Telangana Rain Update: వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, తెలంగాణలో వచ్చే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు, ఖమ్మం జిల్లాలో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు

ఈ మేరకు మూడు రోజుల పాటు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది.

Hyderabad Rains: Heavy Waterlogging at Shilparamam toawrds Kothaguda Madhapur Traffic Police are working to ensure free flow of Traffic

Hyd,July 18: తెలంగాణలోని వచ్చే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని (Telangana Rain Update)హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు మూడు రోజుల పాటు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఈ ద్రోణి సముద్రమట్టానికి 1.5 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉందని తెలిపింది.

అలాగే, వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని... రానున్న రెండుమూడు రోజుల్లో బలపడి వాయవ్య దిశగా ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్ జారీ చేసింది.  నేను రెడీ, నువ్వు రెడీనా, రాజీనామాపై హరీష్ రావు కీలక ప్రకటన, కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేయకుండా..

ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

శుక్రవారం నుంచి శనివారం వరకు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాలకు రెడ్‌ అలెర్ట్ జారీ అయ్యింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, హన్మకొండ, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. శనివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.