Covid Alert in Telangana: తెలంగాణలో కొత్తగా ఆరు కేసులు, బీఎఫ్‌-7పై ప్రభుత్వం హై అలర్ట్, విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్ట్‌లో థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయాలని ఆదేశాలు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు (new COVID variant) పెరుగుతున్న నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయాలని నిర్ణయించారు.

Representational Image | PTI Photo

Hyd, Dec 22: కరోనా కొత్త వేరియంట్‌, ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్‌-7పై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్‌ (Covid Alert in Telangana) అయింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు (new COVID variant) పెరుగుతున్న నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయాలని నిర్ణయించారు.

ఇదిలా ఉంటే, బుధవారం రోజున తెలంగాణలో ఆరు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలో 34 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. పాజిటివ్‌ శాంపిల్స్‌ను అధికారులు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించింది.

ఈ లక్షణాలు ఉంటే ఒమిక్రాన్ బిఎఫ్.7 బారీన పడినట్లే, నోరు, ముక్కు, గొంతుకు అనుసంధానం అయ్యే ఎగువ శ్వాస కోశ నాళంపై తీవ్ర ప్రభావం

కొత్త వేరియంట్ గుర్తింపు కోసం స్వాబ్ నమూనాలను జీనోమ్ సీక్వెన్స్‌కి పంపించారు అధికారులు. అలాగే వ్యాక్సినేషన్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టిన వైద్యశాఖ.. సెకండ్ డోసు, బూస్టర్ డోసు వేసుకోని వారికి త్వరలో వ్యాక్సినేషన్ చేపట్టాలని నిర్ణయించింది.మరోవైపు కేంద్రప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలంటూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది.

దేశంలో కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్.7 కేసులు (Omicron Subvariant BF.7) వెలుగుచూసిన నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. గురువారం నుంచి దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల నుంచి రాండమ్‌గా నమూనాలను సేకరించి వాటిని జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపే ఏర్పాట్లు చేసింది. బెంగళూరు సహా దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో ఇప్పటికే స్క్రీనింగ్ టెస్టులు ప్రారంభమయ్యాయి.

ఎయిర్‌పోర్టులోని ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని కేంద్రం సూచిస్తోంది. కరోనా కొత్త వేరియంట్‌తో భయాపడాల్సిన పనిలేదని, కరోనా జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని స్పష్టం చేసింది. ప్రతివారం కరోనా సమీక్ష సమావేశాలు నిర్వహించి పరిస్థితిని నిశితంగా గమనిస్తామని పేర్కొంది.