Representational image (Photo Credit- Twitter)

New Delhi Dec 22: బీఎఫ్‌.7 అనేది కరోనా ఒమిక్రాన్‌లో సబ్‌వేరియెంట్‌. ప్రస్తుతం చైనా, యూఎస్ దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. అక్టోబర్‌లోనే బిఎఫ్‌.7 కేసులు అమెరికా, కొన్ని యూరప్‌ దేశాల్లో దీనికి సంబంధించిన కేసులు (Fourth COVID-19 Wave Around World) వెలుగులోకి వచ్చాయి. ఈ సబ్‌ వేరియెంట్‌ (BF.7 Omicron Sub-Variant ) కరోనా సోకి యాంటీబాడీలు వచ్చిననవారు, వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో రోగనిరోధక శక్తిని ఎదిరించి మరీ ఇది శరీరంలో తిష్టవేసుకొని కూర్చుంటుంది. అందుకే ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరని అంటువ్యాధుల నిపుణులు సూచిస్తున్నారు.

భారత్‌లో జనవరిలో థర్డ్‌ వేవ్‌ వచ్చిన సమయంలో ఒమిక్రాన్‌లోని బిఏ.1, బీఏ.2 సబ్‌ వేరియెంట్‌లు అధికంగా కనిపించాయి. ఆ తర్వాత బీఏ.4, బీఏ.5లని కూడా చూశాం.ఇప్పుడు తాజాగా దేశంలోకి బీఎఫ్ 7 కూడా వచ్చేసింది. గుజరాత్ లో ఓ మహిళకు బీఎఫ్‌.7 పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

కరోనాపై మరోసారి యుద్ధానికి సిద్ధం, రంగంలోకి ప్రధాని మోదీ, అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించనున్న ప్రధాని, ప్రికాషన్ డోసు సహా కరోనా కట్టడి చర్యలపై సూచనలు చేసే అవకాశం

2021 ఏప్రిల్‌–మే మధ్యలో డెల్టా వేరియెంట్‌తో భారత్‌లో భారీగా ప్రాణ నష్టం జరిగిందని, ఆ సమయంలో కరోనా సోకిన వారిలో రోగనిరోధక శక్తి అధికంగా ఉందని అన్నారు. ఇక ఒమిక్రాన్‌లో బీఎఫ్‌.7 చైనాలో అత్యధికంగా వృద్ధుల ప్రాణాలు తీస్తోందని, మన దేశంలో యువజనాభా ఎక్కువగా ఉండడం వల్ల భయపడాల్సిన పని లేదని డాక్టర్‌ అగర్వాల్‌ చెబుతున్నారు.

Covid in India: దేశంలో మళ్లీ కరోనా అలజడి, ఉన్నతాధికారులతో కేంద్ర ఆరోగ్య మంత్రి అత్యవసర సమావేశం, కోవిడ్ ఇంకా ముగిసిపోలేదని, అప్రమత్తంగా ఉండాలని వెల్లడి 

విస్తృతంగా వ్యాప్తి చెందే ఈ వైరస్‌తో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. గొంతు నొప్పి, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఈ వేరియెంట్‌లో ఎక్కువగా కనిపిస్తాయి. మాసు్కలు ధరించడం, భౌతిక దూరం వంటి జాగ్రత్తలు తీసుకుంటే బీఎఫ్‌.7తో భారత్‌కు ముప్పేమీ ఉండదని వైద్య నిపుణులంటున్నారు. ఈ సబ్‌ వేరియెంట్‌ కేసులు అమెరికాలోని మొత్తం కేసుల్లో 5%, యూకేలో 7.26% ఉన్నాయి. అక్కడ మరీ అధికంగా కేసులు నమోదు కావడం లేదు. ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా అంతగా లేదు. అందుకే భారత్‌లోనూ ఇది ప్రభావం చూపించదనే అంచనాలు ఉన్నాయి.

ఒమిక్రాన్ బీఎఫ్-7 లక్షణాలు (Omicron BF.7 Symptoms)

ఒమిక్రాన్ బీఎఫ్-7 రకం ముఖ్యంగా ఎగువ శ్వాసకోశాన్ని ప్రభావితం చేస్తోంది. దీంతో పాటు జ్వరం, దగ్గు, గొంతు మంట, ముక్కు కారడం, అలసట లక్షణాలు ఉంటాయి. కొంత మంది వాంతులు, విరేచనాలు, కడుపులో నొప్పి వంటి లక్షణాలు కలిగి ఉంటున్నారు. ఇతర కరోనా వేరియంట్ల లాగే.. ఇది కూడా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిని ప్రభావితం చేస్తుంది. శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటాయి.

ముఖ్యంగా దీర్ఘాకాలిక వ్యాధులు, క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. బీఎఫ్-7 ఇతర వేరియంట్లతో పోలిస్తే బలంగా ఉంది. వ్యాక్సిన్ల ద్వారా వచ్చిన వ్యాధినిరోధక శక్తిని కూడా సవాల్ చేస్తూ.. శరీరంలోకి ప్రవేశించి కోవిడ్ వ్యాధికి కారణం అవుతోంది.

రాబోయే కొన్ని నెలల్లో సుమారు 10 లక్షల మంది కరోనావైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఒక అధ్యయనం చెబుతోంది. సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం 85 శాతం మందికి నాలుగో డోస్ వ్యాక్సిన్ పూర్తవుతుందని.. ఫలితంగా కరోనావైరస్ వ్యాప్తి కూడా నెమ్మదిస్తుందని తెలుస్తోంది.చైనాలో రాబోయే 3 నెలల్లో 60 శాతం మందికి ఒమిక్రాన్ బిఎఫ్.7 వేరియంట్ సోకుతుంది అని చైనాకు చెందిన ఎరిక్ ఫీగ్-డింగ్ అనే ఎపిడెమియాలజిస్ట్ చేసిన ట్వీట్ చైనీయులను భయపెడుతోంది.

దేశంలోకి వచ్చేసిన BF.7 వేరియంట్, అమెరికా నుంచి గుజరాత్‌కు వచ్చిన మహిళకు ఓమిక్రాన్ సబ్-వేరియంట్ BF.7 పాజిటివ్‌గా నిర్థారణ

కొన్ని మిలియన్ల మంది కొవిడ్ కారణంగా చనిపోతారని ఎరిక్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఎరిక్ చెప్పిన జోస్యం చైనా పౌరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. మొత్తం ప్రపంచ జనాభాలో 10 శాతం మందికైనా కొవిడ్ సోకుతుందంటున్నాడు ఎరిక్. అలాగే మృతుల సంఖ్య కూడా మిలియన్లలో ఉంటుందని హెచ్చరిస్తున్నాడు.