Telangana Reduces School Timings: తెలంగాణలో ఇకపై 11.30 వరకే స్కూల్స్, ఎండల తీవ్రతతో నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, ఇవాల్టి నుంచే అమల్లోకి కొత్త టైమింగ్స్

స్కూల్ విద్యార్దులు వడదెబ్బ భారిన పడకుండా స్కూల్ టైమింగ్స్ కుదించింది (Reduce School Timings) ప్రభుత్వం. ఇప్పటికే తెలంగాణలో ఒంటిపూట (Half Day schools)బడులు నడుస్తున్నాయి. తాజాగా ఎండల తీవ్రతతో సమయాల్లో మార్పులు చేసింది. బుధవారం పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు పెరిగాయి.

School Student (Representational Image (Photo Credits: Pixabay)

Hyderabad, March 31: తెలంగాణలో గడిచిన నాలుగు రోజులుగా ఎండలు (Heat wave)మండిపోతున్నాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం (Telangana Govt)కీలక నిర్ణయం తీసుకుంది. స్కూల్ విద్యార్దులు వడదెబ్బ భారిన పడకుండా స్కూల్ టైమింగ్స్ కుదించింది (Reduce School Timings) ప్రభుత్వం. ఇప్పటికే తెలంగాణలో ఒంటిపూట (Half Day schools)బడులు నడుస్తున్నాయి. తాజాగా ఎండల తీవ్రతతో సమయాల్లో మార్పులు చేసింది. బుధవారం పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు పెరిగాయి. అత్యధికంగా కుమ్రంభీం జిల్లాల్లో కెరిమెరిలో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ క్రమంలో రాష్ట్ర విద్యాశాఖ అప్రమత్తమైంది. గురువారం నుంచి ఉదయం 11.30గంటల వరకే విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఉదయం 8 గంటల నుంచి 11.30గంటల వరకు పాఠశాలలు పనిచేయనున్నాయి. కుదించిన వేళలు వచ్చే నెల 6వ తేదీ వరకు అమలులో ఉంటాయని పేర్కొంది.

Half-Day Schools in TS: తెలంగాణ‌లో రేప‌ట్నుంచి ఒంటిపూట బ‌డులు, ఉద‌యం 8 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12:30 గంట‌ల వ‌ర‌కు కొనసాగనున్న స్కూల్స్

ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో ఎండల తీవ్రత నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ (Somesh Kumar) బుధవారం వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు. రానున్న రోజుల్లో ఎండలు మరింత తీవ్రమవుతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎండల ప్రభావం వల్ల కలిగే ప్రమాదాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను చైతన్యం చేయాలని సీఎస్‌ సూచించారు. అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అగ్నిమాపక శాఖను అప్రమత్తం చేయాలని కలెక్టర్లకు సూచించారు.

Holidays For AP Schools: ఏపీలో స్కూళ్లకు క్రిస్మస్, సంక్రాంతి పండుగ సెలవు తేదీల ప్రకటన, సంక్రాంతికి ఐదు రోజులు సెలవులు

స్కూళ్ల సమయాలను కుదిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దంచికొడుతున్న ఎండలకు పెద్దవాళ్లే బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. కానీ సమయాన్ని కుదించడంతో ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రంలో మరో ఐదురోజుల పాటూ హీట్ వేవ్ కొనసాగే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Telangana Caste Census: : వీడియో ఇదిగో, కులగణన సర్వే పేపర్లు తగలబెట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, క్రమశిక్షణ చర్యలు తీసుకునే యోచనలో టీపీసీసీ

Andhra Pradesh: ఏలూరులో దారుణం, ఎమ్మారై స్కానింగ్ చేస్తుండగా రేడియేషన్ తట్టుకోలేక మహిళ మృతి, సుష్మితా డయాగ్నస్టిక్‌ సెంటర్‌ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని భర్త ఆందోళన

PM Modi Speech in Lok Sabha: పదేళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికాన్ని జయించారు, లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చ సందర్భంగా ప్రధాని మోదీ

Telangana Assembly Session: అసెంబ్లీలో కులగణన, ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన, ఈ  డేటాను సంక్షేమ విధానాల తయారీకి వాడుతామని వెల్లడి

Share Now