COVID19 in Telangana: తెలంగాణలో మరో 1524 పాజిటివ్ కేసులు, 10 కరోనా మరణాలు నమోదు, రాష్ట్రంలో 37 వేలు దాటిన కొవిడ్ బాధితుల సంఖ్య; గాంధీ ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ధర్నా
మంగళవారం నమోదైన మొత్తం కేసుల్లో 815 కేసులు ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదు కాగా, నగరానికి సమీపాన ఉండే రంగారెడ్డి నుంచి ఈరోజు 240 కేసులు వచ్చాయి...
Hyderabad, July 14: తెలంగాణ రాష్ట్రంలో కొద్దిగా కరోనావైరస్ ఉధృతి తగ్గినట్లే ఉంది, అయితే కొత్తగా వచ్చే పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం తక్కువగా చెప్పలేం. గత 24 గంటల్లో కొత్తగా మరో 1524 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 37,745 కి చేరుకుంది.
హాట్‌స్పాట్ హైదరాబాద్ నగరంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. మంగళవారం నమోదైన మొత్తం కేసుల్లో 815 కేసులు ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదు కాగా, నగరానికి సమీపాన ఉండే రంగారెడ్డి నుంచి ఈరోజు 240 కేసులు వచ్చాయి, అలాగే మేడ్చల్ నుంచి 97 కేసులు, మరోపక్క సంగారెడ్డి జిల్లా నుంచి 61 కేసులు నమోదయ్యాయి.
మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 29 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.
#COVID19 in Telangana
మరోవైపు గత 24 గంటల్లో మరో 10 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 375 కు పెరిగింది.
అలాగే, మంగళవారం సాయంత్రం నాటికి మరో 1161 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 22,840 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12,531 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. మనసున్న డాక్టర్, మనసుల్ని కదిలించిన సంఘటన, కొవిడ్ మృతదేహాలకు దగ్గరుండి అంత్యక్రియలు
గత 24 గంటల్లో 13,175 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,95,024 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
మరోపక్క గాంధీ ఆసుపత్రిలోని ఔట్ సోర్సింగ్ సిబ్బంది బుధవారం నుంచి విధులు బహిష్కరిస్తున్నట్లు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. జీతాలు పెంచాలి, తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలనేవి వారి ప్రధాన డిమాండ్లు.