూర్తిగా హోం ఐసోలేషన్ లో ఉన్నానని తెలిపారు. గత వారం రోజులుగా తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం తనకు ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రి వెల్లడించారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. త్వరలోనే యథావిధిగా మీ మధ్యకు వచ్చి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటాను అని మంత్రి ట్వీట్‌ చేశారు.

Here's Ajay Kumar Puvvada Tweet

ఇదిలా ఉంటే మంత్రి అజయ్‌ కుమార్ ఇటీవల ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా విస్తృతంగా పర్యటించారు. ఈ సమయంలోనే కరోనా సోకి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఎన్నికల వలన పెద్ద ఎత్తున కరోనా సోకుతుందని ఖమ్మంలో ప్రచారం జరుగుతోంది.

మంత్రి ఈటలకు షాక్..ఆరోగ్య శాఖ సీఎం కేసీఆర్‌కు బదిలీ, ఉ‍త్తర్వులు జారీ చేసిన గవర్నర్, అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతోందని తెలిపిన ఈటల రాజేందర్, భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తానని వెల్లడి

ఇప్పటికే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కరోనా బారినపడ్డారు. అయితే కేసీఆర్ ఎర్రవెళ్లి ఫాం హౌస్‌లో చికిత్స తీసుకుంటున్నారు. కేటీఆర్‌ మాత్రం శుక్రవారం ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌ 23న ఆయనకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అప్పటి నుంచి హోం ఐసొలేషన్‌లో ఉంటున్నారు.



సంబంధిత వార్తలు

MP Kiran Kumar Reddy: అల్లు అర్జున్‌పై ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్, బన్నీ రియల్ హీరో కాదు, స్క్రిప్ట్ తీసుకొచ్చి చదివారని ఆగ్రహం వ్యక్తం చేసిన భువనగిరి ఎంపీ

Year Ender 2024: దేశంలో ఈ ఏడాది అత్యధికంగా పన్ను చెల్లించిన సెలబ్రిటీ ఎవరో తెలుసా, అల్లు అర్జున్ ఎంత ట్యాక్స్ కట్టాడో తెలుసుకోండి, పూర్తి వివరాలు ఇవిగో..

MP Chamala Kiran Kumar Reddy: కేసీఆర్ ఇంట్లో ట్రయాంగిల్ ఫైట్, అరెస్ట్‌తో కేటీఆర్ హీరో కావాలనుకుంటున్నారు...కాంగ్రెస్ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్

Telangana Congress: కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం తగదు...ఇదే కొనసాగితే ప్రజలు బుద్దిచెప్పడం ఖాయమని వెల్లడి