ఏపీలో స్కూళ్లకు సంబంధించి క్రిస్మస్, సంక్రాంతి పండుగ సెలవుల తేదీలను ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్ లో క్రిస్మస్ పండుగ ఉంది. వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి పండుగ ఉంది. డిసెంబర్ 23 నుంచి క్రిస్మస్, జనవరి 10 నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 23 నుంచి క్రిస్మస్ సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. 23, 24, 25 తేదీల్లో స్కూళ్లకు సెలవులు ఉంటాయి. 27వ తేదీ నుంచి స్కూళ్లను రీ ఓపెన్ చేస్తారు. అయితే కొన్ని స్కూళ్లకు మాత్రం ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు సెలవులను ప్రకటించారు. ఈ సెలవులు కేవలం క్రిస్టియన్ మిషనరీ స్కూళ్లకు మాత్రమే వర్తిస్తాయి. క్రిస్టియన్ మిషనరీ స్కూళ్లు డిసెంబర్ 31న పునఃప్రారంభం అవుతాయి.
ఇక సంక్రాంతికి ఐదు రోజులు సెలవులు ఇచ్చారు. జనవరి 10 నుంచి 15వ తేదీ వరకు సెలవులు ఉంటాయి. మిషనరీ స్కూళ్లకు మినహా మిగిలిన స్కూళ్లకు ఈ సెలవులు వర్తిస్తాయి. 16వ తేదీ ఆదివారం కావడంతో 17వ తేదీ నుంచి స్కూల్స్ తిరిగి ప్రారంభం అవుతాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలోని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎస్‌సీఈఆఈర్టీ) అకడమిక్ క్యాలెండర్‌లో పొందుపరిచింది.